BGT Roundup:  నాలుగో టెస్ట్ డ్రా.. WTC ఫైనల్‌కు టీమిండియా

YouSay Short News App

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ సొంతం అయ్యింది. నాలుగు టెస్ట్‌ డ్రాగా ముగిసినప్పటికీ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది టీమిండియా.

చివరి టెస్ట్ డ్రాగా ముగియటం అటు శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం సాధించడంతో WTC పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరింది.

BGTలో భాగంగా జరిగిన మెుదటి టెస్ట్‌లో మెుదటి రోజు నుంచే ఆధిపత్యం చెలాయించింది టీమిండియా. రోహిత్ సెంచరీ, జడ్డూ, అక్షర్ అర్థ శతకాలతో 400 పరుగులు చేసింది.

నాగ్‌పూర్ టెస్ట్‌

ఆస్ట్రేలియాను 177 పరుగులకే ఆలౌట్‌ చేసి 222 పరుగుల లీడ్‌ దక్కించుకుంది రోహిత్ సేన. జడేజా 5 వికెట్లు, అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టారు.

రెండో ఇన్నింగ్స్‌లోనూ అశ్విన్ దెబ్బకు 91 పరుగలకే కుప్పకూలింది ఆసీస్‌. దీంతో ఇండియా ఘన విజయ సాధించింది.

దిల్లీ వేదికగా రెండో టెస్ట్ జరిగింది. మెుదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌లో ఖవాజా, హ్యాండ్‌స్కాంబ్ రాణించడంతో 263 పరుగులు చేసింది. షమీ 4, అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు తీశారు.

దిల్లీ దంగల్‌

స్పిన్నర్ నాథన్ లియోన్ దెబ్బకు తడబడినా అక్షర్ పటేల్ 74 పరుగులు చేయడంతో కేవలం 1 పరుగు ఆధిక్యాన్ని ప్రదర్శించింది ఆసీస్.

రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా ధాటికి కంగారూలు చిత్తయ్యారు. ఏడు వికెట్లు తీయటంతో కేవలం 113 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వటంతో టీమిండియా సునాయసంగా చేధించింది.

వరుస ఓటములతో ఉన్న ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బలు తగిలాయి.  వార్నర్, హేజిల్‌వుడ్‌ గాయాలతో వెనుదిరగటం, కమ్మిన్స్‌ వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్లడంతో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యారు.

దెబ్బ మీద దెబ్బ

దాదాపు ఏడుగురు ఆటగాళ్లు సిరీస్‌ నుంచి వెళ్లిపోవటంతో ఆసీస్‌కు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. కెప్టెన్‌ కూడా దూరం కావటంతో సారథ్య బాధ్యతలు స్మిత్‌కు అప్పగించారు.

స్మిత్ సారథ్యంలో పుంజుకుంది ఆసీస్. మూడో టెస్ట్‌లో ఇండియాను తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్ చేశారు. కునేమెన్ 5, లైయన్ 3 వికెట్లతో రాణించారు.

కంగారు పెట్టారు

రెండో ఇన్నింగ్స్‌లోనూ నాథన్ లైయన్ 8 వికెట్లు పడగొట్టడంతో ముందున్న 78 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించి టెస్ట్ ఛాంపియన్షిప్‌ ఫైనల్ చేరారు.

నాలుగో మ్యాచ్‌లో ఆసీస్‌ పట్టు బిగించి 480 పరుగులు చేసింది. గిల్, కోహ్లీ సెంచరీలతో టీమిండియా కూడా 571 పరుగుల సాధించింది. చివరికి డ్రాగా ముగిసింది మ్యాచ్.

WTC ఫైనల్‌కి

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ డ్రాగా ముగిసినా…శ్రీలంకపై కివీస్ విజయం సాధించడంతో లంక పాయింట్లు తగ్గి ఇండియాకు అవకాశం వచ్చింది.

శ్రీలంకపై విజయం కోసం కేన్ విలియమ్సన్ మెరుపు సెంచరీ సాధించడంతో పాటు ఆఖరి బంతికి పరుగు తీసి టీమిండియాను ఫైనల్ చేర్చాడు.