రూ.15లక్షల లోపు సన్‌రూఫ్ కలిగిన అత్యుత్తమ కార్లు(On road price Hyderabad)
టొయోటా అర్బన్ క్రూయిజర్ - రూ.12 లక్షలు
రూ.12లక్షలతో జపాన్ కంపెనీ టొయోటా నుంచి వెలువడిన వాహనమే ‘అర్బన్ క్రూయిజర్’. సన్ రూఫ్ సౌలభ్యంతో టొయోటా ఈ వాహనాన్ని తీసుకొచ్చింది. అదనంగా లగ్జరీ ఫీచర్లు ఉండటం
ఈ వాహనం ప్రత్యేకత.
హ్యుండయ్ వెర్నా - రూ.13.5 లక్షలు
సన్ రూఫ్ కలిగి ఉండి.. ఫ్యామిలీకి బాగా సరితూగే వాహనం ఇది. వివిధ వేరియంట్లలో ఈ వాహనం అందుబాటులో ఉంది. హ్యుండయ్ వెర్నాకి ఫ్యామిలీ కారుగా పేరుంది.
మారుతీ సుజుకీ బ్రీజా - రూ. 13లక్షలు
దేశీయ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ రూపొందించిన సన్ రూఫ్ వాహనం బ్రీజా. మార్కెట్లో ఈ వాహనానికి మంచి ఆదరణ ఉంది. చూడ్డానికి సొగసుగానూ ఉంటుంది.
హోండా సిటీ - రూ.13-15 లక్షలు
దేశంలో సొగసైన కార్లలో హోండా సిటీ ఒకటి. ఎప్పటినుంచో ఈ వాహనం మార్కెట్లో చెలామణీ అవుతోంది. సన్ రూఫ్ ఫీచర్‌తో హోండా సిటీ కస్టమర్లకు రూ.13లక్షల ధరతో అందుబాటులో ఉంది.
కియా సోనెట్ - రూ.11లక్షలు
కియా నుంచి విడుదలైన సబ్ కాంపాక్ట్ ఎస్‌యువీనే ‘సోనెట్’. ఈ ఏడాదిలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎస్‌యువీల్లో ఇదొకటి. మార్కెట్లో కియా సోనెట్ సన్ రూఫ్ వేరియంట్‌కి మంచి పాపులారిటీ ఉంది.
హోండా WR V - రూ. 14లక్షలు
సన్‌రూఫ్ సౌలభ్యంతో హోండా తీసుకొచ్చిన మరో వాహనం హోండా డబ్ల్యూఆర్ వీ. ఇది సబ్ కాంపాక్ట్ ఎస్‌యువీ. సన్‌రూఫ్‌తో పాటు సమాచార, వినోద ఫీచర్లు ఉండటం ఈ వాహనపు అదనపు ఆకర్షణ.
స్కోడా కుషాక్ - రూ. 14లక్షలు
దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఎస్‌యువీ కార్లలో ‘స్కోడా కుషాక్’ ఒకటి . సన్‌రూఫ్‌తో పాటు అత్యాధునిక ఫీచర్లతో ఇది రూపుదిద్దుకుంది. రూ.14లక్షలకే ఇది అందుబాటులోకి వస్తోంది.
టాటా నెక్సాన్ - రూ.12లక్షలు
టాటా రూపొందించిన అధునాతన జనరేషన్ వాహనం ‘టాటా నెక్సాన్’. దేశీయ మార్కెట్లో ఈ వాహనానికి మంచి గిరాకీ ఉంది. రూ.12లక్షల ప్రారంభ ధరతో నెక్సాన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. నెక్సాన్ విద్యుత్ వాహనం ధర రూ.
16-18లక్షల మధ్యలో ఉంది.
హ్యుండయ్ వెన్యూ - రూ.13లక్షలు
హ్యుండయ్ నుంచి వచ్చిన ఎస్‌యువీ మోడల్ వాహనం హ్యుండయ్ వెన్యూ. ఆకర్షణీయమైన ఫీచర్లతో, సొగసైన డిజైన్‌తో కూడుకుని భద్రతకు పెద్దపీట వేసిన వాహనం ఇది. సన్ రూఫ్ ఫీచర్‌ని ఆస్వాదించేందుకు అనువైన వాహనం ఇది.
మారుతీ సుజుకీ XL6 - రూ. 13లక్షలు
మారుతీ నుంచి వెలువడిన మరో సన్‌రూఫ్ వాహనమే ఎక్స్‌ఎల్6. దేశంలోని నెక్సా షోరూంలలో ఈ వాహనం అందుబాటులో ఉంది. ఇందులో కూడా సన్‌రూఫ్ ఫీచర్‌ని బాగా ఎంజాయ్ చేయొచ్చు.