YouSay Short News App

తన బాయ్‌ఫ్రెండ్ ఎవరో చెప్పేసిన అరియానా గ్లోరీ

తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అరియానా గ్లోరీ. బిగ్‌బాస్ షోతో ఈ చిన్నది మరింత పాపులారిటీని సంపాదించుకుంది.

కిడ్స్, కామెడీ ఛానళ్లకు యాంకర్‌గా చేస్తూ తన కెరీర్‌ని మొదలుపెట్టిందీ హైదరాబాదీ బ్యూటీ. సొగసైన యాంకరింగుతో మంచి గుర్తింపు పొందింది.

టిక్‌టాక్ వీడియోలతో ఈ అమ్మడు ఫాలోయింగ్‌ని సంపాదించింది. డబ్ స్మాష్ వీడియోలతో ఆకట్టుకుంది.

టిక్‌టాక్ వీడియోలు చేస్తూ ప్రాచుర్యం పొందడంతో బిగ్‌బాస్ అవకాశం తలుపుతట్టింది. సీజన్ 4లో కంటెస్టెంటుగా చేరి ఫైనల్ వరకు వెళ్లింది.

బిగ్‌బాస్ తర్వాత వరుస టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ తన కెరీర్‌‌ని కొనసాగించింది.  ఆర్జీవీతో జిమ్‌లో ఇంటర్వ్యూ చేసి టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచింది.

బిగ్‌బాస్ ఓటీటీలో మళ్లీ కంటెస్టెంటుగా చేరింది. కానీ, మధ్యలోనే వెళ్లిపోయింది.  ఓ ఆకర్షణీయమైన ఆఫర్‌ వచ్చినట్లు సమాచారం.

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుందీ బిగ్‌బాస్ బ్యూటీ. వీలు చిక్కినప్పుడల్లా హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను పలకరిస్తుంటుంది.

బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో లింకులు ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ, అవేవీ నిజం కావంటూ కొట్టిపాడేసింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తను ఒకరికి మనసిచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఎంఎన్‌సీ కంపెనీలో టెకీగా పనిచేస్తున్న యువకుడిని ప్రేమిస్తోందట.

బిగ్‌బాస్ సహచరులు అఖిల్ సార్థక్, అషు రెడ్డి, మొమైత్ ఖాన్, సిరి, యాంకర్ శివలతో అరియానాకు ప్రత్యేక అనుబంధం ఉంది.