బ్యాచిలర్‌ న్యూఇయర్ సెలెబ్రేషన్స్‌కు

8 బెస్ట్ స్పాట్స్‌

YouSay Short News App

గోవా

న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు గోవాను మించిన మరొక టూరిస్ట్ స్పాట్ ఇండియాలోనే లేదు. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు గోవాకు వస్తారు. బీచ్‌లు, మ్యూజిక్ కాన్సెప్ట్స్, వాటర్ స్పోర్ట్స్, క్లబ్బులు అందరినీ ఇక్కడికి వచ్చేలా ఆకర్షిస్తాయి.

డిసెంబర్, జనవరి మాసాల్లో ఇక్కడ ఎక్కువగా పార్టీలు జరుగుతాయి. స్నేహితులతో కలసి గోవాలో తెగ ఎంజాయ్ చేయవచ్చు. దంపతులు, కుటుంబసభ్యులతో ఇక్కడికి రాకపోవడం ఉత్తమం.

పుదుచ్చేరి

న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు మరొక గొప్ప వేదిక పుదుచ్చేరి. ఇక్కడ న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ప్రెండ్స్‌తో కలసి ఇక్కడ వేడుకల్లో సందడి చేయవచ్చు.

మీరు ఇక్కడ ఉంటే విదేశాల్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. దేశంలో టూరిస్టులు అత్యధికంగా వచ్చే ప్రదేశాల్లో పుదుచ్చేరి కూడా ఒకటి. ఇక్కడి జీవనశైలి, ఆర్కిటెక్చర్, వంటకాలను స్నేహితులతో  ఆస్వాదించవచ్చు.

మనాలి

మనాలి న్యూఇయర్ వేడుకలకు బెస్ట్ చాయిస్. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దేవతల లోయగా పిలిచే మనాలిలో న్యూఇయర్ వేడుకలు గ్రాండ్‌గా జరుగుతాయి.

ఈ స్పాట్ కుర్రాళ్లకు తెగ నచ్చుతుంది. నైట్‌లైఫ్, పబ్స్, అవుట్‌డోర్ క్యాంపింగ్, ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్ అన్నీ ఇక్కడ ప్రసిద్ధి. ఒక్క మాటలో చెప్పాలంటే మనాలి న్యూఇయర్ వేడుకలకు బెస్ట్ ఆప్షన్.

గ్యాంగ్‌టక్

ఈశాన్య రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలనుకుంటే గ్యాంగ్‌టక్ బెస్ట్ ఛాయిస్. తూర్పు హిమాలయ ప్రాంతాల్లో ఇది ఎత్తైన సిటీ. ఎత్తైన పర్వతాలు, మంచు ప్రదేశాలను ఇష్టపడేవారికి ఇక్కడ న్యూఇయర్ పార్టీ చేసుకోవచ్చు.

పబ్స్, నైట్‌క్లబ్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్, రెస్టారెంట్లలో సేద తీరవచ్చు. 2023 న్యూఇయర్ వేడుకలను గ్యాంగ్‌టక్‌లో మీ ఫ్రెండ్స్‌తో కలసి జరుపుకుంటే మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

కేరళ

న్యూఇయర్, క్రిస్టమస్ పండుగలు కేరళలో అతిపెద్ద పండుగలు. కేరళను ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అంటారు. ఈ రాష్ట్రం ప్రక‌ృతి ప్రేమికులకు స్వర్గ నిలయం. కేరళను సందర్శిస్తే ప్రపంచాన్నే చూసినంత అనుభూతి కలుగుతుంది.

అలెప్పీలోని బోట్ హౌసింగ్, కొచ్చిలోని పబ్బులు మిమ్మల్ని న్యూ ఇయర్ వేడుకలకు వచ్చేలా చేస్తాయి. మీరు మీ స్నేహితులతో కలసి కేరళ అందాలను ఆస్వాదించవచ్చు. వస్తూ వస్తూ కేరళ వంటకాలను కూడా తప్పకుండా రుచి చూడాల్సిందే.

అండమాన్ నికోబార్ దీవులు

అండమాన్ నికోబార్ దీవుల్లో న్యూఇయర్ వేడుకలు నిర్వహించుకోవడం ప్రత్యేక అనుభూతిగా మిగిలిపోతుంది.  ఈ దీవుల్లో ఎన్నో అద్భుత పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. బారాటాంగ్ ఐలాండ్, రాధానగర్ బీచ్, హావలాక్ ఐలాండ్, నీల్ ఐలాండ్, మహాత్మాగాంధీ జాతీయ పార్కు వంటివి మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాయి.

అండమాన్ పర్యటన మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఇక్కడ ఉంటే అచ్చం విదేశాల్లో ఉన్న అనుభూతే కలుగుతుంది. న్యూఇయర్ వేడుకలకు పర్ఫెక్ట్ డెస్టినేషన్. మీ కుటుంబంతో పర్యటించేముందు.. ఒకసారి స్నేహితులతో ఇక్కడికొచ్చే ప్రయత్నం చేయండి.

గోకర్ణ

సౌత్ ఇండియాలో ఉన్న అత్యుత్తమ బీచ్‌లలో గోకర్ణలో  5 ఉన్నాయి. ఇది కర్నాటకలో ఉంది. గోకర్ణ బీచ్, కుండల బీచ్, ఓం బీచ్, పారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్ ఇలా ఐదు ఉన్నాయి.

ఇక్కడి బీచ్‌లలో మీ బడ్డీలతో కలసి పార్టీ చేసుకోవడం కన్నా అంతకు మించి ఏముంటుంది. ఈ గోకర్ణ నగరం నదులు, హిల్స్, ఆలయాలకు కూడా ఎంతో ప్రసిద్ధి.

ముంబై

నిద్రపోని నగరంగా పేరొందిన ముంబైలో న్యూఇయర్ వేడుకలు కళ్లు చెదిరే రీతిలో జరుగుతాయి. మీరు నైట్‌లైఫ్‌ను ఇష్టపడేవారైతే ముంబై కరెక్ట్ డెస్టినేషన్.

ఇక్కడ ఎంతో ఖరీదైన నైట్‌లైఫ్ ప్రదేశాలు, రిసార్టులు ఉన్నాయి. ఇక్కడ సెలెబ్రేషన్స్ చేసుకోవడం అందరికీ ఎంతగానో నచ్చుతుంది. మీ స్నేహితులతో కలసి న్యూఇయర్ ఎంజాయ్ చేయడానికి ముంబై ఒక బెస్ట్ లొకేషన్.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌  డౌన్‌లోడ్‌ చేసుకోండి.