Alia Bhatt Saree: మెట్‌ గాలా ఫ్యాషన్‌ ఈవెంట్‌లో అలియా భట్ అందాల జాతర!

YouSay Short News App

న్యూయార్క్‌లో జరిగిన ‘మెట్‌ గాలా ఫ్యాషన్‌ ఈవెంట్‌’లో బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ మెరిసింది.

ప్రముఖ డిజైనర్‌ సబ్యసాచి చేసిన షిమ్మరి ఫ్లోరల్‌ శారీలో రెడ్‌ కార్పైట్‌పై హోయలు పోయింది.

ఆలియా కట్టిన ఈ అతిపెద్ద చీరను తయారు చేయడానికి డిజైనర్లు తీవ్రంగా శ్రమించారట.

163 మంది హస్త కళాకారులు 1905 గంటలు కష్టపడి ఈ శారీని రూపొందించారు.

అయితే ఈ చీరను ఇండియాలో కాకుండా ఇటలీలో తయారు చేయడం విశేషం.

ఆరు గజాల పొడవైన ఈ చీరతో ఆలియా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.

రెడ్‌ కార్పెట్‌పై ఆలియా భట్ స్టైల్‌ను అనితా ష్రాఫ్ అడజానియా చూసుకున్నారు.

అటు ఆలియా మేకప్‌ను పునీత్‌ సైనీ.. హెయిర్‌ స్టైలింగ్‌ను అమిత్‌ ఠాకూర్‌ ఎంతో శ్రద్ధగా చేశారు.

కాగా, ఆలియాతో పాటు ఈ ఫ్యాషన్‌ ఈవెంట్‌లో ముఖేశ్‌ అంబానీ కూతురు పాల్గొంది.

డిజైనింగ్‌ కస్టమ్‌ గౌన్‌ ధరించి.. ఈషా అంబానీ ఈవెంట్‌లో తళుక్కుమంది.

ఈషా ధరించిన ఈ మెస్మరైజింగ్‌ గౌన్‌ను ప్రముఖ డిజైనర్‌ రాహుల్‌ మిశ్రా డిజైన్‌ చేశారు.

ఈ గౌనును పువ్వులు, సీతాకోక చిలుకలు, తూనీగలు వంటి బొమ్మలతో తయారు చేశారు.

దీని తయారీకి దాదాపు 14 నెలల సమయం పట్టిందట.

మెట్‌ గాలాకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్‌ ఈవెంట్లలో ఒకటిగా పేరుంది.

న్యూయార్క్‌లోని ‘మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌’లో ఏటా ఈ వేడుకలను నిర్వహిస్తారు.

ప్రపంచం నలుమూలల నుంచి పేరున్న సెలబ్రిటీలు మాత్రమే ఇందులో పాల్గొంటారు.

భారత్‌ నుంచి ప్రియాంక చోప్రా, దీపిక పదుకొణె, ఈషా అంబానీ, అలియా భట్‌ మాత్రమే పాల్గొన్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran