Border Gavaskar Trophy 2023: భారత స్పిన్నర్ల ధాటికి కుప్పకూలిన ఆస్ట్రేలియా
బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు ఆస్ట్రేలియాను చుట్టేశారు. 177 పరుగులకే ఆలౌట్ చేశారు.
ఆదిలోనే ఆస్ట్రేయాను భారత పేసర్లు కోలుకోని దెబ్బతీశారు. 2 పరుగులకే 2 వికెట్లు తీసి తొలిసెషన్‌లో ఆధిపత్యం చెలాయించారు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్
ఆస్ట్రేలియా ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(1)ను సిరాజ్ LBWగా వెనక్కి పంపగా.. డేవిడ్ వార్నర్‌ను మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో రెండు పరుగలకే ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది.
లబుషెన్… స్టీవ్ స్మిత్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. లంచ్ విరామానికి మరొక వికెట్ పడకుండా వీరిద్దరు జాగ్రత్తపడ్డారు.
లంచ్ విరామానికి 72/2
లంచ్ విరామం తర్వాత ప్రమాదకర భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్న ఈ జోడిని రవింద్ర జడేజా అద్భుతమైన బంతితో (35.5)విడదీశాడు. అరంగేట్రం కుర్రాడు శ్రీకర్ భరత్ లబుషెన్‌ను 49(123)స్టంప్ అవుట్ చేశాడు.
జడేజా మంత్రం
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మాట్ రెన్షా (0 ) LBWగా రవీంద్ర జడేజాకు దొరికిపోయాడు.
కుదురుకున్నట్లు కనిపించిన స్టీవ్ స్మిత్37(107)ను 41.6 ఓవర్లలో రవీంద్ర జడేడా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 113 పరుగులకే ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయింది.
అనంతరం క్రీజులోకి వచ్చి ధాటిగా ఆడుతున్న ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీని 36(33) ఒక అద్భుతమైన బంతి(over 53.1)తో అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఆరు పరుగులకే ప్యాట్ కమిన్స్6(14) అశ్విన్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
అశ్విన్ మాయాజాలం
అనంతరం క్రీజులోకి వచ్చిన టాడ్ మర్ఫీ(0)ని 58.5 ఓవర్‌లో రవీంద్ర జడేజా డకౌట్ చేశాడు. 62.3 ఓవర్‌లో హ్యాండ్స్‌కాబ్‌ను LBWగా పెవిలియన్‌కు సాగనంపాడు.
174/8
చివరి వికెట్‌గా వచ్చిన బోలాండ్‌ను 63.5 ఓవర్‌లో అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా 177 పరుగులకే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది.
177/ఆలౌట్
గాయం తర్వాత కోలుకుని రీ ఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజ 5 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ 3, షమి, సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
రవీంద్ర జడేజా@5
ఈ టెస్టులో 450 వికెట్ల మైలురాయిని అశ్విన్ అధిగమించాడు. ఆసీస్ బ్యాటర్ అలెక్స్ కేరీ వికెట్ తీసి ఈ ఘనతను అందుకున్నాడు. ఇదివరకు కుంబ్లే పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఇది అశ్విన్‌కు 89వ టెస్ట్ మ్యాచ్.
అశ్విన్ @450
ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్, కెఎల్ రాహుల్ భారత్‌కు శుభారంభాన్నిచ్చారు. ఆసీస్ ఇన్నింగ్స్‌కి భిన్నంగా హిట్‌మ్యాన్ తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు కొట్టి ప్రత్యర్థిని కంగారు పెట్టాడు.
ఇండియా ఇన్నింగ్స్:
రోహిత్-రాహుల్ కలిసి తొలివికెట్‌కు 76 పరగులు జోడించారు. 76 పరుగుల వద్ద రాహుల్(20) మర్ఫీకి రిఫ్లెక్స్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అనంతరం అర్ధశతకం సాధించిన రోహిత్(56*), అశ్విన్(0*) క్రీజులో ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో మరో 100 పరుగులు ఆస్ట్రేలియా కంటే వెనుకబడి ఉంది.