‘అవతార్ 2’ విజువల్ వండర్

You Say Short News App

ప్రపంచవ్యాప్తంగా 12 ఏళ్లుగా ఎప్పుడెప్పుడా అని సినీ ప్రేమికులు ఎదురుచూసిన చిత్రం అవతార్ 2 థియేటర్లలో సందడి చేస్తోంది. అప్పట్లో ఉన్న సాంకేతికతను ఉపయోగించి అవతార్ ను దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుతంగా తీర్చిదిద్దటంతో రెండోభాగంపై అమాంతం అంచనాలు పెరిగాయి.

అవతార్ 2 ట్రైలర్ కూడా అదిరిపోవటంతో నెలరోజుల ముందుగానే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మరి అవతార్ సీక్వేల్ అలరించిందా, దర్శకుడు మరోసారి మెప్పించాడా చూద్దాం.

పండోరా గ్రహానికి వెళ్లిన జేక్ సల్లీ, మానవులు  ఆ భూమిని ఆక్రమించుకోవటంతో ఆ తెగతో పాటే వెళ్లిపోతాడు. అక్కడ పూర్తిగా నావిమెన్‌గా మారిపోతాడు.

కథ

అవతార్ మాదిరిగానే రెండో భాగంలోనూ మరోసారి వారి తెగకు ఆపద వస్తుంది. జేక్ వాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు ? కుటుంబాన్ని నేత్రికన్‌తో కలిసి ఎలా కాపాడుకున్నారు ? వీరికి సముద్రానికి సంబంధం  ఏంటనేది కథ.

అవతార్ 2 ను దర్శకుడు పూర్తిగా  విజువల్ వండర్‌లా తీర్చిదిద్దాడు. ప్రతి సన్నివేశం మనల్ని కట్టిపడేస్తుంది. నీటిలో ఓ సరికొత్త ఊహా ప్రపంచంలోకి వెళతారు. కచ్చితంగా ఈ సినిమాలో విజువల్స్ గురించి కొన్ని ఏళ్లపాటు చర్చించక మానరు.

విజువల్ వండర్

అవతార్ 2 చిత్రంలో చాలా అంశాలనే దర్శకుడు స్పృషించారు. ముఖ్యంగా మెుదటిభాగంతో పోలిస్తే కథలో భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. తండ్రికి వ్యతిరేకంగా కుమారుడే పోరాటం చేయటం వంటి విషయాలను ఆసక్తికరంగా చూపించటం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

భావోద్వేగాలు

సినిమాలో చాలా సన్నివేశాలు తెలుగు కథలను కూడా గుర్తు చేస్తుంటాయి. పాత తెలుగు జానపద కథలు కనిపించినట్లు అనిపిస్తోంది. వాటిని ఇప్పటితరం ప్రేక్షకులకు VFX రూపంలో చూపించడం అద్భుతం.

తెలుగుకు దగ్గరగా

చిత్రం దాదాపు 3 గంటల 12 నిమిషాలు ఉంది. ఈ రన్ టైమ్ కాస్త ఎక్కువే అయినప్పటికీ విజువల్ వండర్ కారణంగా పెద్దగా తెలీదు. కానీ, మెుదటిభాగం చూడకపోతే మెుదట్లో కాస్త ఇబ్బంది అనిపించినా తర్వాత కథ అర్థమయ్యేలా దర్శకుడు తెరకెక్కించారు.

నిడివి ఎక్కువే

పార్ట్ 1లో సినిమా కథ కూడా సినిమాకు తోడయ్యింది. ఇందులో దర్శకుడు కాస్త వెనకబడినట్లు ఫీలవుతారు. కానీ,సాంకేతిక అంశాలు ఈ లోపాన్ని సరిదిద్దాయని భావించవచ్చు.

కథే కొంచెం ?

జేమ్స్ కామెరూన్. అవతార్ చిత్రమే ఓ సంచలనం అనుకుంటే అంతకన్నా రెండింతల విజువల్ వండర్ రూపొందించిన ఇతడి ఆలోచనల గురించి ఎంత చెప్పినా తక్కువే.

దర్శకుడి మాయాజాలం

సినిమా చూస్తున్నంత సేపు మన చుట్టూ  ఓ ప్రపంచాన్ని తీర్చిదిద్ది అందులోకి తీసుకెళ్లడమంటే సాధారణ విషయం కాదు. ఇందులో జేమ్స్ విజయం సాధించాడు. జేమ్స్ ఊహలకు ప్రతి ఒక్కరూ సలాం కొట్టాల్సిందే.

దర్శకుడు చిత్రానికి వెన్నెముక అయితే వీరు ప్రాణం. ఎందుకంటే జేమ్స్ అనుకున్నది అనుకున్నట్లో లేక అంతకన్నా ఎక్కువ ఔట్ పుట్ తీసుకురావటంలో సాంకేతిక నిపుణులు సత్తా చాటారు. సినిమాటోగ్రఫీ, VFX, సంగీత దర్శకుడు ఇలా అన్ని క్రాఫ్ట్స్ అద్భుతంగా పనిచేశాయి.

సాంకేతికత నిపుణులు

దర్శకుడి ఆలోచనలకు కావాల్సినవన్నీ సమకూర్చి నిర్మాతలు చిత్రాన్ని తీశారు. ఇది వారికి కచ్చితంగా మంచి పేరు కలెక్షన్లను తెచ్చిపెడుతుంది.

నిర్మాణ విలువలు

సినిమాలో నటించిన ప్రతి ఒక్క పాత్ర ప్రేక్షకులను అలరిస్తుంది. ఒక్కరి పేరు చెప్పకుండా కచ్చితంగా అందరూ ప్రాణం పెట్టి చేశారు.

ఎవరెలా చేశారు?

దర్శకత్వం విజువల్ వండర్ నిర్మాణ విలువలు

ప్లస్

నిడివి కొంచెం ఎక్కువ

మైనస్

రేటింగ్ : 4/5