సిద్ధార్థ్, అదితి రావు ప్రేమలో ఉన్నారా ?వైరల్ అవుతున్న వీడియో
సిద్ధార్థ్, అదితి రావు హైదరీ జంట ఈ మధ్య టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. ఎక్కడికెళ్లినా ఈ జంట కలిసే వెళ్తుండటంతో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏదో నడుస్తోంది..
సిద్ధార్థ్, అదితి మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ చాలామంది విశ్వసిస్తున్నారు. ఇందుకు ఈ జంట కదలికలు బలం చేకూరుస్తున్నాయి.
వీడియోతో క్లారిటీ..
తాజాగా, వీరిద్దరూ కలిసి ఓ మళయాలి పాటకు డ్యాన్స్ చేశారు. ఆ వీడియోను అదితి ఇన్‌స్టాలో పంచుకుంది. ‘అసలైన కోతులు(ద రియల్ మంకీస్)’ అంటూ పోస్టుకు వ్యాఖ్య జత చేసింది.
వీడియో వైరల్..
సిద్ధార్థ్, అదితిల డ్యాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘జంట బాగా కుదిరింది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా మద్దతు ఇస్తున్నారు.
శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌కి..
నటుడు శర్వానంద్ నిశ్చితార్థానికి సిద్ధార్థ్, అదితి జంటగానే హాజరయ్యారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ టాక్ మొదలైంది.
మై పిక్సీ బాయ్..
సిద్ధార్థ్ పుట్టినరోజున అదితి ఓ పోస్టు చేయడం ఈ రూమర్లకు ఊతమిచ్చింది. ‘మై పిక్సీ బాయ్’ అంటూ మెన్షన్ చేయడం గమనార్హం.
మై ప్రిన్సెస్..
అదితి బర్త్‌డేకి సిద్ధార్థ్ కూడా ఓ పోస్టు పెట్టాడు. ‘హ్యాపీ బర్త్‌డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్’ అంటూ వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోను సిద్ధార్థ్ షేర్ చేశాడు.
ఇక పెళ్లేనా..?
వీటన్నిటినీ పరిశీలిస్తే కచ్చితంగా వీరిద్దరూ ప్రేమలో పడ్డట్లే ఉన్నారని నెటిజన్లు తేల్చేస్తున్నారు. ఇక త్వరగా పెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నారు.
మహా సముద్రం సినిమాతో..
‘మహా సముద్రం’ సినిమాతో ఈ జంట మధ్య పరిచయం ఏర్పడింది. ఈ సినిమా అనంతరం వీరి మధ్య బంధం బలపడింది.
గతంలోనూ ఇలా..
సిద్ధార్థ్‌కు గతంలో వివాహమైంది. సమంతతో బంధం పెళ్లి దాకా వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు అదితితో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వెబ్‌స్టోరీల కోసం లింక్‌ని క్లిక్ చేయండి.