ICC తొలిసారి నిర్వహించిన అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత యువ క్రికెటర్లు విశ్వవిజేతలుగా నిలిచారు. ఇందులో కొందరి ప్రదర్శన చూస్తే రాబోయే రోజుల్లో మహిళా క్రికెట్‌లో మార్మోగిపోయేలా కనిపించారు.
టోర్నమెంట్ మొత్తంలో భారత జట్టుకు ఈమెనే హైలైట్. వుమన్ రన్ మెషీన్‌గా శ్వేతపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అద్భుతమైన బ్యాటింగ్‌తో కళ్లు చెదిరే షాట్లతో ఫ్యూచర్ స్టార్‌గా ముద్ర వేసుకుంది.
శ్వేత సెహ్రావట్
శ్వేత సెహ్రావట్ టోర్మమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. సగటున 99 పరుగులతో శ్వేత 297 పరుగులు చేసింది. 74 నాటౌట్, 92 నాటౌట్ వంటి బిగ్ ఇన్నింగ్స్‌తో ఇండియాకు ఘనవిజయాలు అందించింది.
బెస్ట్ బ్యాటర్
అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన వారిలో రెండో ప్లేయర్ షెఫాలి వర్మ. 172 పరుగులతో ఓవరాల్‌గా ఈమె మూడో స్థానంలో ఉంది.
షెఫాలి వర్మ
ఓ మ్యాచ్‌లో 78 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన షెఫాలి వర్మ.. కప్ అందుకుంటున్నపుడు ఎమోషనల్ అయి అందరినీ కదిలించింది. రాబోయే రోజుల్లో టీమిండియా కెప్టెన్‌గా ఎదగబోతోందనడంలో సందేహమే లేదు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలంకు చెందిన ఈ తెలుగు బిడ్డ భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. ఫైనల్‌లో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు 24 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి విజయతీరాలకు చేర్చింది.
గొంగిడి త్రిష
టీమిండియా నుంచి త్రిష మూడో టాప్ స్కోరర్. 7 మ్యాచుల్లో 116 పరుగులు చేసింది. స్కాంట్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా పంపించినా సత్తా చాటి టీమిండియాకు ఘన విజయం అందించింది.
టోర్నమెంట్ మొత్తం అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న యంగ్ బౌలర్ పార్శవి చోప్రా. భారత్ సెమీస్ చేరడంలో పార్శవి చోప్రా( 3-20 )ది కీలక పాత్ర.
పార్శవి చోప్రా
శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు ఇచ్చిన 4 వికెట్లు తీసిన పార్శవి చోప్రా. ఇండియా తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసింది. 11 వికెట్లతో టౌర్నమెంట్‌లో రెండో బెస్ట్ బౌలర్‌గా నిలిచింది.
టీమిండియా విజయాల్లో తనదైన ఆటను కనబర్చిన మరో యంగ్ బౌలర్ మన్నత్ కశ్యప్ 9 వికెట్లతో భారత్‌కు రెండో బెస్ట్ బౌలర్‌గా నిలవడమే గాక, టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది.
మన్నత్ కశ్యప్
బ్యాటింగ్‌లో రీచా గోష్, సౌమ్య తివారీ, బౌలర్లలో అర్చన కూడా టీమిండియా తరఫున అదరగొట్టారు. రానున్న రోజుల్లో వీరు కూడా తమ నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటూ స్టార్లుగా ఎదిగారు.