ముచ్చట్లు

‘దివి’

Floral Separator

బ్రేకప్స్‌, క్యాస్టింగ్‌ కౌచ్‌పై  బిగ్‌బాస్‌ ఫేం

బిగ్‌ బాస్‌ బ్యూటీ దివి ఆసక్తికర ప్రాజెక్టులతో ఎట్టకేలకు  తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగులు వేస్తోంది.

ఇటీవల విడుదలైన చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రంలో దివి తళుక్కున మెరిసింది. నటనతో అందరిని మెప్పించింది.

మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్‌’ చిత్రంలోనూ అవకాశం దక్కించుకుంది.

బిగ్‌బాస్‌ ద్వారా దివి పేరు సంపాదించుకుంది. తెలుగు నెటివిటీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్‌లో పాపులర్‌ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

సామాజిక మాధ్యమాల్లోనూ దివికి ఫాలోవర్స్‌ ఎక్కువే.  తన హాట్‌ లుక్స్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.

మీడియాతో మాట్లాడుతూ తన బ్రేకప్‌ కథను పంచుకుంది.

కుటుంబానికి తెలిసిన వ్యక్తితో రిలేషప్‌లో ఉన్నానని చెప్పింది.. అతడిని పెళ్లి చేసుకోవాలని భావించినట్లు చెప్పింది.

తన లక్ష్యాలకు అడ్డుగా ఉండటంతో సాధ్యపడలేదని దివి పేర్కొంది. అందుకే అతడితో తెగదెంపులు చేసుకున్నట్లు వెల్లడించింది.

ఇప్పటికీ తాను ప్రేమించిన వ్యక్తి అంటే గౌరవం ఉందట.. అతడికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.

రిలేషన్‌ షిప్‌లో కంటే ఒంటరిగా ఉండటం వల్ల ఎక్కువ స్వేచ్ఛ దొరికిందని దివి పేర్కొంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌పైనా దివి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏదైనా ఇద్దరి అంగీకారంతోనే జరుగుతుందని అందులో ఎలాంటి నేరం లేదని వ్యాఖ్యానించింది.

ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం పొందాలనుకునేవారికి అవి పెద్ద సమస్యలుగా కనిపించవని, కొందరికి ఇబ్బందిగా కనిపిస్తుందని తెలిపింది. అది మన నిర్ణయాన్ని భట్టి ఉంటుందని స్పష్టం చేసింది.

అమెరికాలో ఇటీవల హాలీవుడ్‌ నటుడు డెంజెల్‌ వాషింగ్టన్‌తో దిగిన ఫ్యాన్‌గర్ల్‌ ఫొటోను దివి షేర్‌ చేసింది.

సినిమాలు, సంగీత కార్యక్రమాలతో దివి ఇప్పుడు తీరిక సమయం లేకుండా గడుపుతోంది.