'5'అత్యుత్తమ  బ్యాటింగ్ ప్రదర్శనలు

Floral Separator

T20WC 2022 లో

పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ టాప్ ప్లేసులో ఉంటుంది. 53 బంతుల్లో 82 పరుగులు చేసి భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు.

1. విరాట్ కోహ్లీ(IND)

పరిస్థితులకు అనుగుణంగా ఆటను నెమ్మదిగా ఆరంభించి చివరికి విజృంభించాడు విరాట్.  6 ఫోర్లు, 4 సిక్సర్లు బాది అజేయంగా నిలిచి ప్రశంసలు అందుకున్నాడు.

శ్రీలంకతో జరిగిన మ్యాచులో స్టాయినిస్ 18 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కీలక అందించాడు. ఇతరులు తడబడుతుంటే స్టాయినిస్ వీరవిహారం చేశాడు.

2. స్టాయినిస్(AUS)

17 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి ఆసీస్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు. ఛేదనలో 21 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు గెలుపును గిఫ్టుగా ఇచ్చాడు.

శ్రీలంకపై ఫిలిప్ చేసిన శతకం మరవలేనిది. బ్యాటర్లు పెవిలియన్లు పడుతున్న వేల ధృడంగా నిలబడి జట్టుకు భారీ స్కోరు అందించాడు.

3. గ్లెన్ ఫిలిప్(NZ)

జట్టు స్కోరు 167 అయితే, అందులో ఫిలిప్ స్కోరు 104. 10 ఫోర్లు, 4 సిక్సులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గట్టెక్కించాడు. లంకపై విజయంలో కీరోల్ పోషించాడు.

బంగ్లాదేశ్‌పై రొసో తన ప్రతాపాన్ని చూపించాడు. 56 బంతుల్లో 109 పరుగులు చేసి కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు.

4. రైలీ రొసో(SA)

8 సిక్సర్లు, 7 ఫోర్లు, 194 స్ట్రైక్ రేట్. ఇదీ రొసో ప్రదర్శన. దొరికిన బంతిని దొరికనట్టు స్టాండ్స్‌కి పంపించాడు. బంగ్లా జట్టు మొత్తం స్కోరు(101).. తన కన్నా 8 పరుగులు తక్కువే.

ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచులోనే ఓపెనర్ కాన్వే విజృంభించాడు. 58బంతుల్లో 92 పరుగులు చేసి న్యూజిలాండ్ స్కోరు బోర్డును 200కి చేర్చాడు.

5. డివాన్ కాన్వే(NZ)

7 ఫోర్లు 2 సిక్సులు బాది ఇన్నింగ్సుని అజేయంగా ముగించాడు. తన ఇన్నింగ్సుతో వరల్డ్‌కప్‌కి కిక్ స్టార్ట్ ఇచ్చాడీ లెఫ్ట్ హ్యాండర్. ఈ మ్యాచులో న్యూజిలాండ్ గెలిచింది.