ఎలాంటి బంధమైనా కలిసి ఉండటం కష్టమైనపుడు, విడిపోవడం తప్ప మార్గం లేదనుకున్నపుడు, ఇద్దరి సంతోషం కోసం దూరమవడం మంచిదే.
ఏది బెటర్?
ఇలా విడిపోయేందుకు రెండు మార్గాలున్నాయి. కూర్చుని మాట్లాడుకుని వర్కవుట్ కాదని టాటా చెప్పుకోవడం ఇది బ్రేకప్. కానీ ఏమీ చెప్పకుండా, మాట్లాడకుంటా ఒక్కసారిగా నంబర్లు, సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేసి బంధం తెంచుకోవడమే ‘ ఘోస్టింగ్’
బ్రేకప్ & ఘోస్టింగ్
పరిస్థితి, సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు బ్రేకప్, మరికొన్నిసార్లు ఘోస్టింగ్ సరైనది అనిపిస్తుంది. రెండింటిలోనూ సానుకూల వ్యతిరేక అంశాలు ఉన్నాయి.
ఏది సరైనది?
చాలా కాలం కలిసున్న తర్వాత ఇద్దరూ కలిసి మాట్లాడుకుని విడిపోవడం వల్ల పగ, ద్వేషం లాంటివి తక్కువగా ఉంటాయి. విడిపోయాక కోలుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
బ్రేకప్
బ్రేకప్ కొన్నిసార్లు హర్టింగ్‌గా ఉండొచ్చు. మనం చెప్పే కారణాలు అవతలి వారికి తీవ్రమైన బాధను కలిగించొచ్చు. గతాన్ని చర్చిస్తున్నపుడు మనకూ తీవ్రమైన క్షోభ కలగవచ్చు
బ్రేకప్ టాక్‌ను భరించలేని వారు ఘోస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. వారితో మాట్లాడటం ఇష్టంలేకపోయినా, మాట్లాడటం వల్ల సమస్య మరింత జటిలమవుతుందనుకున్నా ఘోస్టింగ్ ఆప్షన్ బెటర్‌గా ఉంటుంది.
ఘోస్టింగ్
కొన్నిసార్లు అవతలి వారి మనోభావాలు దెబ్బతీయకూడదు అనుకున్నపుడు ఘోస్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. తప్పు తనవైపు ఉన్నపుడు కూడా తలెత్తుకోలేని స్థితిలో ఘోస్టింగ్‌ను ఎంచుకుంటున్నారు.
- అవతలి వ్యక్తి అగౌరవంగా ఉండటం
- సెక్సువల్‌గా మూవ్ అవ్వాలని ప్రయత్నించడం
- అసభ్యకర సందేశాలు పంపడం
ఓ స్టడీ ప్రకారం డేటింగ్‌లో ఘోస్టింగ్‌కు ప్రధానంగా పలు కారణాలు చెప్పారు
బ్రేకప్‌లో ఇద్దరి ప్రమేయం ఉంటుంది. ఘోస్టింగ్‌లో ఒక్కరే ఉన్నఫళంగా మాయమైపోతారు. దీనివల్ల మరో వ్యక్తిపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
బ్రేకప్ vs ఘోస్టింగ్
అవతలి వ్యక్తి తనను ఎందుకు వదిలేశారో అనే ఆలోచనతో డిప్రెషన్‌లోకి వెళ్లొచ్చు. తానేం తప్పు చేశానో అని ఆలోచిస్తూ మానసికంగా కుంగిపోవచ్చు.
బ్రేకప్ కన్నా ఘోస్టింగ్ కొన్నిసార్లు ప్రమాదకరం. బ్రేకప్‌లో గిఫ్ట్‌లు, ఇతర ఫోటోలు, వీడియోలు పూర్తిగా ఒకరివొకరు ఇచ్చేసుకుని డిలీట్ చేసుకుంటారు. కానీ ఘోస్టింగ్ వల్ల వీటితో ప్రమాదం ఉండొచ్చు.
ఘోస్టింగ్‌కు గురైన వ్యక్తి మీపై పగ, కక్ష పెంచుకోవచ్చు. మాటైనా చెప్పకుండా వెళ్లిపోయారనే కోపంతో ఎలాంటి
దారుణాలకైనా తెగబడొచ్చు.
బంధం విషపూరితమైనపుడు విడిపోవడం మంచిదే. కానీ అది మరింత విషపూరితం కాకూడదు. తక్కువ పరిచయమున్న వ్యక్తిని ఘోస్ట్ చేయడం ఓకే గానీ… చాలాకాలం కలిసి ప్రయాణించిన వారిని ఘోస్ట్ చేయడం అంత సరైన నిర్ణయం కాకపోవచ్చు.
మీకోసం YouSay
ఒకవేళ ఘోస్టింగ్‌కు గురైనా మానసికంగా దృఢంగా ఉండండి. మిమ్మల్ని ప్రేమించేవారి సాన్నిహిత్యం తీసుకోండి. మిమ్మల్ని ప్రేమించేవారు ఈ లోకంలో ఒక్కరే లేరని గమనించండి.