యాపిల్‌ ఫోన్‌లాంటి స్మార్ట్‌ఫోన్...  ‘నథింగ్ ఫోన్ 1’

YouSay Short News App

మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వన్‌ప్లస్, శ్యాంసంగ్‌ల హవా నడుస్తున్న తరుణంలో విడుదలైన ఫోన్ ఇది.

వీటికి ధీటుగా సరిసమాన ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌ఫోన్ సగటు కస్టమర్‌ని ఆకర్శిస్తోంది. వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకులు కార్ల్ పీ ఈ ఏడాది జులైలో ‘నథింగ్ టెక్నాలజీ లిమిటెడ్’ని స్థాపించాడు.

ఈ సంస్థ నుంచి విడుదలైన తొలి బ్రాండ్ ‘నథింగ్ ఫోన్ 1’. మరి దీని విశేషాలేంటో ఓసారి చూసేద్దామా.

Network Type        : 5G, 4G, 3G, 2G Display Size            : 16.64 cm (6.55 inch) Protection               : Corning Gorilla Glass 5 Front Camera        : 16MP Rear Camera          : 50MP + 50MP RAM 8GB, 12GB Storage 128GB, 256GB OS                              : Android 12, Nothing OS 1.1.7 Chipset                    : Qualcomm SM7325-AE                                      Snapdragon 778G+ 5G (6 nm) USB                   : USB Type-C 2.0, USB On-The-Go Fingerprint             : In Display Battery                      : Li-Ion 4500 mAh,                                       non-removable (17.42 Wh) Colours                     : White and Black Warranty                 : 1 year

Specifications

డిజైన్, డిస్‌ప్లే

సమీక్ష

ఈ ఫోన్‌ని చూస్తే అచ్చం ఐఫోన్ 12, 13లను చూసినట్లే కనిపిస్తుంది. ఐఫోన్‌ని తలపిస్తూ చేసిన డిజైన్ ఈ ఫోన్‌కి ప్రధాన ఆకర్షణ.

అత్యున్నత ప్రమాణాలతో హుందాతనం ఉట్టిపడేలా ఈ ఫోన్‌ని తీర్చిదిద్దారు. ఇరువైపులా ఉపరితలాలకు గొరిల్లా గ్లాస్ 5ని అమర్చారు. కర్వ్‌డ్ ఎడ్జెస్‌తో OLED స్క్రీన్‌ని కలిగి ఉంది.

గ్లిఫ్ ఇంటర్‌ఫేస్

నథింగ్ ఫోన్‌‌కున్న అసలు సిసలైన ప్రత్యేకత ‘గ్లిఫ్ ఇంటర్‌ఫేస్’. ఈ ఒక్క ఫీచరే ఫోన్ విక్రయాలకు ఆయువుపట్టులా నిలిచింది. ఫోన్ వెనకాల రూపొందించిన ప్రత్యేక డిజైన్ వెంబడి లైటింగ్ ఉంటుంది.

మన ఫోన్‌కి కాల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా లేదా ఛార్జింగ్ పెట్టుకున్నా ఈ లైట్లు తళుక్కుమని బ్లింక్ అవుతుంటాయి. వీటిని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు.

ఇంత మంచి ఫీచర్ అయినప్పటికీ ఇందులో చిన్న లోపం కూడా ఉంది. ఈ ఇంటర్‌ఫేస్‌ని ఉపయోగించాలంటే ఫోన్‌ని తిరగేసే ఉంచాలి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు అవేంటో చూడాలంటే మళ్లీ ఫోన్‌ని తిప్పాల్సి ఉంటుంది. ఇది యూజర్‌కి అప్పుడప్పుడు విసుగు తెప్పించేదే.

సాఫ్ట్‌వేర్, ఇంటర్‌ఫేస్

ఆండ్రాయిడ్ 12 వెర్షన్‌తో 1.1.7 యూఐ నథింగ్ ఆపరేటింగ్ సిస్టంతో ఇది పనిచేస్తుంది. ఫోన్‌ని టచ్ చేస్తుంటే గమ్మత్తైన అనుభూతిని పొందినట్లు ఉంటుంది.

