తమిళ స్టార్ హీరో అజిత్‌కు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా ఎక్కువగానే చూస్తారు. ఈ సారి సంక్రాంతి బరిలో దిగాడు తాలా.
‘తునివు’ చిత్రాన్ని తెగింపు పేరుతో తెలుగులో విడుదల చేశారు. మరి ఈ సినిమా మునిపటి చిత్రాల మాదిరిగా మెప్పించిందో లేదో చూద్దాం.
వైజాగ్‌లోని యువర్ బ్యాంక్‌ను దోపిడీ చేసేందుకు రెండు గ్యాంగ్‌లు వస్తాయి. అందులో ఓ గ్యాంగ్ చీఫ్ డార్క్ డెవిల్ ( అజిత్ ), కన్మణి (మంజు వారియర్)
తో కలిసి ప్లాన్ చేస్తాడు.
కథ
అప్పటికే బ్యాంక్‌లో మరో ముఠా ఉంటుంది. మిగతా ఇద్దరు ఎవరూ? డార్క్ డెవిల్ ఎందుకు దొంగతనానికి వచ్చాడు? డబ్బుల్ని ఏం చేస్తాడు? అనేది కథ.
స్టాక్ మార్కెట్ కుంభకోణాల్ని పరిచయం చేస్తూ చిత్రం మెుదలై.. దోపిడి చేసేందుకు బ్యాంకులోకి ముఠాలు చొరబడటం అదే నేపథ్యంలో సినిమా సాగుతుంది.
ఎలా ఉంది ?
ఇది అజిత్ గత చిత్రాల కన్నా భిన్నంగా సాగే మైండ్ గేమ్ థ్రిల్లర్. బ్యాంకు చోరీ చేయటానికి ముఠాలు వేసే ఎత్తులు, పైఎత్తులతోనే ఫస్టాఫ్ ముగిసిపోతుంది.
రెండో భాగంలో అసలు కథ చెప్పాలనుకున్నా అర్థం కాదు. కమర్షియల్ ఎలిమెంట్స్‌కు ప్రాధాన్యం ఎక్కువ. కానీ, ప్రజల్ని బ్యాంకులు ఎలా మెసం చేస్తున్నాయనే పాయింట్‌ను కమర్షియల్‌గా చెప్పడం ఆకట్టుకుంటుంది.
అజిత్ నుంచి ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మరోసారి అజిత్ స్టైలిష్ లుక్స్‌తో పాటు డార్క్ డెవిల్‌గా ఆయన నటన ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంది.
ఎవరెలా చేశారు?
మంజువారియర్ కూడా నటనతో మెప్పించింది. సముద్రఖనితో పాటు మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
అజిత్‌ను దృష్టిలో పెట్టుకొని సీన్స్ రాశాడు దర్శకుడు హెచ్. వినోద్. గుడ్ పాయింట్, మాస్ యాక్షన్ సీక్వెన్స్ తీయడంలో సక్సెస్ అయ్యాడు.
దర్శకత్వం
బ్యాంకులో నడిచే సన్నివేశాలు, క్లైమాక్స్ సముద్రపు ఛేజ్ అద్భుతంగా తెరకెక్కించారు. కానీ, కథలో బలం లేకపోవడం, స్క్రీన్‌ప్లేను గ్రిప్పింగ్‌గా తీయడంలో తడబడ్డాడు.
సినిమాటోగ్రాఫర్ ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ప్రతి ఫ్రేమ్‌ను తన పనితీరుతో బంధించారు. నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఫర్వాలేదు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సూపర్.
సాంకేతిక పనితీరు
రేటింగ్: 2.75/5
అజిత్ నటనయాక్షన్ ఎపిసోడ్స్సందేశం
ప్లస్ పాయింట్స్
కథలో బలం లేకపోవడంరొటీన్ స్క్రీన్ ప్లేలాజిక్లేని సీన్స్ఫ్లాష్ బ్యాక్