సంక్రాంతి బరిలో బాలయ్య హిట్లు

YouSay Short News App

సంక్రాంతి హీరో అంటే బాలయ్యే. ఇప్పటికీ ఎన్నో సినిమాలు విడుదల చేసి బ్లాక్‌ బస్టర్స్‌ సాధించారు. పండగకి బాలయ్య సినిమా వచ్చిందంటే ఆ సందడే వేరు.

బాక్సాఫీస్ వద్ద పండగ బరిలో బాలకృష్ణ ఇప్పటివరకు 16 చిత్రాలు నిలిచాయి. ఇందులో 80 శాతం సినిమాలు హిట్ కొట్టాయి. అవేంటో చూడండి

కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 14 1987లో విడుదలయ్యింది. బాలయ్య సరసన విజయశాంతి నటించారు. సంక్రాంతికి  ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.

భార్గవ రాముడు

1988 పండుగ రేసులో నిలిచిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సూపర్ హిట్. అప్పట్లోనే సుమారు రూ. 4 కోట్లు కలెక్ట్ చేసిందట. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు.

ఇన్‌స్పెక్టర్ ప్రతాప్

వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య వంశానికొక్కడు చిత్రంతో పండగ ఖాతాలో మరో హిట్‌ వేసుకున్నాడు. 1996లో కుటుంబ కథా చిత్రం విడుదలయ్యింది. రమ్యకృష్ణ, ఆమని హీరోయిన్లు.

వంశానికొక్కడు

నందమూరి నటసింహం డబుల్‌ రోల్ చేసిన ఈ సినిమా 1997లో సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఫ్యామిలీ సెంటిమెంట్‌తతో బాలయ్య యాక్టింగ్ ఇరగొట్టారు.

పెద్దన్నయ్య

ఫ్యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చిన సమరసింహా రెడ్డి 1999 జనవరి 13న విడుదలై రికార్డుల మోత మోగించింది. కెరీర్‌లోనే అప్పటి వరకు అత్యధికంగా రూ. 23 కోట్లు వసూలు చేసిందట. పండగవేళ ఫ్యాన్స్‌కు బాలయ్య పెద్ద కానుకే ఇచ్చాడు.

సమరసింహా రెడ్డి

సమరసింహా రెడ్డితో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్యకు వరుస ఫ్లాపులు వచ్చాయి. ఆయన్ను మరోసారి సంక్రాంతి పండగ కాపాడింది. 2001లో వచ్చిన నరసింహా నాయుడు సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోయింది.

నరసింహా నాయుడు

జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో వచ్చిన మాస్‌ చిత్రం లక్ష్మీ నరసింహా 2004 సంక్రాంతి బరిలో పోటీ పడి బాలకృష్ణ ఖాతాలో హిట్ వేసింది.

లక్ష్మీ నరసింహ

సంక్రాంతి బరిలో అప్పటికే చాలా సినిమాలు ఉన్నప్పటికీ బాలకృష్ణ మూవీ కూడా అదిరిపోయే కలెక్షన్లు సాధించింది. శ్రీవాసు దర్శకత్వం వహించగా..అంజలీ, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా చేశారు.

డిక్టేటర్‌

క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2017లో మంచి హిట్ సాధించింది. చారిత్రక నేపథ్యంలో వచ్చిన సినిమాను ప్రేక్షకుల పండుగకు ఆదరించారు. అప్పుడు కూడా చిరు ఖైదీ 150తో బాలయ్యకు పోటీ ఇచ్చారు

గౌతమీ పుత్ర శాతకర్ణి

గత కొన్నేళ్లుగా బాలయ్య సంక్రాంతికి సినిమా విడుదల చేస్తున్నారు. ఇప్పుడు గోపిచంద్ మలినేని తెరకెక్కించిన వీరసింహా రెడ్డితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సినిమాపై ప్రస్తుతానికైతే పాజిటివ్‌ వైబ్స్‌ ఉన్నాయి.

వీరసింహా రెడ్డి