BGT: 25 ఏళ్ల బార్డర్‌ గవాస్కర్  ట్రోఫీ జర్నీలో మర్చిపోలేని విషయాలు!

YouSay Short News App

1996 నుంచి ఇండియా- ఆస్ట్రేలియా బార్డర్‌ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్నాయి. ఇద్దరు లెజెండరీ క్రికెటర్ల పేరు మీదుగా వచ్చిన ఈ ట్రోఫీకి యేటా క్రేజ్ పెరుగుతూ వచ్చింది. మరి ఎన్నేళ్లలో  ఈ ట్రోఫీలో జరిగిన ఆసక్తికర విషయాలేంటో చూద్దామా

ఫస్ట్‌ ఈజ్‌ ఆల్వేస్‌ బెస్ట్‌ అంటారు కదా. తొలిసారి జరిగిన బార్డర్ గవాస్కర్‌ ట్రోఫీలో అనిల్ కుంబ్లే అద్భుత ప్రదర్శనతో టీమిండియా సాధించిన తొలి విజయం ఎప్పటికీ తీపి గుర్తుగానే ఉండిపోతుంది.

1996 తొలి విజయం

1997-98 ట్రోఫీ తర్వాత ఆస్ట్రేలియా లెజెండరీ బౌలర్‌ షేన్ వార్న్‌ చేసిన వ్యాఖ్యలు ఎప్పటికీ మర్చిపోలేం.  ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన సచిన్‌ గురించి మాట్లాడుతూ “ తెందూల్కర్‌ నా బంతుల్లో సిక్స్‌ కొడుతున్నట్లు పీడకలలు వస్తున్నాయి. బ్రాడ్‌మన్‌ మాత్రమే అతడికి సరితూగగలడు’ అంటూ వ్యాఖ్యానించాడు.

సచిన్‌ పీడకలలా మారాడు!

పేస్‌ బౌలర్ల గురించి మాట్లాడుకుంటే బ్రెట్ లీ పేరు లేకుండా ఉండదు. ఇలాంటి ఆటగాడు తొలుత టెస్ట్‌ క్యాప్‌ అందుకుంది 1999-2000 జరిగిన బార్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ మ్యాచ్‌లోనే.

బ్రెట్‌ లీ ఆరంగేట్రం

క్రికెట్ చరిత్రలో గొప్ప మ్యాచ్‌లుగా చెప్పుకునే వాటిలో 2000-01లో జరిగిన BGT ట్రోఫీ రెండో టెస్ట్‌ ఒకటి. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. 171 తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైన టీమిండియా ఫాలో ఆన్‌ ఆడింది. మూడోరోజు ముగిసేసరికి ఇండియా స్కోర్‌ 254/4.

ఇద్దరు మొనగాళ్లు!

అంతా టీమిండియా ఓటమి ఖాయమనుకున్నారు. కానీ నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగిన లక్ష్మన్‌ ద్రావిడ్‌ రోజంతా ఆడారు. 9 మంది బౌలర్లను ప్రయోగించినా వికెట్‌ మాత్రం జారవిడువలేదు. వీరిద్దరే 376 పరుగులు జోడించారు.ఓటమి అంచునుంచి వచ్చిన టీమిండియా 171 పరుగులతో ఘన విజయం సాధించింది.

లక్ష్మన్‌-ద్రావిడ్ అద్భుత ప్రదర్శన చేసిన అదే మ్యాచ్‌లో టీమిండియా తరఫున తొలి హ్యాట్రిక్‌ తీసిన బౌలర్‌గా హర్భజన్‌ సింగ్ రికార్డు సృష్టించాడు.

తొలి హ్యాట్రిక్‌

2003-04 సిరీస్‌లో రిక్కీ పాంటింగ్‌ విధ్వంసం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్‌లో రిక్కీ పాంటింగ్‌ వరుసగా 2 డబుల్‌ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు.

పాంటింగ్‌ డబుల్‌ డబుల్స్‌

భారత్‌ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు (619) తీసిన బౌలర్‌గా రికార్డుల్లో ఉన్న అనిల్‌ కుంబ్లే..2004-05 బార్డర్ గవాస్కర్‌ ట్రోఫీలో తన 400వ వికెట్ తీశాడు.

అనిల్‌ కుంబ్లె @400

భారత గడ్డపై టెస్టు సిరీస్‌ విజయం కోసం 35 ఏళ్లు నిరీక్షించిన ఆస్ట్రేలియాకు 2004-05 BGTతో కల నెరవేరింది. ఈ సిరీస్‌ను స్టీవ్‌ వా ఆఖరి పోరాటంగా అభివర్ణిస్తారు.

ఆస్ట్రేలియా తొలి విజయం

320 పరుగులతో తొలి టెస్టు విజయం సాధించిన ఇండియాకు అప్పటికి ఇదే టెస్టు క్రికెట్‌ చరిత్రలో అతిపెద్ద విజయం. అలాగే తెందూల్కర్‌ 12000 పరుగులు మార్కును దాటి టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు.

చారిత్రకం 2008 - 09 BGT

2012-13 సిరీస్‌లో సెహ్వాగ్‌ స్థానంలో ఓపెనర్‌గా తొలి టెస్టు మ్యాచ్‌ ఆడిన గబ్బర్‌..  సంచలనం సృష్టించాడు. 187 పరుగులతో ఆరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక స్కోర్‌ చేసిన బ్యాటర్‌గా నిలిచి..తొలి మ్యాచ్‌కే మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకున్నాడు.

శిఖర్‌ ధావన్‌ సంచలనం

2018-19లో బాల్‌టాంపరింగ్‌ కారణంగా వార్నర్‌, స్మిత్‌ జట్టుకు దూరమైన వేళ ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా తమ తొలి సిరీస్‌ విజయాన్ని నమోదు చేసింది.

ఆస్ట్రేలియా గడ్డపై తొలి విజయం

2020-21లో జరిగిన తొలి టెస్టులో టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యల్ప స్కోరును నమోదు చేసిన టీమిండియా మాయని గాయాన్ని చేసుకుంది. కేవలం 36 పరుగులకే ఈ మ్యాచ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో టీమిండియా కుప్పకూలింది.

మరువలేని పరాభవం

2020-21 తొలిటెస్టులో మాయని గాయం చేసుకున్న టీమిండియా.. చివరి టెస్టులో ఆస్ట్రేలియాకు అదే రుచిచూపించింది. 32 ఏళ్లుగా ఓటమి ఎరుగని గబ్బా స్టేడియంలో కంగారూలకు మర్చిపోలేని ఓటమి చూపించారు. ICC పెట్టిన  ఓ పోల్‌లో ఈ మ్యాచ్‌  “అల్టిమేట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ఆఫ్‌ ఆల్‌ టైం”గా ఎంపికైంది.

గబ్బా గోడలు బద్దలు

ఆస్ట్రేలియాలో క్రితంసారి మనవాళ్లు కొట్టిన దెబ్బకు ప్రతికారం తీర్చుకునేందుకు ఆస్ట్రేలియా ఇండియాలో అడుుగుపెట్టింది. ఫిబ్రవరి 9 నుంచి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సమరం మళ్లీ మొదలు కాబోతోంది.