బ్రూస్ లీ’ చిత్రాలు

జీవితంలో తప్పక చూడాల్సిన

బ్రూస్ లీ.. మార్షల్ ఆర్ట్స్‌కి దేవుడు. ఇది ఏ ఒక్కరో చెప్పిన మాట కాదు. జాకీ చాన్‌తో సహా ఎంతోమంది చెప్పిన సత్యం. ఇప్పటివరకు బ్రూస్‌ లీ చిత్రాలు చూడకపోతే.. అతడి గురించి తెలుసుకోకపోతే జీవితమే వ్యర్థం.

కొన్ని కారణాల వల్ల బ్రూస్ లీ 32వ ఏటనే చనిపోయారు. ఒకవేళ అలా జరగకపోయి ఉంటే ప్రపంచవ్యాప్తంగా హలీవుడ్ హీరోలనే తలదన్నే గొప్ప కథానాయకుడిగా గుర్తింపు పొందేవాడు. లీ నటించిన కొన్ని క్లాసిక్ చిత్రాలు మరిచిపోలేనివి. వాటి గురించి తెలుసుకుందామా..!

మార్షల్ ఆర్ట్స్‌పై తెరకెక్కిన అద్భుతమైన చిత్రం ‘ఎంటర్ ది డ్రాగన్’. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యోధులతో పోరాడేందుకు బ్రూస్ లీ వెళతాడు.

1 . ఎంటర్ ది డ్రాగన్ (1973)

సినిమా కొద్దిగా నెమ్మదిగా సాగినప్పటికీ..యాక్షన్ సన్నివేశాలు కట్టి పడేస్తాయి. బ్రూస్ లీ పోరాటాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఆశ్చర్యమేమిటంటే.. ఇందులో నిజంగా నాగుపామును పట్టుకొని లీ ఫైట్ చేశాడు.

పగ, ప్రతీకారాలపై సాగిన చిత్రాలు ఎన్నో చూసి ఉంటాం. ‘ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ’ ఈ కోవలోకే వస్తుంది. బ్రూస్ లీని ఎందుకు గొప్పవాడు అంటారో? ఇందులో అతడు చేసిన నాన్‌చాక్స్ చూస్తే అర్థమవుతుంది.

2. ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ ( 1972 )

ఇందులో కుంగ్‌ఫూ ఫైటర్‌గా లీ నటించారు. గురువు మృతికి ప్రతీకారంగా బ్రూస్‌లీ ఏం చేశాడనేది ఈ మూవీ సారాంశం.

బ్రూస్ లీ నటించిన బిగ్ బాస్ టైటిల్‌ను ఓ సీరియల్‌కు వాడటం పట్ల చాలామంది అసహ్యించుకుంటారు. ఎందుకంటే వారికి తెలిసిన బిగ్ బాస్ ఒక్కడే బ్రూస్‌ లీ. సినిమాలో నేపథ్య సంగీతం, లీ చేసిన ఫైట్లు వెన్నులో భయాన్ని పుట్టిస్తాయి.

3. ది బిగ్ బాస్ ( 1971 )

తనను ముట్టుకోకుండా శత్రువులతో చేసిన పోరాట ఘట్టాలతో రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఒకవేళ అలా జరగకపోతే మీరు వైద్యులను కలవాల్సిందే.  అదృష్టం కొద్దీ వెండితెరపై  సినిమా చూసే అవకాశం వస్తే అస్సలు వదులుకోవద్దు.

చెక్ నోరీస్ గురించి వినే ఉంటారు. అతడి మీమ్స్ చూసే ఉంటారు. ఈ సినిమాలో చెక్‌ నోరీస్, బ్రూస్ లీ మధ్య వచ్చే మార్షల్ ఆర్ట్స్ యుద్ధం ఊపిరి సలపనివ్వదు. ఇంతకముందు తీసిన మార్షల్ ఆర్ట్స్ సన్నివేశాల్లో అన్నింటికంటే ఇదే అత్యద్భుతం.

4. ది వే ఆఫ్ డ్రాగన్ (1972 )

ఈ చిత్రానికి బ్రూస్ లీ కథను అందించడంతో పాటు స్వయంగా దర్శకత్వం వహించారు. సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. లీ దర్శకత్వం వహించిన ఒకే ఒక్క సినిమా ఇదే కావడం విశేషం.

1970లో వచ్చిన బ్రూస్ లీ చిత్రాల నుంచి సన్నివేశాలను ఎన్నో దేశాలు, ఎన్నో భాషల్లో కాపీ కొట్టారు. ఏదీ ఏమైనా ఇవి ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు. ఇలాంటి చిత్రాలే లీని ఆస్థాయిలో నిలబెట్టాయి. ఈ సినిమాలు చూసిన తర్వాత కచ్చితంగా మనం బ్రూస్ లీని ప్రేమిస్తాం.

ఎన్నో భాషల్లోకి..