రూ.2లక్షలలోపు మహిళలు, యువతులకు అనువైన అత్యుత్తమ స్కూటీలివే..!(హైదరాబాద్‌లో ఆన్ రోడ్ ధర)
రూ.2లక్షలలోపు మహిళలు, యువతులకు అనువైన అత్యుత్తమ స్కూటీలివే..!
Honda Activa 6G - 0.95 lakh
ప్రస్తుతమున్న స్కూటీలలో అత్యాధునిక వాహనం హోండా యాక్టివా 6G. ఇండియాలో ఎంతోకాలంగా హోండా యాక్టివా ప్రసిద్ధి చెందుతూ వస్తోంది. 109.51cc ఇంజిన్, BS6 ప్రమాణాలతో ఇది రూపుదిద్దుకుంది. దీని 7.68bHp పవర్, 8.84Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సగటుగా లీటరుకు 55 కి.మీ పాటు మైలేజీ ఇవ్వగలదు.
TVS Ntorq 1.25 - 1 Lakh
ఇదొక ప్రత్యేకమైన బైక్. బ్లూటూత్ స్పీడోమీటర్, నేవిగేషన్ అసిస్టెన్స్, కాలర్ ఐడీ వంటి ఫీచర్లు దీని సొంతం. దీనికి ఇంజిన్ ఆన్/ఆఫ్ బటన్ ఉండటం అదనపు ప్రత్యేకత. ఫోర్ స్ట్రోక్ ఇంజిన్‌తో కూడుకున్నది. లీటరుకు 47కి.మీ మైలేజీ ఇవ్వగలదు. లేత ఎరుపు, నీలం, ఉదా, పసుపు రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంది.
TVS iQube - 1.25 Lakh
ఇదొక ఎలక్ట్రిక్ వాహనం. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 100కి.మీ ప్రయాణించగలదు. గరిష్ఠంగా 78కి.మీ వేగంతో వెళ్లగలదు. ఐదు గంటల్లో పూర్తిగా ఛార్జ్ కాగలదు. కాపర్ బ్రాంజ్, ప్లాటినం గ్రే, తదితర రంగుల్లో లభ్యమవుతోంది. ఎలక్ట్రిక్ స్కూటీ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇదొక మంచి ఎంపిక.
TVS Pep Plus - 0.75 Lakh
మహిళామణులకు, యువతులకు ఈ స్కూటీ సరిగ్గా నప్పుతుంది. ఇతర స్కూటీలతో పోలిస్తే ఇది కాస్త తేలికగా ఉంటుంది. 87.8సీసీ ఇంజిన్ సామర్థ్యం కలదు. మొబైల్‌ని ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. వినియోగాన్ని బట్టి మైలేజీ ఉంటుంది.
TVS Jupiter - 0.90 Lakh
యాక్టివా 6Gకి ప్రత్యామ్నాయం టీవీఎస్ జూపిటర్. 109.7cc ఇంజిన్, BS6 ప్రమాణాలతో ఇది రూపు దిద్దుకుంది. రైడ్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఐదు వేరియంట్లలో ఇది లభ్యమవుతోంది. లీటరుకు సగటుగా 62కి.మీ. మైలేజీ ఇస్తుంది.
Hero Pleasure + 0.75 Lakh
హీరో కంపెనీ ఉత్పత్తి చేస్తున్న స్కూటీ ఇది. 110.9cc ఇంజిన్, BS6 ప్రమాణాలున్నాయి. మహిళల కోసమే ప్రత్యేకంగా ఇది రూపుదిద్దుకుంది. కన్వీనియన్స్‌ని దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటీని తీర్చిదిద్దారు.
Vespa - Elegante 1.50 -1.55 lakh
పియాజియో ఈ స్కూటీని తీసుకొచ్చింది. 150cc ఇంజిన్ ఇది. దీనికి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం(ABS) కూడా ఉండటం గమనార్హం. సగటుగా లీటరుకు 42నుంచి 45కి.మీ పాటు మైలేజీ ఇవ్వగలదు.
Yamaha Fascino 125 - 0.90 Lakh
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్టైలిష్ స్కూటీలలో ఇదొకటి. 125cc ఇంజిన్, BS6 ప్రమాణాలతో రూపుదిద్దుకుంది. 8.04bHp పవర్,, 10.3Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.. కొత్త వెర్షన్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సౌకర్యం ఉంది.
Honda Activa 1.25 - 0.90 Lakh
హోండా యాక్టివాలోనే మరో వేరియంట్ ఇది. 124సీసీ ఇంజిన్, బీఎస్6 ప్రమాణాలతో రూపుదిద్దుకుంది. సగటుగా లీటరుకు 55కి.మీ పాటు మైలేజీ ఇవ్వగలదు. మెటల్ బాడీ, టింటెడ్ హెడ్ లైట్స్‌తో ఇది మరింత అందంగా ముస్తాబైంది.
Bajaj Chetak - 1.55 Lakh
బజాజ్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. దీనిని రెండు విధాలుగా వాడొచ్చు. స్పోర్ట్, ఎకో సెట్టింగులున్నాయి.బ్యాటరీ బ్యాకప్ 70వేల మైళ్ల కిలోమీటర్లు. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే గరిష్ఠంగా 90కి.మీ వెళ్లగలదు.
Ola S1 pro - 1.40 Lakh
ఎలక్ట్రిక్ వాహనాలలో ఓలో ఎస్1 ప్రో ఉత్తమంగా రాణిస్తోంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 181కి.మీ దూరం వెళ్లగలదు. గరిష్ఠ వేగం గంటకు 115 కి.మీ. ఆరున్నర గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోగలదు. వైఫై, బ్లూటూత్, జీపీఎస్ తదితర అధునాతన సౌకర్యాలు ఈ స్కూటీ సొంతం.
గమనిక
అత్యధిక మంది వినియోగదారులు వెల్లడించిన అభిప్రాయాల ఆధారంగా మైలేజీ వివరాలు పొందుపర్చాం. హైదరాబాద్ మార్కెట్ పరిధిలోని ధరను ఆధారంగా చేసుకుని వెల్లడించాం.