న్యూ ఇయర్‌కి కుటుంబంతో కలిసి ఏపీలో చూడదగిన  7 ప్రదేశాలు

You Say Short News App

కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ ఆనందంగా గడపాలనుకునే వారు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని అందమైన ప్రదేశాలకు వెళ్లవచ్చు. అక్కడ కుటుంబంతో కలిసి సరాదాగా గడపవచ్చు.  ఆ ప్రదేశాలేంటో తెలుసుకోండి.

అరకు వ్యాలీ

ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల పర్వత శ్రేణిలో ఉన్న అత్యంత సుందరమైన హిల్ స్టేషన్ అరకు. వైజాగ్ నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

సుమారు 3 - 4 గంటల్లో వెళ్లవచ్చు. అరకులో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు బొర్రా గుహలు, ట్రైబల్ మ్యూజియం, అరకు జలపాతం.

లంబసింగి

తూర్పు కనుమల్లో ఓ చిన్న పట్టణం లంబసింగి,  ఇది చుట్టూ చెట్లతో కప్పబడి ఉంటుంది. దీనిని ఆంధ్రప్రదేశ్ కశ్మీర్ అంటారు.

ఇది కూడా విశాఖపట్టణం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బొజ్జన్న కొండ, తజంగి రిజర్వాయర్, కొత్తపల్లి జలపాతాలు మర్చిపోకుండా చూడాలి.

విశాఖపట్టణం( వైజాగ్ )

ఆంధ్రప్రదేశ్ లో సముద్ర తీరం కలిగి ఉన్న అందమైన పర్యాటక ప్రాతం వైజాగ్. బీచ్ లు, కొండప్రాంతాలు, ప్రకృతి అందాలు నగరం చుట్టూ విస్తరించి ఉన్నాయి.

హైదరాబాద్ నుంచి 12 గంటల ప్రయాణం. రెండుచోట్ల ఎయిర్ పోర్టు ఉంది కనుక విమాన ప్రయాణం కూడా చేయవచ్చు. రిషి కొండ బీచ్, VMRDA INS కుర్సురా సబ్ మెరైన్ మ్యూజియం, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, డాల్ఫిన్స్ నోస్  కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు

తిరుపతి

ఆధ్యాత్మిక శోభ కలిగి ఉండి సెలువుల్లో కచ్చితంగా వెళ్లాల్సిన ప్రాంతం తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతిలో ముఖ్యమైన మూడు ప్రదేశాలు కపిల తీర్థం, శిలా తోరణం, తలకోన.

శ్రీశైలం

నల్లమల అడవుల్లో శ్రీశైలం గ్రామం ఉంది. ఇక్కడ రిజర్వాయర్, ఘాట్ రోడ్డు, మల్లి కార్జున స్వామి ఆలయం గురించి తెలియని వారు ఉండరు. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు సుమారు 250 కిలోమీటర్లు ఉంటుంది.

భవానీ ద్వీపం

భారతదేశంలోని నదీ ద్వీపాలలో ఇది ఒకటి. విజయవాడలో కృష్ణా నది మధ్యలో ఈ ద్వీపం నెలకొంది. ఇక్కడ డైనోసార్ పార్క్, తేలియాడే తినుబండారాలు, బోటింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్ కు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కోనసీమ

ఏపీలోని కోనసీమ పచ్చదనం చుట్టూ  మారేడుమిల్లి, మడ అడవులు, పాపికొండలు, కొల్లేరు సరస్సు వంటివి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని సహజమైన ప్రకృతి అందాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.