AAA Cinemas: తగ్గేదే లే.. అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ లోపల చూశారా..!

YouSay Short News App

ఆసియన్ అల్లు అర్జున్ సినిమాస్‌ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఘనంగా ప్రారంభించాడు.

అమీర్‌పేటలోని బల్కంపేట రోడ్ నంబర్ 16లో ఆసియన్ సత్యం మాల్‌ని నిర్మించారు. జూన్ 15న ప్రారంభమైంది.

ప్రారంభోత్సవానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు నిర్మాత అల్లు అరవింద్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.

ప్రారంభోత్సవానికి వచ్చిన అల్లు అర్జున్‌ని చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఫ్యాన్స్‌కి బన్నీ అభివాదం చేశాడు.

b6snypLWQYVkxROW

b6snypLWQYVkxROW

ఏషియన్ సత్యం మాల్‌ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అల్లు అర్జున్ పర్సనల్, ఫిల్మోగ్రఫీకి చెందిన గ్యాలరీలను ఏర్పాటు చేశారు.

ఐకాన్ స్టార్ సాధించిన అవార్డులను ప్రదర్శనకు ఉంచారు. సందర్శకులు వీటిని ఈజీగా చూడొచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో తొలి లేజర్ స్క్రీన్‌ని ఇక్కడే ఏర్పాటు చేశారు. ముంబై, ఢిల్లీ, బెంగుళూరు తర్వాత దేశంలో ఇది నాలుగో లేజర్ స్క్రీన్.

AAA సినిమాస్‌లో మొత్తం 5 స్క్రీన్లు ఉన్నాయి.

ఒకటో స్క్రీన్‌లో బార్కో లేజర్ ప్రొజెక్షన్‌తో పాటు అట్మాస్(ATMOS) సౌండ్ సిస్టం, రెండో స్క్రీన్‌లో ఎపిక్ లగ్జన్ స్క్రీన్ ఉంది. మిగతావి 4K స్క్రీన్లు.

AAA ఫుడ్ కోర్టు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మూడో లెవెల్‌లో దీనిని ఏర్పాటు చేశారు. నాలుగో లెవెల్‌లో AAA సినిమాస్.

ఏషియన్ సినిమాస్‌ని పూర్తిగా అల్లు అర్జున్(AA) పేరుతో ముస్తాబు చేశారు. జూన్ 16 నుంచి ఆదిపురుష్ స్క్రీనింగ్‌తో అందుబాటులోకి వస్తుంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran