న్యూ ఇయర్‌కి కొనగలిగే 5 బెస్ట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్
రాయల్ ఎన్‌ఫీల్డ్ చాలా మంది యువకుల కలల బైక్. అందులోనూ ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్. మరి వివిధ అవసరాలను టార్గెట్ చేస్తూ RE తీసుకొచ్చిన బైక్స్‌లో టాప్ 5 ఏంటో చూద్దాం
Royal Enfield హంటర్ 350
ఎన్‌ఫీల్డ్ బైక్స్ అనగానే బరువుగా, భారీగా ఉంటాయి. కాస్త బక్కపలచని వ్యక్తులు వీటిని మేనేజ్ చేయడం కష్టం అలాంటి వారికోసం తెచ్చిందే హంటర్ 350. ఇది ఇప్పుడు అత్యంత చవకైన రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా.
ఫీచర్లు:349.94cc ఇంజిన్ 36.2kmpl మైలేజ్20.4ps పవర్ డిస్క్ బ్రేక్స్27Nm టార్క్ ట్యూబ్‌లెస్ టైర్స్
వేరియంట్స్ఇది మూడు వేరియంట్లలో వస్తోంది. రెట్రో, మెట్రో, మెట్రో రెబెల్. రెట్రోలో స్పోక్ వీల్స్, వెనకాల డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. మెట్రో, మెట్రో రెబెల్ డిస్క్ బ్రేక్స్, ABSతో వస్తాయి.
హంటర్ 350 రెట్రో Rs.1,49,900(ఎక్స్ షోరూం)హంటర్ 350 మెట్రో Rs.1,66,900( ఎక్స్ షోరూం)హంటర్ 350 మెట్రో రెబల్ Rs.1,71,900( ఎక్స్ షోరూం)
ఎవరు కొనొచ్చు?రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే చాలా ఇష్టం కానీ ఆ బరువైన బైక్‌ను నేను మేనేజ్ చేయలేను అనుకునేవారికి ఈ బైక్ చక్కటి ప్రత్యామ్నాయం. కొంచెం రేర్ సెట్‌లో పూట్ పెక్స్ ఉండటంతో కాలేజీ కుర్రాళ్లకు కూడా చక్కగా సరిపోతుంది.
కానీ బైక్ నడుపుతున్నపుడు ఒక భారీ రాయల్ ఎన్‌ఫీల్డ్ నడుపుతున్న ఫీల్ అయితే రాదు. ఇదే ధరలో ప్రత్యామ్నాయం కావాలనుకుంటే TVS Ronin225 పరిశీలించవచ్చు.
Royal Enfield క్లాసిక్ 350
యల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌లో అత్యంత ఎక్కువగా అమ్ముడుపోయే బైక్. కాస్త పర్సనాలిటీ ఉన్న ఎవరికైనా సూట్ అవుతుంది. పవర్‌ఫుల్ ఇంజిన్, అదిరిపోయే పెర్ఫార్మెన్స్ దీని సొంతం.
ఫీచర్లు349.34cc ఇంజిన్ 41.55kmpl మైలేజ్20.21ps పవర్ డిస్క్ బ్రేక్స్27Nm టార్క్ ట్యూబ్‌లెస్ టైర్స్
వేరియంట్లుదీనిలో మొత్తం 6 వేరియంట్లు ఉన్నాయి. రెండు సింగిల్ చానల్ ABSతో వస్తే, మిగతా 3 డ్యూయల్ చానల్ ABSతో వస్తాయి. వేర్వేరు కలర్లు కూడా ఉండాయి.
Rs.1,92,889 ప్రారంభ ధర నుంచి Rs.2,17,589 వరకు ఎక్స్ షోరూం ధరలు ఉంటాయి.
ఎవరు కొనొచ్చురిలాక్స్డ్ మోడ్‌లో బైక్ నడిపేలా ఎర్గానామిక్స్ ఉంటాయి. కాబట్టి రోజువారీ వినియోగానికి ఉపయోగించాలనుకునేవారికి ఇది బెస్ట్ చాయిస్. మైలేజ్ కూడా మిగతా REలతో పోలిస్తే ఇదే ఎక్కువ ఇస్తుంది.
