చార్లెస్ శోభరాజ్‌ను ఎందుకు బికినీ కిల్లర్, ది సర్పెంట్ అంటుంటారు? ఎన్నో రోజులు జీవిత ఖైదు అనుభవించిన అతడికి నేరచరిత్ర ఎలా వచ్చింది? ఇలాంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి.
భారత పౌరుడికి, వియత్నాం పౌరురాలుకి చార్లెస్ జన్మించాడు. అతడు చిన్నతనంలో ఉండగానే వాళ్లు విడిపోయారు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోగా రెండో భర్త శోభరాజ్‌ను దత్తత తీసుకున్నాడు. వాళ్లిద్దరి వద్ద కొన్నేళ్లపాటు పెరిగాడు.
బాల్యం
తల్లిదండ్రులకు పిల్లలు పుట్టడంతో అతడి పట్ల నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆవేశంలో ఇంటి నుంచి వెళ్లిపోయిన చార్లెస్.. దొంగతనాలు, దోపీడీలకు పాల్పడ్డాడు. అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూడలేదు.
నేరచరిత్ర
1970లో ఆగ్నేయాసియా దేశాల్లో వరుస హత్యలతో హడలెత్తించడంతో శోభరాజ్ పేరు మార్మోగింది. దాదాపు 20కిపైగా హత్యలు చేసినట్లు సమాచారం.
హత్యలు చేసిన శోభరాజ్‌ను పట్టుకోవటం అప్పట్లో పోలీసులకు కత్తిమీద సాము అయ్యింది. హత్య చేసిన తర్వాత బాధితుల పాస్‌పోర్ట్‌లతోనే అతడు దేశం దాటేవాడంటే అర్థం చేసుకోండి.
చిక్కడు - దొరకడు
భారత్‌లో అతడిని 1976లో అరెస్ట్ చేశారు. దిల్లీలో ఓ ఫ్రెంచ్ పౌరుడికి విషం ఇచ్చిన చంపిన కేసులో పట్టుకున్నారు. దాదాపు 20 ఏళ్లు జైలులోనే మగ్గాడు.
ఎట్టకేలకు
లుక్స్‌తోనే లింక్స్
చూడటానికి అందంగా కనిపించే చార్లెస్ .. అందాన్నే ఆయుధంగా మలుచుకున్నాడు. లుక్స్‌తోనే అందరిని నమ్మించేవాడట. మాయమాటలు చెప్పి జైలులో ఉన్న వారందరితో స్నేహం చేయటమే కాకుండా అందులో నుంచే దందాలు చేశాడని టాక్.
చార్లెస్ శోభరాజ్‌ను బికినీ కిల్లర్ అని పిలుస్తుంటారు. ఇందుకు కారణం అతడు చేసిన వరుస హత్యల్లో ఇద్దరు మహిళలు బికినీలతో ఉన్నారు. దీనివల్లే ఆ పేరు వచ్చింది.
బికినీ కిల్లర్
ది సర్పెంట్
హత్యలు, దోపీడీలు, రేప్‌లు చేసినా సులువుగా తప్పించుకునేవాడట. అతడు పాములా పారిపోయేవాడని అంటారు. అందుకే ది సర్పెంట్ అని పిలుస్తుంటారు.
ఇతడి క్రిమినల్ కెరీర్ ఆధారంగా నాలుగు చిత్రాలు వచ్చాయి. ఇందులో మూడు డాక్యుమెంటరీలు. మై ఔర్ చార్లెస్ అనే బాలీవుడ్ సినిమా తీశారు.
సినిమాల్లో బికినీ కిల్లర్
జీవిత ఖైదు అనుభవిస్తున్న చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అనారోగ్య కారణాలు, వయసు మీదపడటంతో రిలీజ్‌కు అనుమతివ్వటంతో మళ్లీ ఈ కరుడు గట్టిిన హంతకుడి పేరు వార్తల్లో నిలిచింది.
మరిన్ని కథనాల కోసం మా వెబ్‌సైట్ చూడండి. YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.