హైదరాబాద్‌లో రూ.8లక్షల (On Road)లోపు

ధరలో బెస్ట్‌ కార్స్‌

YouSay Short News App

TATA Punch - 7.3 Lakhs

నగర వాసులకు ఈ వాహనం చక్కని ఎంపిక. శక్తిమంతమైన ఇంజిన్‌తో మిరుమిట్లు గొలిపే రూపంతో ఇది ఆకట్టుకుంటుంది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ టాటా పంచ్‌ రూపుదిద్దుకుంది.

అయితే, ప్రస్తుతానికి ఇది కేవలం ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంధనంతో మాత్రమే ఇది నడుస్తుంది.

Engine          : 1199 cc Emission Norm Compliance : BS VI Mileage         : 18.82 Kmpl Fuel Typel      : Petrol Transmission   : Manual & Automatic Safety Rating   : 5 Resale Value in India: Average

TATA Tigor -  7.33 Lakhs

దేశీయ మార్కెట్‌లో సరసమైన ధరకు లభించే వాహనం ‘టాటా టైగర్’. ఎగుడు దిగుడు రోడ్లపై ప్రయాణించినా సౌకర్యంగా ఉండేలా దీన్ని రూపొందించారు.

క్యాబిన్ నాణ్యత ప్రమాణాలు, ఇంటీరియర్ స్పేస్‌ పరిమితి మోస్తరుగా ఉంటుంది. టాటా టైగర్‌లో ఇంధనంతో నడిచే కార్లతో పాటు విద్యుత్ వాహనాలూ అందుబాటులో ఉన్నాయి.

Engine          : 1199 cc Emission Norm Compliance : BS VI Mileage          : 26 Kmpl Fuel: Petrol      : Petrol & CNG Transmission   : Manual & Automatic Safety Rating    : 4 Resale Value in India : Average

TATA Tiago - 7 Lakhs

క్యాబిన్ సమస్యలకు చెక్ పెట్టి సౌకర్యవంతమైన సీటింగుతో ‘టాటీ టియాగో’ను తీర్చిదిద్దారు. సేఫ్టీకి ప్రాధాన్యమిచ్చే వారు అందుబాటు ధరలోనే ఈ వాహనాన్ని ఎంచుకోవచ్చు.

కేంద్రప్రభుత్వ కార్యక్రమమైన ‘నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం’ కింద ఈ వాహనం ఫోర్ స్టార్(4/5) రేటింగును సొంతం చేసుకుంది. ఇది హానికర ఉద్గారాలను విడుదల చేయదు.

Engine          : 1199 cc Emission Norm Compliance : BS VI Mileage          : 20 Kmpl Fuel Typel       : Petrol Transmission    : Manual Safety Rating    : 4 Resale Value in India : Average

TATA Altroz - From 7 Lakhs

టాటా కంపెనీ నుంచి విడుదలైన మరో వాహనమే ‘టాటా అల్ట్రోజ్’. టర్బో- పెట్రోల్ ఇంజిన్‌తో ఇది రూపుదిద్దుకుంది.

పవర్ ట్రైన్ ఆప్షన్లు, లైట్ కంట్రోల్స్ వినియోగదారుల్ని ఆకట్టుకుంటాయి. రైడ్ క్వాలిటీ, ఇంజిన్ సామర్థ్యంతో వాహన ప్రేమికులు కాస్త నిరాశకు గురయ్యే అవకాశం ఉంది.

Engine           : 1199 - 1497cc Emission Norm Compliance : BS VI Mileage          : 23 Kmpl Fuel Type        : Petrol & Diesel Transmission    : Manual Safety Rating    : 5 Resale Value in India : Average

Maruti Suzuki Swift - From 6 Lakhs

దేశీయ మార్కెట్లో వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న వాహనం.. ‘మారుతి సుజుకి స్విఫ్ట్’. 15ఏళ్ల నుంచీ ఒకే తరహా వాహనం మనుగడ సాగించందంటేనే అర్థం చేసుకోవచ్చు.

పటిష్ఠమైన ఇంజిన్, ఆకట్టుకునే లుక్, మెరుగైన ఇంధన సామర్థ్యంతో కొత్త మోడల్‌ని మార్కెట్లోకి విడుదల చేశారు. కస్టమర్‌ అంచనాలకు తగ్గట్టు ఇది ఉంటుంది. కాకపోతే పాతకాలపు ఫీచర్లు, మోస్తరు సస్పెన్షన్‌‌ వంటి లోటు పాట్లున్నాయి.

Engine            : 1197 Emission Norm Compliance : BS VI Mileage           : 23 Kmpl Fuel Type         : Petrol & CNG Transmission    : Automatic Safety Rating     : 2 Resale Value in India  : Very Good

Maruti Suzuki Celerio - From 5.5 Lakhs

సరికొత్త డిజైన్‌తో మారుతీ సుజుకీ ‘సెలెరియో’ను తీసుకొచ్చింది. విశాలమైన క్యాబిన్ స్పేస్‌తో సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు అనువుగా తీర్చిదిద్దారు.

మంచి మైలేజీని కూడా ఇది ఇస్తుంది. స్టీరింగ్ చురుగ్గా ఉండకపోవడంతో పాటు, ఈ తరహా ఇతర కార్లతో పోలిస్తే దీని ధర మరింత ఎక్కువ.

Engine           : 998 Emission Norm Compliance : BS VI Mileage          : 26 Kmpl Fuel Type         : Petrol & CNG Transmission    : Automatic Safety Rating    : NA Resale Value in India : Very Good

Hyundai Aura -  From 7.5 lakhs

సరసమైన ధరతో మంచి పర్ఫార్మెన్స్‌తో హ్యుండయ్ తీసుకొచ్చిన కారు ఇది. లోపల సౌకర్యవంతంగా కూర్చొని ప్రయాణించొచ్చు.

అధిక వేగంతో ప్రయాణించేటప్పుడు వాహనం కాస్త ఇబ్బంది పెడుతుందని, వెనక భాగం డిజైన్ కూడా ఆకట్టుకునేంతలా ఉండదని కొంతమంది ఫిర్యాదు చేస్తున్నారు.

Engine            : 998 Emission Norm Compliance : BS VI Mileage           : 20 Kmpl Fuel Type         : Petrol & CNG Transmission     : Manual Safety Rating     : 2 Resale Value in India  : Good

Renault Triber - From 7 lakhs

మార్కెట్లో స్టైలిష్‌గా సిక్స్ సీటర్ కెపాసిటీతో రూపొందిన వాహనం ట్రైబర్. ఎలాంటి రోడ్డుపై నైనా సౌకర్యవంతంగా ప్రయాణించగలిగేలా ఉంటుంది.

అయితే, ఆరుగురితో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మిగతా లగేజీ పెట్టుకోవడం కాస్త సవాలుగా ఉంటుంది.

Engine         : 998 Emission Norm Compliance : BS VI Mileage        : 20 Kmpl Fuel Type      : Petrol Transmission  : Manual & Automatic Safety Rating   : 4 Resale Value in India : Average

Renault Kwid - From 5 lakhs

పర్ఫార్మెన్స్, రైడ్ క్వాలిటీ విషయంలో రెనాల్ట్ క్విడ్ మంచి ఎంపిక. అందమైన డిజైన్, కలర్ స్కీమ్ దీని సొంతం. బ్రహ్మాండమైన సస్పెన్షన్ కారణంగా సౌకర్యవంతంగా ప్రయాణించొచ్చు.

సీటింగ్ అరేంజ్‌మెంట్ కాస్త ఇరుకుగా అనిపిస్తుంటుంది. నలుగురి కంటే ఎక్కువ మందితో ప్రయాణించే సమయంలో కాస్త అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది.

Engine           : 799 and 999 cc Emission Norm Compliance : BS VI Mileage          : 22 Kmpl Fuel Type        : Petrol Transmission    : Manual & Automatic Safety Rating    : 1 Resale Value in India : Average

Maruti Wagon R - From 5 Lakhs

అందుబాటు ధరలో, చాలినన్ని ఫీచర్లతో సగటు వినియోగదారుడికి సరిగ్గా నప్పే వాహనం ఇది.

వివిధ డ్రైవ్ మోడ్స్‌‌తో చక్కని ఇంటీరియర్‌ని ‘వాగన్ ఆర్’ కలిగి ఉంటుంది. కాకపోతే చూడ్డానికి అంతగా ఆకట్టుకోదు.

Engine          : 999 and 1197 cc Emission Norm Compliance : BS VI Mileage         : 25-30 Kmpl Fuel Type       : Petrol & CNG Transmission   : Manual & Automatic Safety Rating    : 2 Resale Value in India  : Good

Maruti Alto K10 - From 4.7 Lakhs

చిన్న కుటుంబాలకు బాగా నప్పే వాహనాల్లో ‘మారుతి ఆల్టో కే10’ ముందు వరుసలో నిలుస్తుంది. రోబస్ట్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ దీని సొంతం.

అన్నిటికన్నా గిట్టుబాటు ధరలో లభిస్తుండటం దీనికి అదనపు ఆకర్షణ. టాప్ ఎండ్ మోడల్స్‌ని తీసుకోవాలనుకుంటే మరింత వెచ్చించాల్సిందే.

Engine          : 999 Emission Norm Compliance : BS VI Mileage         : 30 Kmpl Fuel Type       : Petrol & CNG Transmission   : Manual & Automatic Safety Rating    : NA Resale Value in India  : Good