‘ఎన్నోరాత్రులు వస్తాయి గానీ’  సాంగ్‌తో పాటు… తెలుగులో  హిట్టైన టాప్ 10 రోమాంటిక్ రీమెక్ సాంగ్స్ ఇవే

YouSay Short News App

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రీమెక్ సాంగ్స్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా కళ్యాణ్ రామ్‌ నటించిన అమిగోస్‌ సినిమాలోని 'ఎన్నో రాత్రులొస్తాయి గానీ'.. రోమాంటిక్ సాంగ్ యూట్యూబ్‌ను షెక్ చేస్తోంది.

ఈ పాట బాలకృష్ణ నటించిన ధర్మ క్షేత్రంలోని మూవీలోని సూపర్ హిట్ సాంగ్. ఎన్నో రాత్రులు వస్తాయి గానీ సాంగ్‌తో పాటు ఈ మధ్య కాలంలో వచ్చి మళ్లీ సూపర్ హిట్‌ అయిన టాప్ 10 రీమెక్ సాంగ్స్ ఓసారి చూద్దాం.

1. ఎన్నోరాత్రులు వస్తాయి గానీ

ఈ సూపర్ హిట్ సాంగ్ బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రం మూవీలోనిది. ఈ పాటలో బాలృష్ణ సరసన దివ్యభారతి నర్తించింది. తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ మూవీలో ఈ పాటను రీమిక్స్ చేశారు.

సాంగ్‌లో కళ్యాణ్ సరసన నటించిన అషిక రంగనాథ్ అందాలను పండించింది. రోమాన్స్ పరంగా ఈ మధ్య వచ్చిన పాటల్లో ఇది టాప్‌లో నిలుస్తుంది. ఒక సినిమా హిట్ అవ్వాలంటే  ఆ మూవీ కథతో పాటు సంగీతం ప్రాధాన్యమే. అందుకే సినిమాలో పాటలపై దర్శక నిర్మాతలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.

2. వెల్లువొచ్చి గోదారమ్మ..

క్లాసిక్ మూవీ ‘దేవత’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ వెల్లువొచ్చి గోదారమ్మ. ఈ పాటలో శోభన్ బాబు, శ్రీదేవి జంటగా నటించారు. అయితే సాంగ్‌ను వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రం లో రీమేక్ చేసారు. వరుణ్ తేజ్ సరసన పూజాహెగ్డే నటించి సొగసుల విందు చేసింది.

3.వెన్నెలైనా చీకటైనా..

సూపర్ స్టార్ కృష్ణ, శ్రీ దేవి జంటగా నటించిన ‘పచ్చని కాపురం’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్  ఇది. ఈ పాటను ఆయన అల్లుడు సుధీర్ బాబు ‘ప్రేమ కథ చిత్రం’ లో రీమేక్ చేసారు. ఇది కూడా బెస్ రోమాంటిక్ సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది.

4.గలగలా పారుతున్న గోదారిలా..

సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘గౌరీ’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ఇది. ఈ పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు ‘పోకిరి’ సినిమాలో రీమేక్ చేసారు.

5.ఆరేసుకోబోయి పారేసుకున్నాను

NTR నటించిన అడవి రాముడు చిత్రంలోనిది  ఈ పాట. అప్పట్లో ఈ పాట రోమాంటిక్ సాంగ్స్‌లో సెన్సెషన్. జయప్రదను అందంగా చూపించారు. మళ్లీ ఈ పాటను ప్రభాస్, ఆర్తి అగర్వాల్ నటించిన అడవి రాముడు చిత్రంలో రీమేక్ చేశారు.

6.ఒక లైలా కోసం..

అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'రాముడు కాదు కృష్ణుడు' చిత్రంలోని ఈ పాటను..ఆయన మనవడు నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం చిత్రంలో రీమేక్ చేశారు.

7. బంగారు కోడిపెట్ట

చిరంజీవి నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘ఘరానా మొగుడు’. ఈ చిత్రం లో సూపర్ హిట్ బంగారు కోడి పెట్ట పాటను రామ్ చరణ్ ‘మగధీర’ సినిమాలో రీమేక్ చేశారు.

8.సోగ్గాడే చిన్నినాయనా..

ఈ సూపర్ హిట్ సాంగ్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆస్తిపరులు చిత్రంలోనిది. ఈ పాటను నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంలో కొన్ని మార్పులతో రీమేక్ చేశారు. సూపర్ హిట్‌ అయ్యింది

9.వాన వాన వెల్లువాయే...

ఈ రోమాంటిక్ సాంగ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంలోనిది. రామ్ చరణ్, తమన్నా జంటగా నటించిన 'రచ్చ' సినిమాలో రీమేక్ చేశారు.

10.గువ్వా గోరింకా తో..

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 786 సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ఇది.   ఈ రోమాంటిక్ పాటను సాయి ధరమ్ తేజ్ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రం లో రీమేక్ చేశారు. సాయి ధరమ్ తేజ్ సరసన రెజినా నటించింది.