5 Reasons to watch “వాల్తేరు వీరయ్య”

YouSay Short News App

గాడ్‌ఫాధర్‌తో ఈ ఏడాది చివర్లో హిట్‌ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆ ఫార్ములా కొనసాగించాలని చూస్తున్నాడు. మాస్‌ ఎంటర్‌టైనర్‌ వాల్తేరు వీరయ్యతో సంక్రాంతికి వస్తున్నాడు.

సినిమా టీజర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. అసలు పండగకి ఈ చిత్రం ఎందుకు చూడాలంటే?

చిరంజీవి నుంచి మాస్ మసాలా చిత్రం వచ్చి చాలా రోజులయ్యింది. ఈసారి ఫుల్‌ లెంగ్త్ మాస్‌ రోల్‌ చేశాడు. మరి చిరు యాక్షన్‌ మిస్ అవ్వకూడదంటే చిత్రం చూడాల్సిందే.

మాస్ మసాలా

సినిమాలో మెగాస్టార్ డీజే వీరయ్య లుక్‌ ఇప్పటికే క్లిక్ అయ్యింది. గల్ల లుంగీ, కూలింగ్ గ్లాసు చూసి అందరూ ఏం లుక్‌ బాసూ అంటున్నారు. ఈ లుక్‌ తెరపై చూడకుంటే ఎలా?

ఏం లుక్ బాసూ

వాల్తేరు వీరయ్య చిత్రానికి సంగీతం ప్లస్‌ పాయింట్. విడుదలకు ముందే బాస్‌ పార్టీ అంటూ వచ్చిన పాట మిలియన్స్‌ వ్యూస్‌ దాటేసింది. ఈ పాటలకు సిల్వర్ స్క్రీన్‌పై బాస్ గ్రేస్ చూసేయండి.

దేవీ మ్యాజిక్

సినిమాలో మాస్‌ రాజా రవితేజ కీలకమైన రోల్‌ చేశాడు. తెలంగాణ యాసలో అదరగొడుతూ రిలీజ్‌ అయిన ప్రోమో అంచనాలు పెంచింది. అందుకే రవితేజ ఫ్యాన్స్‌ కూడా వెయిటింగ్‌.

బాస్‌ - మాస్‌ కాంబో

సంక్రాంతి రేసులో చిరంజీవి ఎన్నో సూపర్ హిట్స్ కొట్టారు. మరోసారి బాలయ్యతో పోటీకి దిగారు. ఇందుకోసమైనా ఎలా ఉందో చూడాలని ఇద్దరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

చిరు - బాలయ్య క్లాష్