AMELIA KERR:  ఆటలో మేటి..అందంలో బ్యూటీ.. ఈ మహిళా క్రికెటర్‌

YouSay Short News App

మహిళల IPLగా WPL లాంఛ్ అయ్యింది. ఇప్పటికే హైస్కోరింగ్ మ్యాచ్‌లతో సందడి వాతావరణం నెలకొంది. వీటన్నింటి మధ్య ఎక్కడచూసినా ఓ అందమైన విదేశీ ఆల్‌రౌండర్‌ పేరు వినిపిస్తోంది.

గుజరాత్‌, ముంబయి మధ్య జరిగిన తొలి  మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన అమెలియా.. కెమెరా కంట పడింది. ఇక అంతే.. ఎవరబ్బా  ఈ సొగసరి అంటూ నెట్టింట్లో రచ్చ మెుదలయ్యింది. మరీ ఆలస్యమెందుకు ఆమె గురించి తెలుసుకోండి.

న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో 2000 సంవత్సరంలో పుట్టింది అమెలియా ఖేర్. 18 ఏళ్ల వయస్సులోనే దేశం తరఫున ఆరంగేట్రం చేసి అదరగొడుతోంది.

చిన్న వయసులోనే

కివీస్ జట్టులో కీలకమైన ఆల్‌ రౌండర్‌గా మారింది ఈ యంగ్ క్రికెటర్‌. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో రికార్డులను అందుకుంది.

సూపర్ ఆల్‌ రౌండర్‌

క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించింది అమెలియా. పురుషులు, మహిళల్లో కూడా ఇదే రికార్డు.

డబుల్ ధమాకా

ఆటతోనే కాదు అందమైన మహిళా క్రికెటర్లలోనూ అమెలియా ఒకరు. టీమిండియాలో స్మృతి మంధాన, ఆసీస్‌లో పెర్రీకి ఎంతమంది ఫ్యాన్స్‌ ఉన్నారో తనకు కూడా అదే రేంజ్‌లో ఉన్నారు.

ఆటతో.. అందంలో

WPL  పుణ్యమా అని అమెలియా భారత్‌లో ఫేమస్‌ అయ్యింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా మాట్లాడిన ఆమె అందాన్ని క్లిక్‌మనిపించారు.

ఇండియాలో ఫేమస్‌

ఆమె అందానికి మంత్ర ముగ్ధులైన చాలామంది ట్విటర్‌లో ట్రెండ్‌ చేశారు. క్రష్‌ అప్డేటెడ్‌ అంటూ అమెలియా ఫోటో వైరల్‌ అయిపోయింది.

ట్విటర్‌లో రచ్చరచ్చ

ఇంత అందంగా ఉన్న అమెలియాకు బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడా? లేడా ? అనే విషయాన్ని కూడా శోధించారు నెటిజన్లు. ఆమె రూబెన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని గాసిప్స్‌ ఉన్నాయి.

బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడా? లేడా?

అమెలియా అక్క జెస్ ఖేర్ కూడా న్యూజిలాండ్‌ తరఫున ఆడుతుంది. వీళ్ల అమ్మ, నాన్న కూడా ప్రొఫెషనల్ క్రికెటర్స్‌.

అక్క కూడా క్రికెటర్‌

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రాణించింది ఖేర్. 24 బంతుల్లో 45 పరుగులు చేయటంతో పాటు రెండు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించింది.

మ్యాచ్‌ సంగతి

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.