రూ.10 వేల లోపు అత్యుత్తమ ఇయర్ బడ్స్‌

నాయిస్ బడ్స్ VS201 V2 - ధర రూ.1,199

నాయిస్ బడ్స్ VS201V2  చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ఇవి సరసమైన ధరకే లభిస్తాయి. ఇవి భారత్‌లోనే తయారైన ఇయర్ ఫోన్లు

మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. బ్లాక్, ఆలివ్ గ్రీన్, స్నోవైట్ కలర్స్‌లో లభిస్తుంది. కాల్స్ మాట్లాడటానికి, మ్యూజిక్ వినడానికి ఈ ఇయర్ బడ్స్ చాలా బాగుంటాయి.

హైలెట్స్

- 6mm స్పీకర్ డ్రైవర్ - డ్యూయెల్ ఈక్వలైజర్ - ఫుల్ టచ్ కంట్రోల్ - టైప్ C చార్జింగ్ - 14 గంటల ప్లేటైమ్ - వాటర్ రెసిస్టెంట్

బోట్ ఎయిర్‌డోప్స్141 - ధర రూ.1,299

మంచి సౌండ్ క్వాలిటీ ఇయర్ బడ్స్ కావాలంటే వీటిని ఎంచుకోవచ్చు. ఈ ఇయర్ ఫోన్లు మొత్తం 42 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తాయి.

ఈ ఇయర్ బడ్స్ మొత్తం 7 కలర్లలో అందుబాటులో ఉంటాయి. వీటిలో ఉండే సౌండ్ క్వాలిటీ, బ్యాటరీ బ్యాకప్ చూసి సంగీత ప్రియులు ఇష్టపడతారు.

హైలెట్స్

- వైర్‌లెస్ రేంజ్ 10 మీటర్లు - చార్టింగ్ సమయం 2 గంటలు - ప్లేబ్యాక్ టైమ్ 42 గంటలు - గేమింగ్ కోసం బీస్ట్ మోడ్ - ఈఎన్ఎక్స్ సాంకేతికత

బ్లాపుంక్ట్ BTW 100 - ధర రూ.1499

ఇవి జర్మనీలో తయారైన ఇయర్ బడ్స్. వివిధ రకాల డిజైన్లతో ఇండియన్ మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఈ బ్రాండ్‌లో BTW 100 ఇయర్ బడ్స్ అతి తక్కువ ధరకు లభిస్తాయి.

బ్లాపుంక్ట్ బ్రాండ్‌లో BTW 100 ఇయర్ బడ్స్ నుంచే ప్రారంభమవుతాయి. ఈ ఇయర్ ఫోన్స్ చూడడానికి చాలా ఆకర్షనీయంగా ఉంటాయి. ఇవి ఉపయోగించడం చాలు సులభం. చెమట వల్ల వీటికి ఎలాంటి ప్రభావం ఉండదు.

హైలెట్స్

- చెమట, దుమ్ము వీటిపై ఎలాంటి ప్రభావం చూపవు - క్రిస్టల్ క్లియర్ కాల్స్ - పరిసరాల నాయిస్ బ్లాక్ చేస్తుంది - 40 గంటల ప్లేటైమ్ - గొప్ప సంగీత నాణ్యత కలిగి ఉంటాయి

వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ - ధర రూ.2,799

ఈ ఇయర్ ఫోన్స్‌తో సంగీత లోకంలో విహరించవచ్చు. ఈ బడ్స్ 12.4 ఎంఎం డైనమిక్ స్పీకర్లు కలిగి ఉంటాయి. నాయిస్ క్యాన్సిలేషన్‌తో మ్యూజిక్ ఆస్వాదించవచ్చు.

వీటి డిజైన్ కళ్లు చెదిరేలా ఉంటుంది. వన్ ప్లస్ ఫోన్‌తో పాటు ఇవి కూడా కావాలంటే వెంటనే స్టోర్‌కు వెళ్లి మీకు సరిపడేవి కొనొచ్చు.

హైలెట్స్

- సౌండ్ మాస్టర్ ఈక్వలైజర్ - ఆల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ - 7 గంటల ప్లేబ్యాక్ - వాటర్, డస్ట్ రెసిస్టెంట్ - నాయిస్ ఫ్రీ కాల్స్ - ఏ1 నాయిస్ క్యాన్సిలేషన్

ఒప్పో ఎన్‌కో W31 - ధర రూ.3,499

ప్రీమియం లుకింగ్ ఇయర్ బడ్స్ కోసం చూస్తుంటే ఒప్పో ఎన్‌కో W31 బడ్స్ తీసుకోవచ్చు. ఆకట్టుకునే డిజైన్, నాణ్యతతో ఈ బడ్స్ మార్కెట్‌లోకి వచ్చాయి.

ఈ బడ్స్ మంచి బ్యాండ్ విడ్త్ కలిగి ఉంటాయి.  ఈ ప్రొడక్ట్ మంచి నాణ్యత కలిగిని క్రిస్టల్ క్లియర్ సౌండ్ కలిగి ఉంటాయి. బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది.

హైలెట్స్

- బ్యాటరీ సమయం 15 గంటలు, చార్జింగ్ టైమ్    2.30 గంటలు - ఏ1 పవర్డ్ నాయిస్ రెడిక్షన్ ఆల్గారిథమ్‌తో కూడిన    క్రిస్టల్ క్లియర్ కాల్స్ - ఐపీ54 గుర్తింపు పొందిన బడ్స్. డస్ట్, వాటర్ ప్రూఫ్ - గ్రేట్ ప్లే అండ్ పాజ్ ఆల్గారిథమ్

సోనీ WF-C500 - ధర రూ.5,300

ఇవి సోనీ ప్రొడక్ట్స్‌లో ఎంట్రీ లెవెల్ వైర్‌లెస్ ఇయర్ బడ్స్. వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా తయారు చేశారు. వీటిని ఉపయోగించడం చాలా సులువు.

మంచి నాణ్యత గల ఆడియో వీటి సొంతం ఈ హెడ్ ఫోన్స్ గేమింగ్‌కు బాగా పనికొస్తాయి. కొంచెం ధర ఎక్కువైనా రోజు వారీ వినియోగానికి ఈ బడ్స్ బాగుంటాయి.

హైలెట్స్

- ఎర్గోనామిక్ సర్పేస్ డిజైన్ - 20 గంటలకు పైగా బ్యాటరీ లైఫ్ - ఐపీఎక్ష్4 వాటర్ రెసిస్టెంట్ - హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ - సౌండ్ రాపిడ్‌గా ఉంటుంది

గూగుల్ పిక్సెల్ బడ్స్ ఏ-సీరీస్ - ధర రూ.5,999

గూగుల్ పిక్సెల్ బడ్స్ పూర్తిగా ప్రీమియం ప్రొడక్ట్. మొత్తం గ్లాస్‌తో తయారు చేసి ఉంటాయి. వీటిలో గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ఏర్పాటు చేశారు. ఇవి పిక్సెల్ ఫోన్‌కు సరిగ్గా సరిపోతాయి.

వీటిలో ఉండే ఏ1 ఫంక్షన్ నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది.బ్యాటరీ లైఫ్ కానీ, సౌండ్ క్వాలీటీ గానీ అద్భుతంగా ఉంటాయి.

హైలెట్స్

- ప్రీమియం డిజైన్, మంచి క్వాలిటీ - గ్రేట్ బ్యాస్, సౌండ్ క్వాలిటీ - క్రిస్టల్ క్లియర్ వోకల్స్ - హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్

శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ప్రొ - ధర రూ.8,490

ప్రీమియం సెగ్మెంట్లలో అత్యుత్తమమై వాటిలో శాంసంగ్ గెలాక్సీ బడ్స్ కూడా ఒకటి. ప్రతి ఒక్క ఉత్పత్తిపై శాంసంగ్ యంత్రాంగం శ్రద్ధ పెట్టి తయారు చేస్తారు.

ఇంటిలిజెన్స్ నాయిస్ క్యాన్సిలింగ్‌తో మన ముందుకు వచ్చారు. త్రీ మైక్ సిస్టమ్‌తో పాటు వాటర్ రెసిస్టెంట్‌తో తయారు చేశారు. వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌తో డిజైన్ చేయటంతో ఇది ఆకర్షనీయంగా ఉంటుంది.

హైలెట్స్

- స్మూత్ టచ్ కంట్రోల్స్ - వైర్‌లెస్ చార్జింగ్ - యాంబియట్ సౌండ్ మోడ్ - యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ - బ్యాటరీ లైఫ్

నథింగ్ ఇయర్-1 - ధర రూ.8,499

నథింగ్ ఇయర్-1లో మంచి కాల్ సౌకర్యంతోపాటు సౌండ్ సిస్టమ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఉండే యూఎన్‌సీ ఫీచర్‌తో మనకు ఏ సౌండ్ కావాలో అదే వినవచ్చు.

మీరు గనుక గేమర్ అయితే ఈ బడ్స్ జోలికి వెళ్లకపోవడం ఉత్తమం

హైలెట్స్

- వైర్‌లెస్ చార్జింగ్, బ్యాటరీ లైఫ్ - లైట్ వైట్ - కస్టమైజేషన్స్ అండ్ సెట్టింగ్స్ - వాటర్ రెసిస్టెంట్ - ఆటో పాజ్ ప్లే ఆల్గారిథమ్ - పారదర్శక డిజైన్

నఒప్పో ఎన్‌కో ఎక్స్2 - ధర రూ.8,999

యాపిల్ ఎయిర్‌పాడ్స్‌తో పోల్చి చూస్తే ఒప్పో ఎన్‌కో ఎక్స్2 ధర కొంచెం ఎక్కువే. ఈ బడ్స్‌ను మల్టీమీడియా, గేమింగ్‌కు ఉపయోగించేవారి కోసం తయారు చేశారు.

నాయిస్ క్యాన్సిలేషన్ పనీతీరు అద్భుతంగా ఉంటుంది. వీటిలో హేయ్ మెలోడీ యాప్ కూడా ఉంటుంది. ఇదే కాక ఈ బడ్స్ చాలా ఫీచర్లను కలిగి ఉన్నాయి. వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌తో ఇవి అదరగొడతాయి.

హైలెట్స్

- 3X సౌండ్ క్వాలిటీ - అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ - ఫాస్ట్ చార్జింగ్ - 40 గంటల ప్లే టైమ్ - హేయ్ మెలోడీ యాప్ - ఆల్ట్రా స్మూత్ టచ్ సెన్సార్స్