ws_Snapinsta.app_1080_313206843_3369789773301453_4031692006074127763_n

YouSay Short News App

యాంకర్ శ్రీముఖి పెళ్లి ముచ్చట్లు

ws_Snapinsta.app_1080_290036937_598929168196572_397436010770489295_n

బుల్లి తెరకు పరిచయమైన కొద్దిరోజుల్లోనే యాంకర్ శ్రీముఖి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన శైలిలో యాంకరింగ్‌ చేస్తూ వరుస షోలు, ఈవెంట్లలో ఆఫర్లు కొట్టేసింది.

ws_Snapinsta.app_1080_161961459_1141500846273899_3034395774033237676_n

పటాస్‌ షోతో మరింత పాపులర్‌ అయిన  ఈ ముద్దుగుమ్మ.. రాములమ్మగా ఫేమస్‌ అయింది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతుందనే ప్రచారంతో శ్రీముఖి పేరు మార్మోగుతోంది.

ws_Snapinsta.app_1080_322749971_489899276584790_1794934137834703200_n

ఈటీవీలో ప్రసారమైన అదుర్స్‌ షోతో యాంకర్‌గా శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. జులాయిలో అల్లు అర్జున్ చెల్లిగా, ప్రేమ ఇష్క్ కాదల్‌లో లీడ్‌రోల్‌ చేసి మెప్పించింది ఈ అందాల సుందరి.

అదుర్స్‌తో ఆరంగేట్రం

యూత్ ఫుల్‌ షో పటాస్‌తో శ్రీముఖి పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అందులో ఆమె వేసిన రాములమ్మ స్టెప్‌ ఇప్పటికీ ఫేమస్. అదే ఆమెకు రాములమ్మ పేరు తెచ్చింది.

పటాస్‌తో పాపులారిటీ

స్టార్‌ యాంకర్‌గా ఎదుగుతున్న సమయంలోనే ఆమెపై ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. కొంతమందితో రిలేషన్‌లో ఉందంటూ వార్తలు షికార్లు చేశాయి.

రూమర్లు షురూ

పటాస్‌ షోలో తన కో యాంకర్‌ రవితో శ్రీముఖి రిలేషన్‌లో ఉందంటూ వార్తలు గుప్పుమన్నాయి. కానీ తామిద్దరం మంచి స్నేహితులమని ప్రకటించారు.

యాంకర్‌ రవితో..

ప్రదీప్‌ మాచిరాజును శ్రీముఖి రహస్యంగా  పెళ్లి చేసుకుందంటూ పెద్ద ప్రచారమే జరిగింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. కానీ, తర్వాత పుకార్లేనని స్పష్టం అయ్యింది.

ప్రదీప్‌తో పెళ్లి

ఇంటర్వూల్లో మాట్లాడుతూ లవ్‌లో ఉన్నానంటూ శ్రీముఖి చెప్పింది. హీరో తనీష్‌తో ప్రేమాయణం నడుపుతుందంటూ గాసిప్స్‌ అల్లేశారు. ఇద్దరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

తనీష్‌తోనూ లవ్‌

ఈ అమ్మడు జీవితంలోనూ ఓ విషాదగాథ ఉంది.  ఓ ప్రముఖుడితో కొన్నాళ్లు లవ్‌లో మునిగితేలిందట. పెళ్లి చేసుకోవాల్సిన సమయానికి బ్రేకప్‌ అయ్యిందని చెప్పి బిగ్‌బాస్‌లో కన్నీరు పెట్టుకుంది.

బ్రేకప్ కహానీ

రాహుల్ సిప్లిగంజ్‌, శ్రీముఖి బిగ్‌బాస్‌ ఫైనల్స్‌లో నిలిచారు. వీరిద్దరి దిగిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యింది. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారని కామెంట్స్‌ వచ్చాయి.

రాహుల్‌ సిప్లిగంజ్‌

ఈ సుందరాంగి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందని తాజా టాక్‌. బడావ్యాపారవేత్తను వివాహం చేసుకుంటుందని, పెద్దలు ఖరారు చేసినట్లు సమాచారం.

పెళ్లి గురించి మళ్లీ

ఈ పెళ్లి కోసమే శ్రీముఖి నాజూకుగా మారిందని అంటున్నారు. అసలు  ఈ వార్తల్లో ఎంతవరకు నిజమో శ్రీముఖి స్పందిస్తే గానీ మనకు తెలియదు.

అందుకే నాజూకు సొగసు