IQoo నుంచి మార్కెట్‌లోకి కొత్త 5G ఫోన్‌

YouSay Short News App

వివో సబ్‌ బ్రాండ్‌ IQoo ట్రెండ్‌ సెట్‌ చేస్తోంది. మార్కెట్‌లో విడుదలైన అన్ని ఫోన్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. రోజురోజుకి డిమాండ్‌ పెరుగుతుండటంతో మరిన్ని మోడల్స్‌ను రిలీజ్‌ చేస్తున్నారు.

IQoo నుంచి 11 సిరీస్‌ జనవరి 10న విడుదల అవుతుంది. ఇప్పటికే డిసెంబర్‌ 2న చైనా మార్కెట్‌లోకి వచ్చిన ఫోన్‌ రేపు భారత్‌లో లాంచ్‌ చేస్తున్నారు. అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది.

రెండు మోడల్స్‌లో ఫోన్‌ విడుదలవుతుంది. IQoo 11, IQoo 11pro పేరుతో మార్కెట్‌లోకి వస్తున్నాయి.

IQoo 11 సిరీస్‌

అమెజాన్ వేదికగా జనవరి 10న ఫోన్‌లు లాంఛ్‌ అవుతున్నాయి. 13న సేల్ ప్రారంభం కానుంది.

ఎక్కడ? ఎప్పుడు?

11proలో ఆక్టాకోర్ 4nm స్నాప్‌ డ్రాగన్ 8th జనరేషన్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. IQooలో మాత్రం క్వాల్‌కామ్ స్నాప్‌ డ్రాగన్‌ను వాడారు.

ప్రాసెసర్‌

రెండు మోడల్స్‌లోనూ 6.78inch డిస్‌ప్లే ఉంటుంది. సామ్‌సంగ్‌ S6 మాదిరిగా 2K రిజల్యూషన్‌తో అమోల్డ్‌ డిస్‌ప్లే ఇచ్చారు.

డిస్‌ప్లే

IQoo 11లో 5000mah బ్యాటరీ సౌలభ్యం ఉంది. కానీ, 11proలో మాత్రం 4700mah బ్యాటరీని అమర్చారు.

బ్యాటరీ

రెండు మోడల్స్‌లోనూ 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా అందుబాటులో ఉంది. కానీ, బ్యాక్‌ కామ్‌లో మాత్రం తేడాలు ఉన్నాయి. 11 proలో 50+50+1mp కెమెరా ఉండగా.. 11లో 50+13+8mp కామ్స్‌ ఉన్నాయి.

కెమెరా

IQoo 11లో 8 జీబీ RAM, 128 జీబీ స్టోరేజీ ఉంది. 11proలో 256జీబీ స్టోరీజీ ఇచ్చారు.

స్టోరేజీ

AnTuTu బెంచ్‌మార్క్‌ స్కోర్‌లో IQOO 11 రికార్డు క్రియేట్‌ చేసింది. ఇందులో ఉన్న స్నాప్‌డ్రాగన్‌ 8 Gen 2 ప్రాసెసర్‌తో ఇప్పటిదాకా ఏ ఫోన్‌ సాధించలేని 1.3 మిలియన్‌ ప్లస్‌ స్కోరును నమోదు చేసింది.

పెర్ఫార్మెన్స్‌

ఫోన్‌ యాస్పెక్ట్‌ రేషియో 20 : 9, HDR10+ సపోర్ట్‌ చేస్తుంది. రిజల్యూషన్ 1440x3200 పిక్సెల్స్.

రిజల్యూషన్

డిస్‌ప్లే DCI-P3ని సపోర్ట్‌ చేస్తుంది. ఇందులో వాపర్ చాంబర్ కూలింగ్‌ ప్లేట్‌ ఉండటం వల్ల ఫోన్‌ హీట్‌ అవ్వదు. గేమింగ్‌ ఎక్కువగా వాడేవారికి ఉపయోగపడుతుంది.

గేమింగ్‌

120 వాట్‌ పవర్‌ ఛార్జ్‌ను ఇస్తున్నారు. కేవలం 8 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ ఎక్కుతుంది.

స్పీడ్‌ ఛార్జింగ్‌

దీని ధరపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే అంచనా ధర రూ. 44 వేల నుంచి ప్రారంభమవుతుందని తెలిసింది.

ధర: