Belly Fat:  నాజుకైన నడుము కోసం.. ఇవి తింటే చాలు.కష్టపడాల్సిన పనిలేదు

YouSay Short News App

ఆధునిక జీవన పరిస్థితుల్లో పడిపోయి చాలామంది శరీరంపై నియంత్రణ కోల్పోతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

అయితే కొంతమంది పొట్టను తగ్గించడానికి నానా కష్టాలు పడుతుంటారు.కానీ, అవేవీ చేయకుండా కేవలం ఆహారం ద్వారానే కొవ్వును కరిగించొచ్చు.  ఆ ఆహారాలేంటో చూసేద్దామా.

నడుము చుట్టూ కొవ్వు కరిగించడానికి ఉపయోగపడే మంచి ఆహారం ‘ఓట్ మీల్’. బ్రేక్‌ఫాస్ట్‌గా దీన్ని తీసుకోవచ్చు. ఇది ఆకలిని తగ్గించి శక్తిని అందిస్తుంది. అయితే, ఫ్లేవర్‌లెస్ ఓట్స్‌ని మాత్రమే కొనుగోలు చేయండి. ఫ్లేవర్ చేసిన ఓట్స్‌లో షుగర్స్, రసాయనాలు ఉంటాయి.

ఓట్ మీల్

రాగి జావ సర్వారోగ్య ప్రదాయిని. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు కొవ్వును కరిగించే హార్మోన్లను ప్రేరేపిస్తాయి. రోజూ ఉదయం అల్పాహారంగా తీసుకుంటే మేలు కలుగుతుంది.

రాగి జావ

కిచిడీల్లో వివిధ రకాలుంటాయి. అయితే, దాల్ కిచిడీ ద్వారా శరీర బరువు తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని పోషకాలు కొవ్వును కరిగించే ప్రక్రియను పెంచుతాయి. ఉదయం లేదా సాయంత్రం దీన్ని తీసుకోవచ్చు.

కిచిడీ

ఎన్నో రకాల ఉప్మాలున్నాయి. కానీ, గోధుమ రవ్వతో చేసే ఉప్మా కొవ్వును కరిగించడంలో తోడ్పడుతుంది. ఇందులో వేసే బాదం వంటి ఇంగ్రేడియంట్స్‌ కూడా సహకరిస్తాయి. ఉదయం, సాయంత్రం ఎప్పుడైనా ఉప్మాను తినొచ్చు.

ఉప్మా

ఇండియా మొత్తం పోహా ఫేమస్. అటుకుల్లో లాక్టోజ్, కొవ్వు పదార్థాలు ఉండవు. పైగా ఇందులో వేసే పల్లీల్లో అధికంగా ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కొవ్వు పెరగకుండా ఇవి తోడ్పడతాయి. రాత్రివేళల్లో తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

పోహా

తమిళంలో పొంగల్ అంటే ఉడకపెట్టడం అని అర్థం. ధాన్యాల ద్వారా చేసే ఈ పొంగలి జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. పొంగలిలో వాడే పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్లే, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి.

పొంగలి

గుడ్డును ఎప్పుడైనా తీసుకోవచ్చు. కొందరు పచ్చసొనని పడేస్తుంటారు. వాస్తవానికి కొవ్వును కరిగించంలో పచ్చసొన ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

గుడ్డు

ఉదయం అల్పాహారంలో పీనట్ బటర్‌ని తీసుకోవచ్చు. ఫైబర్, ప్రొటీన్, E-విటమిన్, ఐరన్, జింక్ వంటివి ఉండటంతో అన్నిరకాలుగా మేలు చేస్తుంది. నానబెట్టిన లేదా ఉడకబెట్టిన వేరుశనగలను కూడా తీసుకోవచ్చు.

పీనట్ బటర్

కొవ్వును కరిగించడంలో తృనధాన్యాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ని కలిగి ఉండటం వల్ల శరీరానికి తగిన శక్తిని అందించి కొవ్వు ఏర్పడకుండా ఉంటుంది.

తృణ ధాన్యాలు

జ్యూస్ రూపంలో వీటిని ఉదయం, సాయంత్రం వేళల్లో తీసుకోవచ్చు. నేరుగా తినడం ద్వారా కూడా దానిమ్మ ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా పొత్తికడుపుపై ఉండే కొవ్వును కరిగిస్తుంది. అదేవిధంగా గుండెనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును క్లీన్ చేస్తుంది.

దానిమ్మ

మశ్రూమ్స్‌లో D విటమిన్ ఉండటం మూలంగా ఊబకాయత్వాన్ని దరిచేరనీయదు. నీరు, ప్రొటీన్లు అధికంగా ఉండి, తక్కువ కెలోరీలను అందిస్తుంది.

మశ్రూమ్స్

మంచి కొవ్వు పెంపొందడంలో కొబ్బరినూనెది ముఖ్య పాత్ర. వంటకాల్లో కొబ్బరినూనెను భాగంగా చేసుకోవచ్చు. నిపుణుల సలహా మేరకు కొబ్బరినూనెను ఉపయోగించడం ఉత్తమం.

కొబ్బరి నూనె

మెటబాలిక్ రేటును పెంచడంలో క్యాప్సికం తోడ్పడుతుంది. ఫలితంగా కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. మధ్యాహ్నం లంచ్‌ ద్వారా దీన్ని తీసుకోవచ్చు.

క్యాప్సికం

వాల్‌నట్స్, పిస్తా, మకడామియా నట్స్ వంటివి బరువు తగ్గడానికి చక్కగా ఉపకరిస్తాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. ఎప్పుడైనా వీటిని స్వీకరించొచ్చు.

నట్స్

రోజువారీగా పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఇతరులతో పోలిస్తే పెరుగును తీసుకున్న వారు రెండు రెట్లు బరువు తగ్గారని ఓ అధ్యయనంలో తేలింది.

పెరుగు

పొత్తి కడుపు, ఇతర అవయవాలపై పేరుకుపోయే కొవ్వును తగ్గించడంలో వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తేలింది. సప్లిమెంట్‌గా దీన్ని తీసుకోవచ్చు.

వెల్లుల్లి

పొత్తికడుపుపై పేరుకుపోయే కొవ్వును కరిగించడంలో పొద్దు దిరుగుడు గింజలది కీలక పాత్ర. పాలీ అన్ సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఇందుకు దోహదం చేస్తాయి. స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు.

పొద్దుదిరుగుడు గింజలు(సన్‌ఫ్లవర్ సీడ్స్)

నిమ్మరసం తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ క్రమంగా కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అక్కడక్కడా పేరుకుపోయిన కొవ్వును క్లీన్ చేస్తుంది.

నిమ్మరసం

పెసర్ల మొలకలు కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడతాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. ఉదయం వేళల్లో తీసుకుంటే మంచిది.

మొలకలు

సిట్రస్ జాతికి చెందిన ఈ ఫ్రూట్ వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్స్ ఇందుకు దోహదపడుతాయి. ఉదయం, సాయంత్రం తీసుకోవచ్చు.

కివీ ఫ్రూట్

యాపిల్స్‌లో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఉపయోగపడతాయి. అయితే, అధిక మోతాదులో తీసుకోకపోవడం మంచిది.

యాపిల్స్

ప్రొటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలకు నిలయం చేపలు. ఇవి తీసుకోవడం వల్ల జీర్ణక్రియా రేటు మెరుగవుతుంది. ఇన్‌ఫ్లమేషన్ దరిచేరదు. ఫలితంగా కొవ్వు పేరుకుపోదు. మధ్యాహ్న భోజనంలో వీటిని భాగం చేసుకోవచ్చు.

చేపలు

ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లకు కేరాఫ్ బాదం. ఇందులో కూడా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా కొవ్వును నియంత్రిస్తుంది. నానబెట్టి తీసుకుంటే అధిక ప్రయోజనం ఉంటుంది.

బాదం

బీన్స్, చిక్కుడులో పుష్కలమైన విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, ఫైబర్ ఉంటాయి. ముఖ్యంగా ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. తద్వారా కొవ్వు పెరుగుదల అదుపులో ఉంటుంది.

బీన్స్, చిక్కుడు

పాలకూర, క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటి ఆకుకూరల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఫలితంగా ఇవి బెల్లీ ఫ్యాట్‌ని తగ్గిస్తాయి. ఆకలి తీర్చడంలో, ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించి జీర్ణక్రియను మెరుగు పరచడంలో ఇవి తోడ్పడతాయి.

ఆకుకూరలు

క్యారెట్, బీట్‌రూట్, ముల్లంగి, చిలగడదుంప వంటివి బెల్లీ ఫ్యాట్‌ని కరిగించడంలో సహాయపడతాయి. వీటిలోని ఫైబర్ కంటెంట్, యాంటి ఆక్సిడెంట్లు ఇందుకు ఉపకరిస్తాయి.

దుంపలు

చూడ్డానికి ఇవి రెండూ ఒకే విధంగా ఉంటాయి. కానీ, దీర్ఘంగా పరీక్షిస్తే తేడా తెలుస్తుంది. ఇవి రెండూ బరువు తగ్గడంలో ఉపయోగపడతాయి.

చియా, సబ్జా గింజలు

పాలల్లో కొవ్వు అధికంగా ఉండటం వల్ల ఆకలిని నియంత్రిస్తాయి. ఇందులోని న్యూట్రియంట్స్ శరీర బరువు తగ్గడానికి తోడ్పడతాయి.

పాలు

ఇందులోనూ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువును  తగ్గిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

అంజీర పండ్లు

గమ్మడికా.. తక్కువ కెలోరీలు, అత్యధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటుంది. ఫలితంగా నడుము, పొట్ట దగ్గర  ఫ్యాట్ తగ్గింపులో కీలక పాత్ర పోషిస్తుంది.

గుమ్మడికాయ

ఈ సుగంధ ద్రవ్యాన్ని రోజువారీ డైట్‌లో మిళితం చేసుకుంటే మంచిది. దీనిలోని ఔషధ గుణాలు చెడు కొవ్వును కరిగిస్తుంది.

దాల్చిన చెక్క