తెలుగులో బెస్ట్‌ సైన్స్‌ ఫిక్షన్ (Sci-Fi) మూవీస్‌

YouSay Short News App

అవతార్ 2 సినిమా ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లడానికి సిద్ధమైంది. సైన్స్ ఫిక్షన్ (Sci-Fi) చిత్రంగా ఇది రూపొందింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లోనూ ఈ కథాంశంతో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులని అలరించాయి. అవేంటో చూసేద్దామా..!

ఆదిత్య 369 (1991) - Prime Video

టైం ట్రావెల్ కథాంశంతో తెలుగు ప్రేక్షకులను మొట్టమొదట పలకరించిన సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ఆదిత్య 369’. విడుదలై 31ఏళ్లు గడుస్తున్నా ఈ సినిమాకు ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఈ జానర్‌లో తెరకెక్కిన సినిమాల్లో ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బాలకృష్ణ, అమ్రిష్ పురి, మోహిని ప్రధాన పాత్రల్లో నటించారు.

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వ ప్రతిభకు ఈ సినిమా కొలమానంగా నిలిచింది. ఆ కాలంలోనే టైం మిషిన్‌ని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ టైం మిషన్ ద్వారా శ్రీకృష్ణదేవరాయల(క్రీ.శ.1500) కాలం నాటికి వెళ్లడం, తిరిగి భవిష్యత్ కాలంలోకి(క్రీ.శ.2500) వచ్చి చేరడం; ఈ ప్రయాణంలో హీరో, హీరోయిన్ ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారన్నది ఆసక్తికరంగా చూపించారు.

భిన్నమైన కథాంశంతో రూపొందిన సినిమా ‘ప్లే బ్యాక్’. 2019లో ఉన్న కార్తీక్ అనే ఇన్వెస్టిగేటర్..

ప్లే బ్యాక్ (2021) - Prime Video

1993 కాలంలో బతుకుతున్న సుజాతను ఎలా కలుసుకున్నాడు? అనే లైన్‌తో సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ఎన్నో ట్విస్టులు మిమ్మల్ని అబ్బురపరుస్తాయి.

లవ్ వెర్సస్ డెస్టినీ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన సినిమా ఇది. ఒక జంట జీవితంలో జరిగిన సంఘటనలు మరొక జంట జీవితంలోనూ అలాగే చోటు చేసుకుంటే ఎలా ఉంటుంది? దీనినుంచి ఎలా బయటపడ్డారన్నదే కథ సారాంశం.

ఒక్క క్షణం (2017) - Hotstar

ఈ ప్రయత్నంలో హీరో, హీరోయిన్ ఎదుర్కొన్న అనుభవాలు కట్టి పడేస్తాయి. ట్విస్టులు, మలుపులతో ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది.

వరుణ్ తేజ్ హీరోగా చేసిన చిత్రం ‘అంతరిక్షం 9000KMPH’. తెలుగులో పూర్తిగా సైన్స్ ఫిక్షన్ మూవీగా ఇది తెరకెక్కింది. సంకల్ప్ రెడ్డి దర్శకుడు. అంతరిక్షంలో ఉండగా దేవ్ అనే ఆస్ట్రోనాట్..

అంతరిక్షం 9000 KMPH (2018) - Prime Video

ఓ ఉపగ్రహ సేవలను తిరిగి పునరుద్ధరించేందుకు చేసిన సాహసం గురించి తెలిపే కథ ఇది. ఈ సినిమా కచ్చితంగా మిమ్మల్ని అబ్బురపరుస్తుంది.

టైం ట్రావెల్ కథాంశంతో తెరకెక్కిన మరో  సినిమానే  ‘ఒకే ఒక జీవితం’. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం వస్తే ఎంతో బాగుంటుంది.

ఒకే ఒక జీవితం (2022) - Sony LIV

సరిగ్గా ఇదే అంశంతో తమ బాల్యంలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు  హీరో, అతడి స్నేహితులు గతానికి వెళ్తారు. మరి వారు తమ ప్రయత్నాన్ని విజయవంతంగా ముగించారా? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. మంచి సెంటిమెంట్ కూడా ఉండడంతో సినిమా మిమ్మల్ని తప్పక అలరిస్తుంది.

డిస్కో రాజా (2020) - Sun NXT

శ్రీవల్లి (2017)- Prime Video

ఇవి కూడా చూడొచ్చు

టాక్సీవాలా (2018) - Hotstar

బొంభాట్ (2020) - Prime Video

ఇవి కూడా చూడొచ్చు

నాని (2004) - YouTube

బింబిసార (2021) - Zee5

ఇవి కూడా చూడొచ్చు