చర్మాన్ని తినేస్తున్న జాంబీ డ్రగ్‌ US వీధుల్లో వణుకు

YouSay Short News App

మత్తుకు బానిసై జీవితాలను చిత్తు చేసుకుంటున్న యువత ప్రపంచమంతా పెరుగుతున్నారు. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

తాజాగా యూఎస్‌ వీధుల్లో అత్యంత చవకగా అమ్ముతున్న ‘జాంబీ డ్రగ్‌’ యువతను జాంబీలుగా మారుస్తోంది. వారి చర్మాన్ని తినేస్తూ దెయ్యాల్లా కనిపించేలా చేస్తోంది.

పెంటానైల్(Fentanyl), జైలాజిన్ (Xylazine)ను కలిపి చేసే ఈ డ్రగ్‌ను ట్రాంక్‌ డోప్‌ (Tranq dope) అని కూడా అంటారు. జైలాజిన్‌న జంతువుల్లో అనస్తీషియా కోసం వాడతారు.

మనుషుల్లో జైలాజిన్‌ తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది. ఇది ఓవర్‌డోస్‌ అయితే నాలోక్సోన్‌ (naloxone), నార్కాన్‌( narcan) వంటి చికిత్స విధానాలకు కూడా శరీరం స్పందించదు.

జైలాజిన్‌లు, ఫెంటానైల్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలతో కలిపి యూఎస్‌ విధుల్లో విక్రయిస్తున్నారు. ఇది మనుషులు ఆలోచన శక్తిని కోల్పోయేలా చేయడమే గాక, చర్మం కృషించిపోయేలా చేస్తుంది.

చర్మాన్ని తినేస్తూ దెయ్యాల్లా కనిపించేలా చేస్తుంది. పదే పదే తీసుకోవడం వల్ల శ్వాస సంబంధ సమస్యలు తలెత్తడమే గాక, కొన్నిసార్లు శరీర భాగాన్ని కూడా తొలగించాల్సి వస్తుంది. లేదంటే ఇది శరీరమంతా విస్తరిస్తుంది.

‘ట్రాంక్‌ డోప్‌’తో జాంబీలుగా మారిన బాధితులను చూసి వైద్యులే భయపడిపోతున్నారు. ఎలాంటి చికిత్సకూ స్పందించకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు.

జైలాజిన్‌ను హెరాయిన్‌ వంటి ఇతర డ్రగ్స్‌తో కలిపి వాడినపుడు మరింత తీవ్ర ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాల సమస్యలు ఉంటాయని అంటున్నారు.

ట్రాంక్‌ డోప్‌ మాదిరిగానే మరో రెండు జాంబీ డ్రగ్‌లు కూడా ఉన్నాయి.ఒకటి  alpha-Pyrrolidinopentiophenone రెండోది డెసోమార్ఫిన్ (Desomorphine)

alpha-Pyrrolidinopentiophenoneను ఫ్లాకా అని కూడా అంటారు. ఇది మనుషుల్లో హల్యూజినేషన్ కల్పించి పిచ్చివాళ్లలా ప్రవర్తించేలా చేస్తుంది.

డెసోమార్ఫిన్‌ను క్రోకోడిల్‌ అని పిలుస్తారు ఎందుకంటే ఇది ఇంజెక్షన్‌ చేసుకున్న చోట పండ్ల గాటులా గాయం ఏర్పడుతుంది. ఇది కూడా ప్రాణాంతకమైన సమస్యలకు కలిగిస్తుంది.

disclaimer : ఈ ఆర్టికల్‌ కేవలం సమాచారం కోసం మాత్రమే. డ్రగ్స్‌ ఇతర మత్తు పదార్థాలు ప్రాణాంతకం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికి వెళ్లకూడదు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.