31st నైట్‌, న్యూ ఇయర్‌ పార్టీలు అగ్గువకే మద్యం, అందమైన అమ్మాయిలు

YouSay Short News App

కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. ఫుల్‌గా ఎంజాయ్‌ చేయాలని అనుకుంటారు. పబ్‌లు, రిసార్ట్‌లు వంటి వాటికోసం వెతుకుంతుంటారు. ఇలాంటి వాళ్లే ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లకు టార్గెట్.

వివిధ రకాల ఆఫర్లతో లింక్‌లు పంపడం. వాటిని క్లిక్‌ చేయగానే ఖాతా ఖాళీ చేయడం. ఈ న్యూయర్‌కి సైబర్‌ మోసగాళ్లు ఎంచుకున్న దారి. ఎలాంటి మెసేజ్‌లు వస్తున్నాయో చూడండి.

కొత్త సంవత్సరానికి దుమ్ము రేపుతూ స్వాగతం పలకాల్సిందే అంటూ ఫోన్‌కు మేసేజ్‌లు వస్తున్నాయి. అందులో ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వీటిద్వారానే సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు జాగ్రత్త.

దుమ్ము రేపాల్సిందే

సాధారణంగా న్యూ ఇయర్‌ పార్టీలో మద్యం కామన్‌. దీన్ని ఆసరాగా చేసుకొని తక్కువ ధరకు ఫారెన్ నుంచి తెచ్చిన మద్యం ఇంటికి చేరవేస్తామని లింక్‌ పంపించి డబ్బులు కాజేస్తున్నారు.

అగ్గువకు విదేశీ మద్యం

వేడుకలు చేసుకుంటుంటే సౌండ్‌ బాక్స్‌ లేకపోతే ఎలా. మేము గుమ్మం వద్దకే పంపిస్తాం. లింక్ క్లిక్ చేయండి అంటున్నారు. చేశారంటే ఖాతా ఊడ్చేస్తున్నారు.

డీజే కావాలా

కొంతమంది యువతకు అమ్మాయిల వల విసిరి ఆకర్షిస్తున్నారు. అందమైన అమ్మాయిలతో పార్టీ చేసుకోండని సందేశాలు పంపి లింక్‌ క్లిక్‌ చేయగానే డబ్బు కొట్టేస్తున్నారు.

అందమైన అమ్మాయిలు

ఫుడ్‌ ఆఫర్లు ప్రకటించి దోచేస్తున్నారు కేటుగాళ్లు.  ఏ టైమ్‌ అయినా, ఎక్కడికైనా డెలివరీ చేస్తామంటూ మోసాలకు తెగబడుతున్నారు.

కోరిన ఆహారం

కొత్త సంవత్సరాన్ని కొత్తగా అన్ లిమిటెడ్‌ ఆనందంతో గడపాలనుకుంటే అని వచ్చిందంటే  జర భద్రంగా ఉండండి. అన్‌లిమిటెడ్‌గా మీ ఖాతా ఖాళీ అయిపోతది!

అన్‌ లిమిటెడ్ ఆనందం

ఇది కుటుంబ సభ్యులను ఎక్కువగా టార్గెట్‌ చేసుకొని పంపుతున్న SMS. తక్కువ ధరలో బంధువులతో 5స్టార్ హోటల్‌లో ఆతిథ్యం ఇచ్చేందుకు మేము రెడీ అంటూ మోసం చేస్తున్నారు.

స్టార్‌ హోటల్‌లో సందడి

దిల్లీ, ముంబయి నగరాల్లో వేడుకలకు రిజర్వేషన్లు చేస్తామని అడ్వాన్స్‌ తీసుకొని మోసం చేస్తున్నారట. అక్కడ కేసులు నమోదు కావటంతో ఇక్కడ అప్రమత్తం అయ్యారు.

నయా సాల్‌

ఆఫర్ల ప్రకటనలతో వచ్చే లింకులను క్లిక్ చేయగానే ఎనీ డెస్క్, టైమ్‌వ్యూయర్ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేస్తుంది. అవి రెండు వచ్చాయంటే మనం వారి చేతిలోకి వెళ్లినట్టే.

యాప్‌లతో వ్యాపారం