ఇక లాక్, అన్‌లాక్, ఛార్జింగ్ అప్డేట్స్ కోసం వివిధ రకాలైన యానిమేషన్లు ఇందులో ఉన్నాయి. స్క్రీన్‌పై కనిపించే డాట్ మాట్రిక్స్ ఫాంట్‌ ఇట్టే ఆకట్టుకుంటుంది.

మూడేళ్లకు ఓసారి సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్, నాలుగేళ్లకోసారి సెక్యూరిటీ ప్యాచెస్‌ని చేసుకోవాలని కంపెనీ సూచిస్తోంది. మొత్తానికైతే సాఫ్ట్‌వేర్, యూజర్ ఇంటర్‌ఫేస్ విషయంలో గూగుల్ పిక్స్ ఫోన్లని తలదన్నేలా ఉంటుంది.

చిప్‌సెట్

క్వాల్‌కామ్ SM7325-AE స్నాప్ డ్రాగన్ 778జీ చిప్‌తో రూపొందింది. కాకపోతే ఇది అంచనాలను అందుకోలేకపోయింది. సాధారణంగానే గేమర్స్‌ని చిప్‌సెట్ పర్ఫార్మెన్స్ అసంతృప్తికి గురిచేస్తుంటుంది.

బ్యాటరీ

లిథియం అయాన్ బ్యాటరీ ఇది. 4500mAh కెపాసిటీ దీని సొంతం. విచ్చలవిడిగా వాడితే 24గంటల బ్యాకప్ ఇస్తుంది. కానీ, అన్ని ఫోన్ల లాగే ఇది కూడా హీట్ అవుతుంటుంది.

అప్డేట్‌ల ద్వారా ఈ సమస్యను ‘నథింగ్’ అధిగమిస్తూ వస్తోంది. 33వోల్టుల ఛార్జింగ్ కెపాసిటీతో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది.

కెమెరాలు

ఇక కెమెరాలో కూడా ఇది మన్నిక పొందింది. ముఖ్యంగా 50మెగా పిక్సెల్ సోనీ IMX766 సెన్సర్ ఫ్రంట్ కెమెరా అబ్బరుపరుస్తుంది. చిన్న చిన్న వాటిని కూడా ఫోకస్ చేయగలదు.

వెనక కెమెరా సంతృప్తి పరుస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా ముందు మిగతావి దిగదుడుపే.

యాక్సెసిరీస్

దీనికి కూడా ఛార్జర్ ఇవ్వరు. ప్రత్యేకించి అదనపు ఖర్చుతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఫోన్ కోసం వాడే యాక్సెసిరీస్‌కి అయ్యే ఖర్చు కూడా అమితంగానే ఉంటుంది.

ధర

ఇండియాలో రెండు RAM వేరియంట్లలో అందుబాటులో ఉంది.

                 8GB + 128 GB     =  27499/-                  8GB + 256 GB     =  30,499/-                 12 GB + 256 GB   =  33,499/-

ఈ ఫోన్‌లో మెమొరీ కార్డును వేసేందుకు వీలులేదు. కాబట్టి కొనే ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి.

అనుకూలతలు

ఓఎల్ఈడీ డిస్ ప్లే కూల్ డిజైన్(గ్లిఫ్ ఇంటర్ ఫేస్ ) స్కిల్ స్మూత్ ఇంటర్ ఫేస్ హ్యాప్టిక్స్ బిల్ట్ క్వాలిటీ ఉత్తమ కెమెరాలు

ప్రతికూలతలు

హీటింగ్ సమస్య ఫింగర్‌ప్రింట్ సెన్సార్ సమస్య సన్‌లైట్‌లో బ్రైట్‌నెస్ సరిగా ఉండకపోవడం చిప్‌సెట్ మెమొరీ కార్డు ఆప్షన్ లేకపోవడం యాక్సెసిరీస్ ధరలు అధికంగా ఉండటం ఛార్జర్ రాకపోవడం