2022లో మార్మోగిన పాటలు

YouSay Short News App

తెలుగు సంగీత ప్రపంచానికి  2022 అద్భుతమైన సంవత్సరం. 2021 డిసెంబర్‌లో విడుదలైన పుష్ప సినిమా నుంచి మెుదలకొని ఎన్నో హిట్‌ పాటలు చిత్ర పరిశ్రమను అలరించాయి.

సీతారామం, ఆర్‌ఆర్‌ఆర్‌, రాధే శ్యామ్ వంటి ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ ఆల్బమ్స్‌ ఆకట్టుకున్నాయి. మరి 2022లో టాప్‌లో నిలిచిన పాటలపై  ఓ లుక్కేయండి.

సీతారామం చిత్రంలోని ఈ పాట ప్రేక్షకులను మైమరపించింది. SPB చరణ్ తన గాత్రంతో ఈ క్లాసికల్ పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లారు. క్రిష్ణ కాంత్ లిరిక్స్‌, విశాల్ చంద్రశేఖర్ సంగీత మాయజాలంతో టాప్‌ సాంగ్స్‌లో చోటు దక్కింది.

1. ఇంతందం( సీతారామం )

ప్రభాస్‌ హీరోగా నటించి భారీ అంచనాలతో వచ్చిన చిత్రంలోని ఈ మెలోడి అన్ని భాషల్లో యువతను ఉర్రూతలూగించింది. యువన్ శంకర్‌ రాజా పాడటం ప్లస్. సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన మ్యూజికల్ హిట్.

2. ఈ రాతలే ( రాధే శ్యామ్ )

సిడ్ శ్రీరామ్, థమన్‌ కలిసి కళావతి పాట రూపంలో మహేశ్‌ బాబుకి గుర్తుండిపోయే ఆల్బమ్ ఇచ్చారు. 2022లో సర్కారువారి పాటలోని కళావతి ఓ బ్లాక్‌ బస్టర్.

3. కళావతి ( సర్కారువారి పాట )

రామ్‌ మిర్యాల వాయిస్‌కి తెలంగాణ భాష కలిగిన లిరిక్స్ తోడవ్వటం ఈ పాటను మెగా హిట్ చేశాయి. 2022 తొలి అర్థభాగంలో ఏ డీజే భారాత్‌లో చూసిన ఇదే పాట మార్మోగింది.

4. టిల్లు అన్నా డీజే ( డీజే టిల్లు )

ఆర్ఆర్‌ఆర్‌ చిత్రంలో కీలక సన్నివేశంలో వచ్చే  ఈ పాటకు కంటతడి పెట్టాల్సిందే. గుండెల్ని పిండేసేలా ఉండే లిరిక్స్, తారక్ అద్భుతమైన నటన కారణంగా ఎక్కువమంది వీక్థించిన జాబితాలో నిలిచింది.

5. కొమురం భీముడో ( RRR )

కార్తికేయ చిత్రంలో క్రిష్ణుడి గురించి చెప్పే ఈ సాంగ్ ప్రేక్షకుల్ని మరో లోకంలోకి తీసుకెళ్తోంది. సంగీత దర్శకుడు కాలభైరవ మ్యాజిక్ సినిమాకు చాలా ఉపయోగపడిందని చెప్పవచ్చు.

6. క్రిష్ణ ట్రాన్స్ ( కార్తికేయ-2 )

బ్రహ్మస్త్రలోని కేసరియా పాట ఇప్పటకీ అందరి నోళ్లలో నానుతుంది. ఈ మెలోడీ పాటను సిద్ధ్ శ్రీరాం ఆలపించారు.

7. కేసరియా ( బ్రహ్మాస్త్ర )

సీతారామం చిత్రబృందం నుంచి వచ్చిన మరో ప్రేమకావ్యం ఓ సీతా అనే పాట. ప్రేమ ప్రపంచంలో మునిగితేలుతున్న వారితో పాటు చాలామంది ఇష్టపడుతున్నారు.

8. ఓ సీతా ( సీతారామం )

ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాట మంచి డాన్స్ నంబర్. కీరవాణి తన సంగీతంతో మాస్‌ ఆడియన్స్ స్టెప్పులు వేసేలా చేశారు. ఇందులో చరణ్, ఎన్టీఆర్‌ల డాన్స్ చూడాలంటే రెండు కళ్లు చాలవు.

9. నాటు నాటు ( RRR )

సిద్ధ్ శ్రీరం గాత్రం నుంచి జాలువారిన మరో అద్భుతమైన పాట ఇది. సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా పాట మాత్రం జనాల్లోకి దూసుకెళ్లింది. 2022లో వచ్చిన మంచి ప్రేమ పాటల్లో ఇది కూడా ఒకటి.

10. బాగుంటుంది నువ్వు (అతిథి దేవో భవ)

2022 చివర్లో వచ్చిన ఓరి దేవుడాలోని గుండెల్లోనా అనే రొమాంటిక్ డాన్స్ సాంగ్ అలరించింది. ఈ పాటను అనిరుధ్ పాడటం మరింత ప్లస్ . సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ఎక్కడ చూసిన రీల్స్ మార్మోగాయి.

11. గుండెల్లోనా ( ఓరి దేవుడా )

రామ్ పోతినేని నటించిన చిత్రంలో ఈ ఎనర్జిటిక్ పాటను తమిళ్ సూపర్‌ స్టార్‌ శింబు పాడాడు. శింబు వాయిస్‌తో పాటు రామ్ డాన్స్‌తో చాలా పాపులర్ అయ్యింది.

12. బుల్లెట్ ( ది వారియర్ )

మరికొన్ని హిట్స్

కల్యాణం ( సీతారామం )

నీతో ఉంటే చాలు ( బింబిసార )

మరికొన్ని హిట్స్

నామది ( తిరు )

మేఘం కరిగేనా ( తిరు )

మరికొన్ని హిట్స్

కోకా ( లైగర్ )

విజిల్( ది వారియర్)

మరికొన్ని హిట్స్

రా రా రక్కమ్మ ( విక్రాంత్ రోణ )

నాకోసం మారావా నువ్వు ( బంగార్రాజు )