చేదు అనుభవం మిగిల్చిన మరో నాకౌట్ మ్యాచ్

టీమిండియాకు

YouSay Short News App

అనుకున్నదే అయింది. గ్రూప్ దశలో ఎలా ఆడినా, నాకౌట్ మ్యాచుల్లో ఓడిపోయే సంప్రదాయాన్ని టీమిండియా మరోసారి కొనసాగించింది. 2013 తర్వాత ఒక్క నాకౌట్ మ్యాచులోనూ టీమిండియా గెలవలేదు.

మరోసారీ...

కీలక మ్యాచులో ఇండియా చేతులెత్తేసింది. సెమీస్ పోరులో ఇంగ్లాండుకు తలవంచింది. ఎన్నో ఊహాగానాలకు తెరదించుతూ ఇంగ్లాండ్ ఫైనల్‌కి దూసుకెళ్లింది. అంచనాలను అందుకోలేక టీమిండియా ఇంటిబాట పట్టింది.

చేతులెత్తేసింది...

టీమిండియా ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్. ఇంగ్లండ్‌ ఓపెనర్ల భాగస్వామ్యం విడదీయడానికి బౌలింగ్ దళమంతా కష్టపడాల్సి వచ్చింది. ఎంత చెమటోడ్చినా ఫలితం లేకుండా పోయింది.

బౌలింగ్..

ఇంగ్లాండ్ ఇన్నింగ్సులో ఓపెనర్ల ఆటే హైలైట్. భారత్ బౌలర్లను బట్లర్, అలెక్స్ హేల్స్ ఉతికారేశారు. మన ఓపెనర్లు మాత్రం సీజన్ మొత్తం మాదిరిగానే ఈ మ్యాచ్‌లోనూ ఉసూరుమనిపించారు.

ఓపెనర్లే రెండు జట్లలో తేడా!

పాండ్యా, కోహ్లీ మినహా టీమిండియా బ్యాట్స్‌మన్ మొత్తం  తడబడిన వేళ హేల్స్‌, బట్లర్‌ స్వేచ్ఛగా చెలరేగి 169 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ పూర్తి చేశారు.

ఆడుతూ పాడుతూ..

పవర్ ప్లే ముగిసే సరికి ఇంగ్లాండ్ పటిష్ఠ స్థితిలో నిలిచింది. 63 పరుగులు చేసి టీమిండియాపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బట్లర్, హేల్స్ ఇదే ఆట తీరును చివరి వరకు కొనసాగించారు.

36బంతుల్లో 63

బట్లర్ ఔటయ్యే అవకాశం వచ్చినా భారత్ సద్వినియోగం చేసుకోలేక పోయింది. లాంగ్ ఆఫ్‌లో ఇచ్చిన క్యాచ్‌ని సూర్య వదిలేశాడు. అప్పటికే అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు.

జారవిడిచిన అవకాశం..

టీమిండియాపై సెమీఫైనల్లో అద్భుత ఆటతో రికార్డు నెలకొల్పారు. టీ20ల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 170 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌తో ఇంగ్లాండును ఫైనల్‌కి తీసుకెళ్లారు. బట్లర్(80), హేల్స్(86).

రికార్డు భాగస్వాామ్యం..

ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ మాట నిలబెట్టుకున్నాడు. ఫైనల్‌లో పాకిస్థాన్, ఇండియా మధ్య మ్యాచ్ జరగనీయకుండా చేయాల్సిందంతా చేస్తామని ప్రకటించాడు. చివరికి అదే చేసి నిరూపించి మాటను నిలబెట్టుకున్నాడు.

మాట నిలబెట్టుకున్న కెప్టెన్..

ఇండియా ఇన్నింగ్స్ గొప్పగా ఆరంభించలేదు. ఆదిలోనే రాహుల్ వికెట్ కోల్పోయింది. రోహిత్, విరాట్ నిలిచినా వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. ఈ క్రమంలో 27 పరుగులు చేసి రోహిత్ ఔటయ్యాడు.

ఆదిలోనే..

గ్రూప్ దశలో దూకుడైన ఆటతీరుతో అలరించిన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచులో తేలిపోయాడు.  12 పరుగులకే వెనుదిరిగాడు.

తేలిపోయిన SKY

ఈ సెమీఫైనల్‌లో అర్ధశతకం చేసిన కోహ్లీ టీ20 కెరీర్లో 4వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాట్స్‌మన్ విరాట్. రోహిత్, గప్తిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

4వేల పరుగులు

విరాట్ ఔటయ్యాక హార్ధిక్ జోరు పెంచాడు. ప్రతి ఓవర్లోనూ బౌండరీ సాధించేందుకు ప్రయత్నించాడు. చివరి మూడు ఓవర్లలో బీభత్సం సృష్టించాడు. ఈ ప్రపంచకప్‌లో హార్ధిక్ తొలి అర్ధశతకాన్ని63(33)  నమోదు చేశాడు.

హార్దిక్‌ విధ్వంసం

ఇన్నింగ్సు చివరి ఓవర్లో హార్ధిక్ దూకుడు పెంచాడు. నాలుగు, ఐదో బంతిని 6, 4గా మలిచిన హార్ధిక్ చివరి బంతిని కూడా ఫోర్ బాదాడు. కానీ వికెట్లకు దగ్గరగా నిలబడంతో కాలు తగిలి హిట్ వికెట్‌గా ఔటై వెనుదిరిగాడు. భారత్‌ 168 పరుగులు సాధించింది.

హిట్ వికెట్..

ఛేదనలో బట్లర్‌ 80(49), అలెక్స్‌ హేల్స్‌ 86(47) ఇద్దరే మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించారు.

ఇద్దరే ఊదేశారు