ANJALI: ఆ హీరోతో బ్రేకప్…  ఇక పెళ్లి పీటలు ఎక్కనున్న ఐటెం బ్యూటీ

YouSay Short News App

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి అంజలి. ప్రస్తుతం ఈ హీరోయిన్‌ పెళ్లి వార్తలు సామాజిక మాధ్యమాల్లో చకర్లు కొడుతున్నాయి.

అంజలి 37 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టబోతుంది. 40 దాటకముందే వివాహం చేసుకుంటే మంచిదని తల్లిదండ్రులు ఇచ్చిన సలహా మేరకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట

వరుడు ఎవరంటే?

తల్లిదండ్రులు చూసిన అబ్బాయితోనే ఆమె వివాహం జరుగుతుందని టాక్ వినిపిస్తోంది.  ఓ బడా వ్యాపారవేత్తను అంజలికి సరిజోడిగా చూశారని సమాచారం.

హీరోతో జర్నీ

జర్నీ సినిమాలో హీరోగా నటించిన జైతో అంజలి డేటింగ్‌ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. కానీ, వాటిపై ఎవరూ స్పందించలేదు

విడిపోయినట్లేనా ?

వీరిద్దరూ ప్రేమలో మునిగిపోయి పెళ్లి చేసుకునేందుకు రెఢీ అయిపోయారని ప్రచారం జరిగింది. చివరకు తల్లిదండ్రులు చూసిన వ్యక్తినే చేసుకుంటుందని తెలియటంతో బ్రేకప్ అయ్యిందని టాక్.

టాలీవుడ్‌ టూ కోలీవుడ్‌

2006లో ఫొటో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది అంజలి. వరుసగా సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్ రాలేదు. ఇదే సమయంలో తమిళ్‌లో మంచి అవకాశాలు వచ్చాయి.

సౌందర్యను మరిపించి

షాపింగ్ మాల్‌తో హిట్‌ అందుకున్న ఈ అమ్మడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బ్లాక్‌ బస్టర్ అందుకుంది. అందరూ సౌందర్యలా ఉందన్నారు.

బాక్సాఫీస్ హిట్‌

రవితేజ సరసన బలుపు చిత్రంలోనూ హీరోయిన్‌గా చేసింది అంజలి. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.

ఐటెం సాంగ్స్ హవా

హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయినప్పటికీ ఐటెం సాంగ్స్‌తో అలరించింది రాజోలు ముద్దుగుమ్మ. సరైనోడు, సింగం 2, మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాల్లో చేసిన పాటలు మెప్పించాయి.

వకీల్‌ సాబ్ అంజలి

కేవలం ఐటెమ్‌ సాంగ్స్‌కు పరిమితం అవుతున్న సమయంలో పవన్ కల్యాణ్‌ లీడ్‌ రోల్‌లో వచ్చిన వకీల్‌ సాబ్‌ చిత్రంలో కీలకమైన రోల్‌లో నటించింది.

RC15లో చెర్రీతో

ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న RC15 చిత్రంలోనూ నటిస్తోంది. బహిష్కరణ అనే తెలుగు వెబ్‌ సిరీస్‌లోనూ మెరవనుంది అంజలి.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran