దేశంలో తెలుగు సినిమాలను సాంకేతికంగా అగ్రగామిగా నిలిపేందుకు కృష్ణ ఎంతగానో కృషి చేశారు.
తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా కృష్ణనే.టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ.
దాదాపు 350 పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ప్రతీ జానర్‌లో ఆయన నటించి మెప్పించారు. కుటుంబ కథా చిత్రాలు, ప్రేమకథా చిత్రాలతో ఆయన కెరీర్ ప్రారంభించారు.
కృష్ణ తన కెరీర్‌లో గూఢచారి వంటి యాక్షన్, వెస్ట్రన్, జానపదం ఇలా అన్ని జానర్లలో నటించి ప్రేక్షకులను అలరించారు.
కృష్ణ నటించిన ఎక్కువ శాతం సినిమాలు కమర్షియల్‌గా హిట్ సాధించేవి.
హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, టెక్నీషియన్‌గా ఆయన 24 క్రాఫ్ట్స్‌లో తన నైపుణ్యం ప్రదర్శించేవాడు.
తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త సాంకేతికత పరిచయం చేసిన నటశేఖరుడు కృష్ణ
సినిరంగ ప్రవేశం చేసిన 9 సంవత్సరాల్లో 100కు పైగా చిత్రాల్లో నటించిన రికార్డు కృష్ణ పేరిటే ఉంది. 1972లో 18 చిత్రాల్లో నటించి రికార్డు నెలకొల్పాడు. 1970లో 16, 1971లో 11 చిత్రాలు రిలీజ్ చేసిన హీరోగా నిలిచాడు.
అలుపెరుగని సాహసి
తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ చేయని సాహసాలను కృష్ణ చేశారు. కొత్త కొత్త సాంకేతికతను తెలుగు సినిమాకు పరిచయం చేశారు.
ప్రయోగాల పుట్ట
తొలి ఫుల్‌స్కోప్ సినిమాగా అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్ర సౌండ్ ఎఫెక్ట్స్‌కు జాతీయ అవార్డు కూడా వచ్చింది.