మాల్దీవ్స్ భారతీయులకు ఒక స్పెషల్ డెస్టినేషన్. ఇక్కడి బ్లూ బీచ్‌లు, ఖరీదైన రిసార్టులు, సముద్రగర్భ రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్ పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
ఒక జంటకు 3, 4 రోజులకు కలిపి దాదాపు రూ.1.5 లక్షలు ఖర్చవుతుంది.
పగడపు దిబ్బలను చూసేందుకు స్కూబా డైవింగ్ నీటి అడుగున ప్రయాణించడానికి స్నార్కెలింగ్ సీప్లేన్‌లో మాల్దీవుల సందర్శన
బీచ్‌లకు బదులుగా ట్రెక్కింగ్ ఇష్టపడేవారు మన పొరుగు దేశం నేపాల్ వెళ్లవచ్చు. గోవా ట్రిప్‌నకు ఎంత ఖర్చవుతుందో నేపాల్ పర్యటనకూ అంతే ఖర్చు అవుతుంది. నేపాల్‌లో పర్యటించాలంటే కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరి.
ఒక జంటకు 4, 5 రోజులకు గానూ సుమారు రూ. లక్ష ఖర్చు అవుతుంది.
పోఖారాలో అడ్వెంచర్ యాక్టివిటీస్ ఖాట్మండు వ్యాలీలో మౌంటైన్ బైకింగ్, ట్రెక్కింగ్ హిమాలయాల మీదుగా విమాన ప్రయాణం
అరైవల్ వీసాపై థాయిలాండ్‌లో పర్యటించవచ్చు. అంటే పాస్‌పోర్టు లేకుండానే థాయిల్యాండ్ వెళ్లి అక్కడి ఎయిర్‌పోర్టులోనే వీసా తీసుకోవచ్చు. భారత పర్యాటకులకు అత్యంత అనువైన దేశం థాయిల్యాండ్. మీ బడ్జెట్‌లో 35 శాతం మాత్రమే విమాన చార్జీలు ఉంటాయి.
ఒక జంట 4, 5 రోజుల బసకు దాదాపు రూ.2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
డామ్నోయెన్ ఫ్లోటింగ్ మార్కెట్ సందర్శన ఫాంగ్ నా బే కో ఫిఫి ట్రిప్
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో టాప్ 8లో నిలిచింది భూటాన్. భారత్ నుంచి భూటాన్ ప్రయాణించడం అత్యంత తేలిక. ఇక్కడ బౌద్ధమతానికి సంబంధించిన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.
ఒక జంటకు 5 రోజుల స్టేకు రూ.50 వేలు ఖర్చు అవుతుంది
తక్త్‌షాంగ్ గోయంబాలో ట్రెక్కింగ్ చేయవచ్చు. ట్రోగ్సాజాంగ్‌లో భూటాన్ చరిత్రకు సంబంధించినవి అన్నీ చూడవచ్చు. భూటానీస్ వంటకాలు టేస్ట్ చేయొచ్చు.
వేయి దీవుల కలయికే ఇండోనేషియా. భారతీయులకు అంత ఖరీదైన దేశమేమీ కాదు. ఇండోనేషియాలో అత్యంత ప్రసిద్ధి చెందింది బాలి ద్వీపం. దీనిని దేవతల ద్వీపం అని కూడా పిలుస్తారు.
ఒక జంట 5 రోజులు ఇక్కడ బస చేయాలంటే రూ.1.5 లక్షలు వెచ్చించాల్సిందే.
బాలి బీచ్‌లో సర్ఫింగ్ తేగల్లాంగ్ రైస్ ఫీల్డ్స్‌లో రాఫ్టింగ్ బాలి వీధుల్లో షాపింగ్
వియత్నాం ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడి అందమైన బీచ్‌లు, వారి సంస్కృతి, అద్భుతమైన ఆహారం వల్ల పర్యాటకం వర్ధిల్లుతోంది. ఈ దేశాన్ని ‘నదుల భూమి’ అని కూడా అంటారు. ప్రకృతి ప్రేమికులకు, బీచ్ లవర్స్‌కు వియత్నాం సరైన డెస్టినేషన్.
ఒక జంటకు 5 రోజుల బసకు సుమారు రూ.1.2 లక్షలు ఖర్చు చేయాలి.
హాలాంగ్ బేలో కయాకింగ్, క్రూయిజింగ్ కు చి టన్నెల్ నెట్‌వర్క్ సందర్శన బ్యాన్ జియాక్ జలపాతం విజిట్
అల్బేనియా దేశం యూరప్‌లోనే అత్యంత చౌకైన పర్యాటక ప్రదేశం. ఈ దేశం సౌత్ ఈస్ట్ యూరప్‌లోని బాల్కన్ ప్రాంతంలో ఉంటుంది. అల్బేనియా అభివృద్ధి చెందిన దేశం. ఈ దేశంలోని నీలి రంగు బీచ్‌లు ప్రయాణికులను ఆహ్లాదపరుస్తాయి.
ఇక్కడ 4, 5 రోజులు పర్యటించాలంటే ఒక్కో జంటకు రూ.2.2 లక్షలు ఖర్చు అవుతుంది.
బెంజా హాట్ స్ప్రింగ్స్ తిరానాలో కేబుల్ కార్ రైడ్ వాల్బోనాలో హైకింగ్
ఓషియానియాలో ఫిజి ఒక చిన్న ద్వీపకల్ప దేశం. భారత పర్యాటకులకు అనువైన దేశమే ఇది. అక్కడి జలపాతాలు, బీచ్‌లతో కూడిన ప్రకృతి దృశ్యాలు మిమ్మల్ని ఊపిరి తీసుకోనివ్వవు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్, మే నుంచి ఆగష్టు మధ్యలో ఇక్కడ పర్యటించడం ఉత్తమం.
ఒక జంటకు 4, 5 రోజులకు దాదాపు రూ.2 లక్షలు అవుతుంది.
మామనుకా ఐలాండ్స్‌లో హెలికాప్టర్ రైడ్ కోకో ఐ సువా ఫారెస్ట్ పార్కులో హైకింగ్ క్యాస్ట్‌అవే దీవిలో స్నార్కెలింగ్
ప్రత్యేక పరిస్థితుల్లో భారతీయులు వీసా లేకుండా దుబాయ్ వెళ్లవచ్చు. భారత పాస్‌పోర్ట్ ఉన్నవారు ఎవరైనా అరైవల్ వీసా ద్వారా దుబాయ్‌లో పర్యటించవచ్చు.
ఒక జంటకు కలిపి 4, 5 రోజులకు గానూ రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలు ఖర్చు అవుతుంది.
బుర్జ్ ఖలీఫా సందర్శన స్కైడైవింగ్ డజర్ట్ సఫారీ