తొలి టెస్టును ఇన్నింగ్స్‌తో గెలిచిన రెట్టించిన ఆత్మవిశ్వాసంతో దిల్లీలో టీమిండియా అడుగుపెడితే..ఫైటింగ్ స్పిరిట్‌తో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలు పోరాట పటిమను కనబరిచారు.
వార్నర్ మరోసారి పరుగులకు ఇబ్బంది పడుతున్న వేళ.. మరోవైపు ఉస్మాన్ ఖవాజా ధాటిగా ఆడాడు. అశ్విన్‌పై ఎదురుదాడి చేస్తూ పరుగులు రాబట్టాడు.
సిరాజ్ దూకుడైన బౌలింగ్‌కు మ్యాచ్ మొదలైన గంటలోనే మూడు సార్లు ఫిజియో గ్రౌండ్‌లోకి రావాల్సి వచ్చింది.
తడబడుతూ ఆడిన వార్నర్ 15(44) కాస్త ఊపు అందుకునే క్రమంలో మరోసారి షమీ అద్భుత బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
వార్నర్ తర్వాత వచ్చిన లబుషేన్ కూడా దూకుడైన ఆటతీరును కనబర్చాడు. అయితే 23వ ఓవర్లో అశ్విన్..లబుషేన్ 18(25), స్మిత్ (0)లను పెవిలియన్‌కు చేర్చి..భారత్‌ను మళ్లీ గేమ్‌లోకి తీసుకొచ్చాడు.
తొలిసెషన్ ఆస్ట్రేలియా 94 పరుగులు- ఇండియా 3 వికెట్లతో సమానంగా నిలిచాయి.
రెండో సెషన్‌లో మరోసారి తొలివికెట్‌ను షమీ అందించాడు. రాహుల్ అద్భుతమైన క్యాచ్‌కు ట్రావిస్ హెడ్ పెవిలియన్ బాట పట్టాల్సివచ్చింది.
దూకుడుగా ఆడుతూ సెంచరీ చేసేలా కనిపించిన ఖవాజాను 81(125) వద్ద జడేజా ఔట్ చేశాడు. స్విచ్ హిట్ ఆడిన ఖవాజాను రాహుల్ మరోసారి అద్భుతమైన క్యాచ్‌తో డగౌట్‌కు చేర్చాడు.
ఆ తర్వాతి ఓవర్‌లోనే అలెక్స్ కేరీని అశ్విన్ డకౌట్‌గా వెనక్కిపంపించాడు. రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా 105 పరుగులు చేయగా టీమిండియా మరోసారి 3 వికెట్లు తీసుకుంది.
మూడో సెషన్‌లో ప్యాట్ కమిన్స్, హ్యండ్స్‌కూంబ్ కలిసి స్కోరును 200 పరుగులు దాటించారు. 227 పరుగుల వద్ద 68వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన జడేజా..కమిన్స్ 33(58), మర్ఫీ(0)ను పెవిలియన్‌కు చేర్చాడు.
227-8 స్టేజ్‌లో నాథన్ లియాన్, హ్యాండ్స్‌కూంబ్ మరో పార్ట్‌నర్‌షిప్ బిల్డ్ చేసేలా కనిపించారు. 75ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన షమీ మరోసారి తన మ్యాజిక్ బాల్‌తో లియాన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
78వ ఓవర్‌లో జడేజా వేసిన బంతికి హ్యాండ్స్‌కూంబ్ అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అశ్విన్ తాను క్యాచ్‌ను పట్టలేదు అని చెబుతుండగానే.. అంపైర్ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు.
263 పరుగుల వద్ద 79వ ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన షమీ, కునేమన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ముగించాడు.
టెస్టుల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 250 వికెట్లు, 2500 పరుగులు చేసిన ఆల్‌రౌండర్‌గా జడేజా రికార్డు సృష్టించాడు. 62 ఇన్నింగ్స్‌లో జడేజా ఈ ఫీట్ సాధించాడు. అంతకుముందు కపిల్ దేవ్ 65 ఇన్నింగ్స్ ఈ ఘనత సాధించాడు.
ఆస్ట్రేలియాపై 100 వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ రికార్డు నమోదు చేశాడు.
ఆస్ట్రేలియా తరఫున ఆరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా టాడ్ మర్ఫీ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన మర్ఫీ..బాబ్ మస్సీ(8), జేసన్ క్రేజా(8)ల వెనక ఉన్నాడు.
భారత బ్యాటర్లలో రోహిత్ 120, అక్షర్ పటేల్ 84, రవీంద్ర జడేజా 70 అదరగొట్టారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 177 పరుగులకు సమానంగా జడేజా, అశ్విన్, అక్షర్ స్పిన్ త్రయం పరుగులు చేశారు.