ఇంగ్లాండ్ జట్టుపై భారత్ గెలవగలదా...

చరిత్ర ఏం చెబుతోంది?

YouSay Short News App

టీ20 వరల్డ్ కప్‌ తుది అంకానికి చేరుకుంది.  9న న్యూజిలాండ్‌తో పాకిస్థాన్,  10న ఇండియాతో ఇంగ్లాండ్ తలపడనున్నాయి.

సెమీస్ పోరు..

టీ20 ప్రపంచకప్‌లో పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్, భారత్ మ్యాచ్ జరుగతుండటం, పైగా తొలిసారి నాకౌట్ పోరులో  తలపడుతుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

10ఏళ్ల తర్వాత..

ఇదివరకు ఇరు జట్లు మూడు సార్లు మాత్రమే వరల్డ్‌కప్ పోరులో తలపడ్డాయి. రెండుసార్లు గెలిచి టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది

మనదే ఆధిపత్యం..

తొలిసారిగా 2007 ప్రపంచకప్‌లో పోటీపడ్డాయి.  ఈ మ్యాచ్‌లోనే యువరాజ్ సింగ్ 6బంతుల్లో  6 సిక్సర్లు బాదాడు. అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీనీ(12బంతుల్లో) నమోదు చేశాడు. దీంతో 18 పరుగుల తేడాతో విజయం ఇండియా వశమైంది.

తొలిదెబ్బ అదుర్స్..

2009 వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలోనే మరోసారి భారత్‌తో ఇంగ్లాండ్ తలపడింది. ఈ సారి అదృష్టం ఇంగ్లాండ్ వైపు నిలిచింది. కానీ, విజయం కోసం ఆంగ్లేయులు పోరాడాల్సి వచ్చింది. కేవలం  3 పరుగులతో గట్టెక్కారు.

స్వల్ప తేడాతో..

2012లో మూడోసారిగా భారత్‌తో ఇంగ్లాండ్ సై అంది. కిందటి ఊపును కొనసాగించాలని ఇంగ్లాండ్, ఎలాగైనా గెలవాలని భారత్ కసిగా ఆడాయి. ఈ మ్యాచులో ఇంగ్లాండ్ 80 పరుగులకే కుప్పకూలింది. 90 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందడం విశేషం.

గర్జించిన టీమిండియా

నాటితో పోలిస్తే నేడు ఇంగ్లండ్‌ బలమైన జట్టు. బట్లర్, మొయిన్ అలీ, సామ్ కర్రన్, అలెక్స్ హేల్స్, లివింగ్ స్టోన్ ఆటగాళ్లు చాలా ప్రమాదకరం. వీరికి ఇండియాపై మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం వీరికి బాగా కలిసొస్తుంది.

ఇప్పుడు వీరు డేంజర్

భారత్‌కు వెన్నెముకగా నిలుస్తున్న వీర్‌సూర్‌(విరాట్- సూర్య) ద్వయం మరోసారి చెలరేగాలని అభిమానులు ఆశిస్తున్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ కుదురుకుని జట్టుకి గౌరవప్రదమైన స్కోరును అందించడంలో వీరి పాత్ర ఎనలేనిది. వీరే బ్యాటింగుకి ప్రధాన బలం.

విరాట్, సూర్య అండగా..

టీమిండియా బౌలింగ్ దళం రాణించడం శుభపరిణామం. అర్షదీప్, భువనేశ్వర్, షమిలతో కూడిన పేస్ త్రయం ప్రత్యర్థి బ్యాటర్లను సమర్థంగా కట్టడి చేస్తోంది. ఆల్‌రౌండర్ హార్దిక్ వీరికి తోడుగా నిలుస్తున్నాడు. అశ్విన్, అక్షర్‌ల నుంచి తమ స్థాయి ప్రదర్శనను జట్టు ఆశిస్తోంది.

బౌలింగ్ సానుకూలంగా

27. ఆడిన ఐదు మ్యాచుల్లో ఓపెనర్లు రోహిత్, రాహుల్‌ల అత్యధిక భాగస్వామ్యం ఇది. వ్యక్తిగతంగా రాహుల్ గత రెండు ఇన్నింగ్సుల్లో రాణించినప్పటికీ పార్ట్‌నర్‌షిప్ లేకపోవడం కలచివేస్తోంది. మిడిలార్డర్‌పై భారం పడుతోంది.

తడబడుతున్నారు..

టీ20ల్లో ఇంగ్లండ్‌పై రోహిత్‌కు మంచి రికార్డు ఉంది. 13 ఇన్నింగ్స్‌లో 34.81 యావరేజ్‌తో 143.44 స్ట్రయిక్‌ రేట్‌తో 383 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది.

ఇంగ్లండ్‌పై రోహిత్‌ అదరహో

మ్యాచ్‌కు వేదిక అడిలైడ్. ఈ వరల్డ్‌కప్‌లో ఇక్కడ జరిగిన ఆరు మ్యాచుల్లో నాలుగింటిని తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. సాధారణంగా పిచ్ బ్యాటర్లకు అనుకూలం. బౌండరీ కూడా చిన్నదే. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ.

అడిలైడ్..

నాకౌట్ మ్యాచుల్లో అంపైర్ల నిర్ణయాలు జట్టు ఫలితాన్నే మార్చేస్తాయి. ఈ పోరుకి కుమార ధర్మసేన(శ్రీలంక), రీఫెల్(ఆస్ట్రేలియా) అంపైర్లుగా చేయనున్నారు. 2019 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌కు అదనంగా 5 పరుగులు ఇచ్చింది కుమార ధర్మసేననే. క్రిస్ గఫానే(న్యూజిలాండ్) థర్డ్ అంపైర్‌.

అంపైర్లు

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(C), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్/ కార్తీక్(wk), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్/ చాహల్, అశ్విన్, భువి, షమి, అర్షదీప్.

అంచనా జట్లు

ఇంగ్లాండ్:

భారత్:

బట్లర్, హేల్స్, మొయిన్ అలీ, స్టోక్స్, బ్రూక్, లివింగ్ స్టోన్, సామ్ కర్రన్, మార్క్ వుడ్, జోర్డాన్, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్.