ఈ 8 మాటలతో మీ బాయ్‌ఫ్రెండ్‌ను మీ ప్రేమకు బానిసను చేసుకోండి
YouSay Short News App
ప్రేమించిన అమ్మాయికి ప్రియుడే సర్వస్వం. తన కోసం ఏదైనా చేయాలని ఆరాటం ప్రేయసికి ఉంటుంది. అదే సమయంలో ప్రియుడిని కొంగున ముడేసుకుని వెనక తిప్పుకోవాలని ఉబలాటపడుతుంది. మరి అలా మీ వెంటే తిరగాలంటే పెద్దగా కష్టపడక్కర్లేదు.
మనసును హత్తుకునే మాటలు చాలు. హృదయాన్ని కదిలించే భావాలు పలికిస్తే.. ఏ మగాడైనా చంటిపిల్లాడు కావాల్సిందే. మరి ఆ మహత్తరమైన మాటలు, మైమరిపించే భావాలేంటో ఓసారి చూద్దామా..!
కన్నా..చిన్నా..చింటూ..
అందరూ పిలిచినట్టే మీరు పిలిస్తే ఏముంది? కన్నా, చిన్నా, చింటూ అని ప్రేమగా పిలిచి చూడండి. అబ్బాయి ఆనందానికి హద్దులుండవు. మీ పిలుపు కోసం పడిగాపులు కాస్తుంటాడు.
ఐ మిస్ యూ రా
ఈ మాట అన్నారంటే ఏడు సముద్రాల ఆవల ఉన్నా చటుక్కున దాటుకుని వచ్చేస్తాడు. అబ్బాయిలకు ‘నా పిల్ల నన్ను మిస్సవుతోంది’ అనే ఫీలింగ్ మీరంటే పడి చచ్చేలా, మీతోనే టైం అంతా గడిపేలా చేస్తుంది.
మా నాన్నే నా పక్కన ఉన్నట్లు ఉంటుంది
ఒక్కసారి మీవాడికి ఈ మాట చెప్పి చూడండి. పొంగిపోతాడు. మీపై చూపించే శ్రద్ధ మరింత ఎక్కువవుతుంది. ఏ అబ్బాయైనా తన ప్రేయసి తనను
ఓ రక్షణ కవచంలా చూడాలనుకుంటాడు. మీరు
ఈ మాట చెబితే అతడి సంబరానికి హద్దుండదు.
థాంక్యూ/సారీ రా..
మనోడే కదా థ్యాంక్స్ ఎందుకు అనిపించొచ్చు. ‘థ్యాంక్యూ’, ‘సారీ’ అనే పదాలు కేవలం ప్రేమలోనే కాదు ఏ బంధంలో అయినా చాలా ముఖ్యం.
నువ్వు చేయగలవు
ప్రతి మగాడి విజయం వెనకా ఓ ఆడది ఉంటుంది అంటారు కదా! దానికి ఈ మాటే కారణం. ఓ అబ్బాయి తనను ఎవరు నమ్మకపోయినా పర్లేదు కానీ ప్రేయసి నమ్మితే చాలనుకుంటాడు. ఒక వేళ మీరు గానీ ‘నువ్ చేయగలవ్’ అంటూ ప్రోత్సహించారా! ఇక అతడు
మీ దాసుడే!!
ఐ లవ్ యూ రా..
ప్రేమించుకున్న కొత్తలో తరచూ చెప్పుకునే ఈ మాట రాను రానూ తగ్గిస్తుంటారు. కానీ అమ్మాయిలూ..!
మీ వాడికి ‘ఐ లవ్ యూ’ చెప్పడం మాత్రం మానొద్దు.
ఈ 3 మ్యాజికల్ వర్డ్స్.. ప్రేమ అనే మొక్కకు నీళ్ల లాంటివి.
నువ్వు దూరంగా ఉన్నా నా పక్కనే ఉన్నట్టుంది
దూరం, నిరీక్షణ ప్రేమను పెంచుతుందంటారు. అయితే దూరంగా వారు మీ దగ్గరే ఉన్నట్లు ఉందని చెప్పండి. అతడు కూడా మీరు పక్కనే ఉన్నట్లు ఊహించుకుంటాడు. మరో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడడు.
నా ప్రపంచం/ సర్వస్వం నువ్వే రా
తానే మీ ప్రపంచమని చెప్పండి. ఇక అతడి ప్రపంచమంతా మీరే అవుతారు. మీ జీవితంలో తను మాత్రమే ఉన్నాడని చెబితే తన జీవితం నిండా మిమ్మల్నే నింపుకుంటాడు.
ఇలాంటి మాటల పూదోటలు ప్రేమలో ముఖ్యమే గానీ అన్నింటి కన్నా ఏ బంధానికన్నా బలాన్నిచ్చేది నమ్మకం. మీరు తనను నమ్ముతున్నారన్న నమ్మకం తనలో కలిగించండి. ఇద్దరి మధ్య నమ్మకం అనే వారధి ఉన్నంత కాలం ప్రేమ ప్రయాణానికి ప్రమాదమమే ఉండదు!
ప్రేమకు చిరు చిట్కా - బహుమతి ఇవ్వడం
అబ్బాయిలు నిత్యం అమ్మాయిలకు ఏదో ఒక సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తుంటారు. కానీ ఓ సారి మీరు మీ బాయ్‌ఫ్రెండ్‌ను సర్‌ప్రైజ్ చేయండి. ఏదైనా బహుమతి ఇవ్వండి. దానిని ఎంత అపురూపంగా చూసుకుంటాడో మీరు కనీసం ఊహించరు