నటనకు కేరాఫ్ విజయ్ సేతుపతి

ఈ 5 సినిమాలు తప్పక చూడాల్సిందే 

YouSay Short News App

విలక్షణ నటనతో తనకంటూ ఓ క్రేజ్‌ని సొంతం చేసుకున్న నటుడు విజయ్ సేతుపతి. హీరోగా, విలన్‌గా, సపోర్టింగ్ యాక్టర్‌గా సేతుపతి తనదైన ముద్ర వేశాడు. పాత్ర ఏదైనా, ఘట్టం ఏదైనా సేతుపతి నటనకు దాసోహం కావాల్సిందే. అందుకే ఈ నటుడికి ‘మక్కల్ సెల్వన్’ అనే పేరొచ్చింది.

విజయ్ సేతుపతి నటనకు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులున్నారు.సేతుపతి నటించిన  ఈ తెలుగు సినిమాలను అస్సలు మిస్ చేసుకోవద్దు.

విక్రమ్ - Hotstar & Zee5

కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్‌లతో విజయ్ సేతుపతి పోటీ పడి నటించిన చిత్రం ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు.

విక్రమ్ సినిమాలో సేతుపతి పాత్ర విశిష్ఠమైంది. సాధారణ ప్రజలకు అతడొక డాక్టర్. పోలీసులకు మాత్రం డ్రగ్స్ సరఫరా చేసే క్రిమినల్. ‘సంతానం’ పాత్రతో ఈ వేరియేషన్లను చూపిస్తూ విజయ్ సేతుపతి విలనిజాన్ని పండించాడు.

ఈ సినిమాలో బెస్ట్ సీన్ అంటే గుర్తొచ్చేది ‘సంతానం’ ఇంట్రడక్షన్ సీనే. శరీరంపై చొక్కా లేకుండా కొవ్వు పట్టిన శరీరంపై పచ్చబొట్టుతో ఇచ్చే ఎంట్రీ అదరగొడుతుంది. సినిమాలో కొన్నిసార్లు కమల్ హాసన్, ఫహద్‌తో పోటీ పడి మెప్పించాడు.

డ్రగ్స్ సరఫరా దారుగా తనలోని క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూనే ‘సంతానం’ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. ఫ్యామిలీ అంటే సంతానంకు తెగ ఇష్టం. అదే వీక్‌నెస్‌గా కనిపిస్తుంది.

మాస్టర్ - Zee5

మాస్టర్ సినిమాలో విలన్‌గా నటించాడు మక్కల్ సెల్వన్. ‘భవానీ’ పాత్రలో ఒదిగిపోయాడు. విలువైన వస్తువులు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు భవానీ.

ఈ సినిమాలో ‘భవానీ’ చేసే ఫైట్లు ప్రేక్షకులకు వణుకు పుట్టిస్తాయి. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సేతుపతిలోని అన్ని కోణాల్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు.

ఇందులో ‘భవానీ’ది ప్రత్యేక శైలి. ప్రత్యర్థులకు  రెండు నిమిషాలు సమయమిచ్చి చంపించే విధానం ఆకట్టుకుంటుంది.

ప్రొఫెసర్ జేడీ(విజయ్ దళపతి)తో భవానీ మధ్య జరిగే సన్నివేశాలు మరోస్థాయిలో ఉంటాయి.  ఈ సినిమాలోని ‘భవానీ’ పాత్రలో సేతుపతిని తప్ప మరొకరిని ఊహించలేం. ఈ పాత్రపై అలాంటి ముద్ర వేశాడు విజయ్ సేతుపతి.

పేట - Netflix

2019లో విడుదలైన రజినీకాంత్ ‘పేట’ సినిమాలో ‘జిత్తు’ అనే రౌడీ పాత్రలో నటించాడు విజయ్ సేతుపతి. ఈ పాత్రలో అదరగొట్టి ప్రేక్షకులను అబ్బురపరిచాడు.

విలన్‌గా సేతుపతి రజినీకాంత్‌తో పోటీ పడి నటించాడు. భజరంగ్ దళ్ సంస్థకు నేతగా కనిపించి ప్రేమికులకు వివాహాలు చేయడం వంటి సీన్లతో అలరించాడు.

రజినీకాంత్, విజయ్ సేతుపతి మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. తెరపై తన ప్రదర్శనతో ఆడియెన్స్ దృష్టిని ఆకర్శించాడు విజయ్.

తండ్రి లేని కొడుకుగా విజయ్ భావోద్వేగాలను పండించాడు. తన నటనతో ప్రేక్షకులను ఏడిపించేశాడు.

చివరి వ్యవసాయ దారుడు - Sony Liv

ఎం.మణికందన్ దర్శకత్వం వహించిన చిత్రం.. ‘చివరి వ్యవసాయదారుడు’. వ్యవసాయమే జీవనాధారంగా సాగించే ఓ వృద్ధుడి పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది.

రామయ్య పాత్రలో విజయ్ సేతుపతి ఆశ్చర్యపరిచాడు. మానసికంగా కుంగిపోయినట్టుగా కనిపిస్తూ మక్కల్ సెల్వన్ జీవించేశాడు. రామయ్యను ఓ పిచ్చోడిలా ఈ సినిమాలో ప్రజలు భావిస్తారు.

అన్నీ కోల్పోయి.. ప్రాణాలపై ఏ మాత్రం ఆశలు లేకుండా బతికే ‘రామయ్య’గా విజయ్ కన్నీరు పెట్టిస్తాడు. కుమారస్వామికి అపర భక్తుడిగా కనిపించాడు.

క్యాపిటలిజానికి వ్యతిరేకంగా పోరాడే ఓ వృద్ద రైతు కథ మరోవైపు జరుగుతుంటుంది. ‘రామయ్య’గా కొద్దిసేపే తెరపై కనిపించినా ప్రేక్షకులకు గుర్తిండిపోయేలా నటించాడు సేతుపతి.

ఉప్పెన - Netflix

‘రాయనం’గా పవర్‌ఫుల్ జమీందారీగా కనిపించిన సినిమా ‘ఉప్పెన’. తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు విజయ్ సేతుపతి. పరువు కోసం ఏమైనా చేసే వ్యక్తిత్వాన్ని సులువుగా ప్రదర్శించాడు మక్కల్ సెల్వన్.

ఓ బస్తీ కుర్రాడితో తన కూతరు ప్రేమలో పడటాన్ని ‘రాయనం’ సహించ లేకపోతాడు. తన పరువు, మర్యాదలకు భంగం కలుగుతుందని భావిస్తాడు. ఈ పాత్రలో సేతుపతి జీవించేశాడు.

ఈ చిత్రం చూశాక ప్రేక్షకులకు ‘రాయనం’ పాత్ర గుర్తిండిపోతుంది. తండ్రిగా, జమీందారుగా విజయ్ సేతుపతి ప్రేక్షకులను మెప్పించాడు. క్రూరత్వం ప్రదర్శిస్తూనే మనసులోని ప్రేమను కళ్లలో చూపించేలా నటించాడు విజయ్ సేతుపతి.