అప్పుడప్పుడూ టూర్లకు వెళ్లాలనుకున్నా పవర్‌ఫుల్ J సిరీస్ ఇంజిన్ ఏ మాత్రం ఇబ్బంది పడకుండా మీకు అద్భుతమైన రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
Royal Enfield Meteor350
ఇది క్లాసిక్ 350లో ఉన్న ఇంజిన్‌తోనే వస్తుంది కానీ ఇదొక క్రూయిజర్ బైక్. విండ్ స్క్రీన్, వెనకవైపు బ్యాక్‌రెస్ట్ వంటి ఉపకరణాలతో బైక్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.
ఫీచర్లు349.34cc ఇంజిన్ 41.88kmpl మైలేజ్20.21ps పవర్ డిస్క్ బ్రేక్స్27Nm టార్క్ ట్యూబ్‌లెస్ టైర్స్
వేరియంట్లుమీటియోర్ కూడా మొత్తం 6 వేరియంట్లలో లభిస్తుంది. ఫైర్‌బాల్, ఫైర్‌బాల్ కస్టమ్, సూపర్‌నోవా ఇలా ఉంటాయి. వేరియంట్, కలర్‌ను బట్టి Rs.2.01 - 2.19 లక్షల వరకూ ఎక్స్ షోరూం ధర ఉంటుంది
ఎవరు కొనొచ్చుక్రూయిజర్ బైక్స్ ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. అలాగే దీని సీట్ హైట్ కేవలం 765mm కాబట్టి పొట్టిగా ఉండేవారికి చాలా అనువుగా ఉంటుంది. వీకెండ్స్‌లో నిత్యం టూర్లకు వెళ్లేవారికి బాగుంటుంది. అలుపులేని ప్రయాణాన్ని ఆస్వాదించగలుగుతారు.
Royal Enfield హిమాలయన్
రాయల్ ఎన్‌ఫీల్డ్ అందించే అడ్వెంచర్ బైక్ ఇది. ఆఫ్ రోడ్ టూరింగ్ కోసం ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మేటి వాహనాల్లో ఇదొకటి.ఫీచర్లు411cc ఇంజిన్ 32.04kmpl మైలేజ్24.31ps పవర్ డిస్క్ బ్రేక్స్32Nm టార్క్ ట్యూబ్ టైర్స్
ఎవరు కొనొచ్చు?విన్యాసాలు చేసేవారికి, కొండలు, గుట్టల్లో టూరింగ్‌లకు వెళ్లేవారికి ఈ బైక్ పనిచేస్తుంది. లాంగ్ రైడ్స్ చేసేవారికి కూడా పర్ఫెక్ట్ ఆప్షన్. కానీ పొట్టిగా ఉండేవారు దీనిని మోయలేరు, కాళ్లు కూడా అందవు. అలాగే దీనిని పూర్తి స్థాయిలో మేనేజ్ చేయాలంటే ప్రొఫెషనల్ బైకర్ అయి ఉండాలి.
Royal Enfield కాంటినెంటర్ Gt650
కాంటినెంటల్ Gt650 ఒక వింటేజ్ కెఫే రేసర్ బైక్. 50s,60s స్టైల్‌లో అదిరిపోయే లుక్‌లో ఉండే రెట్రో బైక్. అలాగే చాలా పవర్‌ఫుల్ బైక్ కూడా.
ఫీచర్లు648cc ఇంజిన్ 25kmpl మైలేజ్47ps పవర్ డిస్క్ బ్రేక్స్52Nm టార్క్ ట్యూబ్ టైర్స్వేరియంట్లుకాంటినెంటల్ GT 3 వేరియంట్లు, 5 కలర్లలో లభిస్తోంది.
ఎవరు కొనొచ్చు?గీత గోవిందంలో విజయ్‌లా బైక్‌పై స్టైలిష్‌గా కనిపించాలనుకునేవారికి కాంటినెంటల్ GT పర్ఫెక్ట్ ఆప్షన్. చూడటానికి రెట్రో డిజైన్ నడిపేటప్పుడు మోడర్న్ ఫీలింగ్ ఇస్తుంది. కెఫే రేసర్ కొనాలనుకుంటే మాత్రం ఈ సెగ్మెంట్‌లో ఉన్న ఏకైక బైక్ ఇదే.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ Scram411, రాయల్ ఎన్‌ఫీల్డ్ Interceptor కూడా చాలా మందికి నచ్చిన బైక్స్.