బాలీవుడ్ బ్యాటీ రాధికా ఆప్టే ఒకప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచేది. బోల్డ్ కంటెంట్ ఉండే పాత్రలు, మాటలతో వివాదస్పవడం ఆమె కెరీర్‌కు మైనస్ అయ్యింది.
ఈ అందాల తార ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మెుదలు పెట్టింది. ఏకంగా మెగా ఫోన్ చేత పట్టి స్లీప్ వాకర్స్ అనే షార్ట్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించింది.
బాలీవుడ్‌లోనే ఎంట్రీ ఇచ్చిన రాధికా ఆప్టే మెుదట్లో సహాయ పాత్రల నుంచి హీరోయిన్‌గా ఎదిగింది. అంతకముందు రంగస్థలంపై నాటకాలు వేసేదట మరాఠీ ముద్దుగుమ్మ
రంగస్థల నటి
సినిమాలకంటే ఎక్కువగా బోల్డ్ పాత్రలు, ఫొటోలతోనే రాధికా ఫేమస్. వెడ్డింగ్ గెస్ట్, పార్చ్‌డ్ సినిమాల్లో పూర్తిగా నగ్నంగా నటించింది.
బోల్డ్ బ్యూటీగా
పాత్రకు ప్రాధాన్యత ఉంటే ఏం చేయడానికైనా రాధిక సిద్ధం.
హంటర్, బద్లాపూర్, లస్ట్ స్టోరీస్, అహల్య వంటి సినిమాలు, వెబ్ సీరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లో బోల్డ్ పాత్రల్లో నటించింది. దీనివల్ల కూడా ఆమెకు జనాల్లో కొంత నెగిటివిటీ వచ్చింది.
అలాంటి పాత్రలు
రాధికా ఆప్టే ఒకానొక సమయంలో తన బాడీ పార్ట్స్ గురించి మాట్లాడి విమర్శలు ఎదుర్కొంది. XYZ ఉన్న నటి కావాలని చెప్పి తనను రిజెక్ట్ చేశారని చెప్పి బాంబ్ పేల్చింది.
XYZ కామెంట్స్
అవకాశాల కోసం సర్జరీ చేసుకోవటం తనకు రాదని, అందం మాయలో పడలేదంటుంది ఈ బ్యూటీ. సక్సెస్ కోసం మాత్రం చాలా ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది ఓసారి.
సర్జరీ, సక్సెస్
తెలుగులో లెజెండ్, లయన్, ధోని వంటి చిత్రాల్లో ఆమె నటించారు. టాలివుడ్‌లో సరిగా ట్రీట్ చేయరని, సెట్‌కు 2 గంటల ముందే రావాలని చెప్పటం వివాదాస్పదం అయ్యింది.
దక్షిణాదిని వదల్లేదు
తెలుగు పరిశ్రమకు చెందిన ఓ టాప్ హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పడం అప్పట్లో సంచలనం. ఆ టాప్ హీరోకు వార్నింగ్ కూడా ఇచ్చానని చెప్పడం దుమారమే రేగింది.
తెలుగు టాప్‌హీరో
సోషల్ మీడియాలో ఆప్టే చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది.
సామాజిక మాధ్యమాల్లోనూ
కొంతకాలంగా అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ రాధికా ఆప్టే పేరు పెద్దగా వినిపించడం లేదు. ఇటీవల విక్రమ్ వేద, మోనికా ఓ మై డార్లింగ్ చిత్రాల్లో మెరిసింది.
సన్నగిల్లిన అవకాశాలు
ప్రస్తుతానికి ఈ బోల్డ్ బ్యూటీ మెగా ఫోన్ పట్టుకుంది. స్లీవ్ వాకర్స్ అనే షార్ఠ్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించింది. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.