న్యూ ఇయర్‌కి స్నేహితులతో ధూమ్ ధామ్ చేసేందుకు ఏపీలో 7 ప్రదేశాలు

You Say Short News App

కొత్త సంవత్సరం 2023 స్నేహితులతో కలిసి ధూమ్ ధామ్‌గా జరుపుకోవటానికి ఆంధ్రప్రదేశ్ లోని టాప్ ప్లేసెస్‌ ఏంటో ఓ లుక్కేయండి.

విశాఖపట్టణం

అందమైన ప్రకృతి, కొండ ప్రాంతాలు, బీచ్‌లు, మబ్బులు కనిపించని నీలాకాశం ఈ ప్రాంతం ప్రత్యేకత. పార్టీలు చేసుకోవాలనుకునే వారికి, సుదూర ప్రాంతాలంటే ఇష్టమున్న వారికి వైజాగ్ సూపర్ ప్లేస్.

రిషి కొండ బీచ్, జలపాతాలు, రిసార్ట్‌లు వేడుకలు జరుపుకోవటానికి మంచి ప్రదేశాలు.

గండికోట

కడప జిల్లాలో గండి కోట ఉంది. దీనిని భారతదేశపు లోయ అంటారు. పెన్నా నదిపై నిర్మించబడిన సహజ సిద్ధ ప్రాంతాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఈ ప్రాంతంలో నైట్ క్యాంప్, భోగి మంటలు, హైకింగ్ చాలా ఫేమస్.

అనంతగిరి హిల్స్‌

వైజాగ్‌కు అతి సమీపంలోని హిల్ స్టేషన్‌  అనంతగిరి హిల్స్. కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ అందమైన ప్రకృతి, కాఫీ తోటలు, యాపిల్ తోటలు ప్రత్యేక ఆకర్షణలు.

బొర్రా గుహలు

దేశంలోనే అతిపెద్ద గుహలు బొర్రా గుహలు. అరకు వ్యాలీకి దగ్గరగా ఉంటుంది. సహజసిద్ధంగా నిర్మించబడిన అద్భుతమైన కట్టడాల్లో ఈ గుహలు ప్రసిద్ధి.

ఎన్నో రకాల పక్షులు, గబ్బిలాలు ఇక్కడ తిరుగుతూ కనిపిస్తాయి.

మారేడుమిల్లి

గిరిజన చరిత్రను కల్లకు కట్టే విధంగా చూపించే మారేడుమిల్లి ప్రాంతం భద్రాచలం నుంచి 5 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.

జీవ వైవిధ్యం, సతత హరిత అడవులు, తూర్పు కనుమల్లోని భూమి మారేడిమిల్లి చుట్టూ కేంద్రీకృతమై ఉంది.

కైగల్ ఫాల్స్‌

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో సహజ సిద్ధమైన కైగల్ ఫాల్స్ జలపాతం ఉంది. 40 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతూ అదిరిపోయే దృశ్యాలతో కనువిందు చేసే జలపాతం ఇది.

ఈ ప్రాంతంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు శివలింగ ఆలయం, కౌండిన్య వన్య ప్రాణుల అభయారణ్యం.

కర్నూల్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో రాక్ గార్డెన్ ఉంటుంది. నంద్యాల - కర్నూలు మార్గంలో విమానాశ్రయానికి చాలా దగ్గర. ఈ గార్డెన్‌లో సహజ రాతి నిర్మాణాలు ఒక సరస్సుక దారి చూపేలా చెక్కారు.

ఓరవల్లు రాక్ గార్డెన్

స్థానికంగా కనిపించే ఎన్నో విశేషాలు మనల్ని కచ్చితంగా అబ్బుర పరుస్తాయి.