BLUE BUGGING
బ్లూటూత్ ఆన్ చేస్తున్నారా? బ్లూబగ్గింగ్ ద్వారా సైబర్ దాడి
YouSay Short News App
ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఇయర్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు అందుబాటులోకి రావడంతో బ్లూటూత్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీన్ని సైబర్ నేరగాళ్లు అవకాశంగా మార్చుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
బ్లూటూత్ ఆన్‌లో ఉండే ఫోన్లే లక్ష్యంగా సైబర్ దాడులు చేస్తున్నారు. ‘బ్లూ బగ్గింగ్’ పేరిట పిలిచే
ఈ హ్యాకింగ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోంది.
బ్లూ బగ్గింగ్‌పై సైబర్‌క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్లూటూత్ ద్వారా చేసే సైబర్ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
సాధారణంగా స్మార్ట్ ఫోన్లకు మెసేజ్‌లు, ఈమెయిల్ లింక్స్ పంపి, వాటిని క్లిక్ చేయగానే మాల్ వేర్స్ పంపి హ్యాక్ చేస్తుంటారు.
బ్లూ బగ్గింగ్ అంటే..?
బ్లూబగ్గింగ్ విధానంలో మాత్రం బ్లూటూత్ ఆన్‌లో ఉన్న ఫోన్లను హ్యాక్ చేస్తుంటారు
బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు 10 మీటర్ల పరిధిలో బ్లూటూత్ ఆన్‌లో ఉన్న ఫోన్లకు బ్లూటూత్ ద్వారా రిక్వెస్ట్ పంపించి పెయిర్ అవుతారు.
ఒకసారి కనెక్ట్ అయితే అంతే.. ఇక మన ఫోన్‌కు ఎలాంటి సందేశాలు రాకుండా రహస్యంగా కొన్ని రకాల మాల్‌వేర్లను పంపిస్తారు.
ఫోన్‌ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటారు. మాల్‌వేర్లను పంపించి కాంటాక్ట్, ఫొటోలు, ఇతర కీలక సమాచారం దొంగిలించి బెదిరిస్తుంటారు.
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రాంతాల్లో ఉచిత వైఫై వినియోగించకపోవడం ఉత్తమం
బయట ఉంటే అవసరమైతే తప్ప బ్లూటూత్ ఆన్ చేయవద్దు.
జాగ్రత్తలు ఇలా..
మీకు తెలియని డివైజ్‌లు, పరిచయం లేని వ్యక్తులు బ్లూటూత్ ద్వారా పంపే పెయిరింగ్ రిక్వెస్ట్‌లకు పేయిర్ కావోద్దు.
అవసరం లేకపోతే అప్పటివరకూ అనుసంధానమైన బ్లూటూత్ పరికరాలతో అన్‌పెయిర్ చేయాలి.
మొబైల్ డేటాలో గమనిస్తూ ఉండాలి. అదనపు భద్రతకు వీపీఎన్ వాడాలి.
మరిన్ని కథనాల కోసం మా వెబ్‌సైట్ చూడండి. YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.