అధికంగా పన్ను చెల్లిస్తున్నది పేదోడే... ఆక్స్‌ఫామ్ రిపోర్ట్‌లో విస్తుగొలిపే అంశాలు...

YouSay Short News App

1శాతం మంది గుప్పిట్లో 40 శాతం దేశ సంపద

భారత్‌లో ఆర్థిక అసమానతలపై 'ఆక్స్ ఫాం' తాజాగా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశం మొత్తం సంపదలో  40శాతం కేవలం ఒక శాతం ధనవంతుల వద్దే ఉంది.

కేవలం 3 శాతం సంపద మాత్రమే అట్టడుగున ఉన్న మిగిలిన 50శాతం జనాభా వద్ద ఉందని స్పష్టం చేసింది. 'ఇంటర్నేషనల్ సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్' పేరుతో విడుదల చేసిన  ఆక్స్‌ఫామ్ నివేదికలోని ముఖ్య అంశాలను ఓసారి పరిశీలిద్దాం..

వైజాగ్‌లోని యువర్ బ్యాంక్‌ను దోపిడీ చేసేందుకు రెండు గ్యాంగ్‌లు వస్తాయి. అందులో ఓ గ్యాంగ్ చీఫ్ డార్క్ డెవిల్ ( అజిత్ ), కన్మణి (మంజు వారియర్)

సంపద పంపిణీలో అసమానతలు

దేశంలో 50 శాతం జనాభా వద్ద కేవలం 3 శాతం సంపదే ఉంది.

2020లో బిలియనీర్ల సంఖ్య 102 ఉండగా 2022 నాటికి 166కు పెరిగింది

2022లో దేశంలో అపర కుబెరుడైన గౌతమ్ అదానీ సంపద 46 శాతం పెరిగింది

దేశంలో 100 మంది కుబేరుల మొత్తం సంపద  రూ. 53 లక్షల కోట్లకు ఎగబాకింది.

ఈ మొత్తం 18 నెలల కేంద్ర బడ్జెట్‌కు కావాల్సిన నిధులతో సమానం.

2017- 2021 మధ్య పెరిగిన గౌతమ్ అదానీ సంపదపై 1శాతం విధించే పన్నుతో రూ.1.79 లక్షల కోట్ల నిధులు సేకరించవచ్చు.

ఈ మొత్తంతో దేశంలోని ప్రాథమిక స్కూళ్లలో 50 లక్షల మంది టీచర్లకు సంవత్సరం పాటు జీతాలు ఇవ్వొచ్చు.

బిలియనీర్లపై 2 శాతం పన్ను విధిస్తే.. రూ.40,423 కోట్ల ఆదాయం వస్తుంది. దీంతో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు మూడేండ్ల పాటు సమతౌల్య ఆహారం అందించవచ్చు.

ప్రపంచంలోని మల్టీ మిలియనీర్లు, బిలియనీర్లపై  5 శాతం పన్ను విధిస్తే ఏటా 1.7 లక్షల కోట్ల డాలర్లు వసూలవుతుంది. ఈ మొత్తంతో 200 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేయొచ్చు.

భారత్… ధనవంతులను మరింత సంపన్నులుగా మార్చడానికే అభివృద్ధి చెంందుతోందని ఆక్స్‌ఫామ్ తన నివేదికలో విమర్శించింది

పన్ను చెల్లిస్తున్నది పేదలే!

దేశంలో మొత్తం జీఎస్టీ పన్నులో 64 శాతం పన్ను దిగువ సంపద కలిగిన 50 శాతం ప్రజలే చెల్లిస్తున్నారు.

కేవలం 4 శాతం జీఎస్టీ మాత్రమే టాప్ 10 శాతం మంది సంపన్నుల నుంచి వస్తోంది.

పన్నుల భారంతో దేశంలో దళితులు, మహిళలు, అణాగారిన వర్గాల ప్రజలు, అసంఘటిత రంగంలోని కార్మికులు పేదరికంలోనే మగ్గిపోతున్నారు.

దిగజారుతున్న జీవన ప్రమాణాలు

ప్రపంచంలోనే అత్యధికంగా పేదలు భారత్‌లోనే ఉన్నారు. దాదాపు 22 కోట్ల మంది పేదరికంలో జీవిస్తున్నారు.

వేతనం విషయంలో దినసరి కూలీల మధ్య లింగ వివక్ష ఎక్కువగా ఉంది. పురుషులు రూపాయి సంపాదిస్తే.. మహిళలు 63 పైసలే వేతంగా పొందుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పేదలే బిలియనీర్ల కన్నా ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నారని చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగానూ పేదోడే బలి!

ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ 2014 – 2018 మధ్య కాలంలో 3 శాతం చొప్పున మాత్రమే పన్ను చెల్లించాడు.

ఉగాండాలో ఓ పిండి అమ్ముకునే వ్యక్తి నెలకు 80 డాలర్లు సంపాదించి 40 శాతం పన్ను చెల్లిస్తున్నాడని ఆక్స్‌ఫామ్ తెలిపింది.

తగ్గిన కార్పొరేట్ పన్నులు, పన్ను మినహాయింపులు,సంపన్నులు లబ్ది పొందుతున్నారు. వీటిని పెంచాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది.

ఆక్స్‌ఫామ్ సూచనలు

వారసత్వ, ఆస్తి, భూమి పన్నులను పెంచాలి. నికర సంపద పన్ను వంటివాటిని ప్రవేశపెట్టాలి

ప్రజారోగ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి.

అసంఘటిత రంగ కార్మికులందరికీ కనీస వేతనాలు అందించాలి.పేదల సామాజిక భద్రతపై దృష్టి సారించాలి.

రాబోయే బడ్జెట్‌లో సంపద పన్ను వంటి ప్రగతీశీల చర్యలు తీసుకోవాలి.