Allu Sneha Reddy:  క్యూట్ కపుల్‌ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రేమ పెళ్లికి 12 ఏళ్లు

YouSay Short News App

టాలీవుడ్‌ ప్రేమ జంటల్లో అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఒకరు. వీరిద్దరికి వివాహం జరిగి నేటికి సరిగ్గా 12 ఏళ్లు. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట మార్చి 6, 2011లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు.

లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌

స్నేహారెడ్డితో తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు  అల్లు అర్జున్. అమెరికాలో తన స్నేహితుడి పెళ్లిలో ఆమెను చూశాడు. సన్నిహితుల ద్వారా పరిచయం చేసుకొని లవ్‌ తెలియజేశాడు.

వివాహబంధంలోకి

ఇరు కుటుంబాలను ఒప్పించిన ప్రేమ జంట  మార్చి 6, 2011లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు  12 ఏళ్లుగా అంతే ప్రేమగా ఉంటున్నారు ఈ క్యూట్ కపుల్.

హీరోయిన్‌ రేంజ్‌

స్నేహా రెడ్డికి అల్లు అర్జున్‌కి ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరో భార్య అయినప్పటీకి  సోషల్ మీడియాలో తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇన్‌స్టా గ్రామ్‌లో 8.6 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు

ఫ్యాషన్ ఐకాన్‌

సరికొత్త ఫ్యాషన్‌ వేర్‌లో కనిపిస్తూ ట్రెండ్ సెట్‌ చేస్తుంది స్నేహా. గ్లామర్ మెయిన్‌టైన్ విషయంలో హీరోయిన్లకు తగ్గేదేలే రేంజ్‌లో మెరిపిస్తుంది

త్వరలోనే సినిమాల్లోకి

హీరోయిన్‌ అయ్యే ఛాన్స్‌ ఉన్నప్పటికీ కుటుంబానికే సమయం ఎక్కువ కేటాయిస్తుంది స్నేహా రెడ్డి. అయితే. త్వరలోనే మలయాళం సినిమాతో ఆరంగేట్రం చేయనుందని టాక్.

చిచ్చర పిడుగులు

ఈ క్యూట్‌ కపుల్‌కి ఇద్దరు పిల్లలు. అల్లు అయాన్, అర్హ. వీళ్లిద్దరికి సంబంధించిన వీడియోలు చూస్తే చిచ్చరపిడుగులు అనాల్సిందే.

అర్హ నటన

అర్హ కూడా సినిమాల్లోకి అడుగుపెట్టింది. సమంత నటిస్తున్న శాకుంతలం సినిమాలో ప్రిన్స్ భరత క్యారెక్టర్‌ చేసింది చిన్నమ్మాయి.

బిజీగా ఉన్నా

సినిమాలతో అర్జున్, వ్యాపారంతో స్నేహా బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. టూర్లు, వెకేషన్లు ప్లాన్ చేసుకొని వెళ్తూ సరదాగా గడుపుతారు.

ఐకాన్‌ ప్రాజెక్టులు

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ప్రస్తుతం పార్ట్‌ 2లో బిజీగా ఉన్నాడు. తర్వాత సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ ప్రకటించాడు ఐకాన్ స్టార్.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.