మయోసైటిస్ గురించి చెప్పిన తర్వాత మెుదటిసారి సమంత మీడియా ముందుకు వచ్చింది.
నవంబర్ 11న విడుదలవుతున్న తన తదుపరి చిత్రం యశోద ప్రమోషన్లలో భాగంగా యాంకర్ సుమతో ఇంటర్వ్యూలో పాల్గొంది.
యదార్థ సంఘటనల ఆధారంగా యశోద తెరకెక్కించినట్లు సమంత చెప్పింది. మెుదటిసారి సినిమా స్క్రిప్ట్ విన్నపుడు తాను నిర్ఘాంతపోయానని సమంత చెప్పింది.
యశోద చిత్రం విడుదలవుతున్న అన్ని భాషల్లో ఘన విజయం సాధిస్తుందని సమంత ధీమా వ్యక్తం చేసింది.
సినిమాలో యాక్షన్ సన్నివేశాలు సొంతంగా చేశానని చెప్పింది. బాడిడబుల్, డూప్‌ను ఉపయోగించలేదని సమంత వెల్లడించింది.
యశోద సినిమా కథకు తన జీవితానికి సారూప్యత ఉందని, రెండూ ఒకేలా మొదలైన కథలని పేర్కొంది.
యశోద చిత్రానికి తొలిసారి సామ్ సొంతంగా డబ్బింగ్ చెప్పింది. చెన్నైలో పుట్టి పెరిగినందున తెలుగులో డబ్బింగ్ చెప్పేటప్పుడు కాస్త ఇబ్బంది పడినట్లు తెలిపింది.
అనారోగ్య సమస్యల గురించి సామ్ భావోద్వేగానికి లోనయ్యింది. తనకు వచ్చిన వ్యాధి ప్రాణాంతకమైనదేమీ కాదని..కానీ కష్టమైనదని చెప్పింది. తానిప్పుడప్పుడే చావనని పోరాడేందుకే ఇక్కడికి వచ్చానంటూ ఎమోషనల్ అయింది.
ఒక్కోసారి ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అని భయం వేసేదని కానీ ఇంతదూరం ఎలా వచ్చానని తిరిగి చూసుకునేదాన్నంటూ కన్నీరు పెట్టుకుంది.
యశోద చిత్రం థియేటర్లలో ఎందుకు చూడాలో సమంత మూడు కారణాలు చెప్పింది
సమాజంలో వాస్తవిక పరిస్థితులు, భయానకమైన నిజాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
యశోద చిత్రం ఎవరూ ఊహించని ట్విస్టులతో ఆసక్తి రేకెత్తించే థ్రిల్లర్ సినిమా
ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాంకేతికత వల్ల జరిగిన ఓ విషాదకరమైన అనుభవం