ఇందిరా గాంధీని

YouSay Short News App

ఉక్కు మహిళగా మార్చిన

6 కీలక నిర్ణయాలు...

భారతదేశాన్ని పాలించిన గొప్ప ప్రధానుల్లో ఇందిరా గాంధీ ఒకరు. ఆమె పదవికాలంలో కొన్ని నిర్ణయాలు ఇప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.

(Images Source : WikiMedia)

 నాటి పురుషాధిక్య సమాజంలోనూ ఆమె తీసుకున్న కఠిన నిర్ణయాలు ఇందిరా గాంధీని ఉక్కుమహిళగా నిలిపాయి. ఆమె పుట్టిన  రోజు సందర్భంగా ప్రత్యేక కథనం

బ్యాంకుల జాతీయం

స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచి దేశంలోని బ్యాంకులు కొంత మంది జమీందార్లు, పెట్టుబడిదారుల చేతుల్లో ఉండేవి. పట్టణాలకు మాత్రమే పరిమితంగా ఉండేవి. వేల కోట్ల ప్రజా సంపద బ్యాంకుల్లో మూలుగుతూ ఉండేది.

బ్యాకింగ్ సేవలను గ్రామాలకు విస్తరించేందుకు 1969 జులై 19న రూ.100 కోట్లకు పైగా మూలధన పెట్టుబడి ఉన్న 14 బ్యాంకులను జాతీయం చేశారు. బ్యాంకింగ్ సేవలను ప్రతిపౌరుడికి అందేలా చేశారు.

బ్యాంకింగ్ రంగంలో PSLRను ప్రవేశపెట్టారు. బ్యాంకులు అందించే రుణాల్లో 40శాతం ప్రాధాన్య రంగాలు( విద్యా, వ్యవసాయం, పేదలు, గృహనిర్మాణం, ఉపాధి) వంటి రంగాలకు కేటాయించాలని షరతు విధించారు.

అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం వల్లే ఎన్ని ఆర్థిక ఒడిదొడుకులు ఎదురైనా భారతదేశ ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడుతోంది.

హరిత విప్లవం

మెక్సికో సాయంతో సంకర జాతి విత్తనాలను భారత్‌లో పండించి హరిత విప్లవానికి కృషి చేశారు. తొలి తరం హరిత విప్లవం ఫలాలు హరియాణ, ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాలకు లభించాయి.

దేశంలో నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచి వ్యవసాయ ఉత్పత్తిని పెంచారు. హరిత విప్లవం వల్ల దేశంలో ఆహార సంక్షోభాన్ని నియంత్రించగలిగారు.

ఉక్కు మహిళగా అవతరణ

1969-70లో తూర్పు పాకిస్తాన్‌లో(బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్తాన్‌(ప్రస్తుత పాకిస్థాన్) బలగాలు సృష్టించే అల్లర్లను, అరాచకాలను భరించలేక లక్షలకొద్దీ ప్రజలు భారతదేశంలోకి వలస రావడం మొదలుపెట్టారు.

పశ్చిమ పాకిస్థాన్‌ నుంచి విముక్తి కోసం తూర్పు పాకిస్తాన్ ప్రజలు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు భారత్‌పై ఆంక్షలు విధిస్తామని బెదిరించినా ఇందిరా తలొగ్గలేదు.

వారికి తన మద్దతును తెలుపుతూ మన దేశ సైన్యాన్ని వారికి అండగా పంపించింది.

మనదేశ సైన్యం సహకారంతో బంగ్లా స్వాతంత్ర్య సమరయోధులు విజయం సాధించి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి బీజం వేశారు.

1971 పాకిస్తాన్‌పై విజయం సాధించిన భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

అణుపాటవానికి నాంది

పశ్చిమ దేశాల బెదిరింపులకు లొంగని ఇందిరా గాంధీ 1974లో రాజస్థాన్ ఎడారిలోని పోఖ్రాన్లో అణుపాటవ పరీక్ష చేసి సత్తాచాటింది.

అంతేకాదు, ఆ చర్య వల్ల భారత అణు కార్యక్రమానికి బలమైన పునాది పడింది.

రాజభరణాల రద్దు

బ్రిటిష్ కాలంలో జమీందార్లకు కేటాయించిన బహుదూర్, రావుబహుదూర్ వంటి బిరుదులను ఇందిరా రద్దు చేశారు. వారికి ప్రభుత్వం నుంచి వచ్చే అన్నిరకాల ప్రత్యేక సదుపాయాలను తొలగించారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్న భావన తీసుకొచ్చారు.

రూపాయి మూల్య న్యూనీకరణ

1966లో రూపాయి మూల్య న్యూనీకరణ చేసి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు చెల్లించే ఖర్చును తగ్గించగలిగారు.

20 సూత్రాల పథకం

పేదరిక నిర్మూలన కోసం 1975లో 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు.

1. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం. 2. ఉత్పత్తికి ప్రేరణ ఇవ్వడం 3. మిగులు భూమిని పంపిణీ చేయడం. 4. గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం. 5. భూమి లేని కార్మికులకు కనీస వేతనాలు అందించడం. 6. బందీలో ఉన్న కార్మికులకు పునరావాసం కల్పించడం. 7. ఎస్సీ ,ఎస్టీ తెగల అభివృద్ధికి గృహ వసతి  కల్పించడం. 8. ప్రతి గ్రామానికి విద్యుత్‌ ‌సౌకర్యం కల్పించడం 9 కుటుంబ నియంత్రణకు చర్యలు చేపట్టడం. 10. చెట్ల పెంపకం చేపట్టి అటవీ విస్తీర్ణం పెంచడం.

11. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం. 12. మహిళలు మరియు పిల్లల సంక్షేమం కోసం      కార్యక్రమాలు చేపట్టడం 13. ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలు విస్తరించడం 14. గ్రామీణ,పట్టణ ప్రజలకు చేయూతను     అందించడం. 15. నీటిపారుదల వసతులు కల్పించడం. 16. ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం చేయడం. 17. పారిశ్రామిక విధానాలను సరళీకృతం చేయడం. 18. నల్లధనం నియంత్రించడం. 19. తాగునీటి సౌకర్యాలు కల్పించడం 20. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం.

ఇందిరా తన జీవితంలో ఎమర్జెన్సీ వంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నా... భారత ఆర్థిక సంస్కరణలకు ఎంతగానో కృషి చేశారు.