అరుదైన వ్యాధులతో బాధపడుతున్న సెలబ్రెటీలు

YouSay Short News App

స్వీటీకి ఉన్న వ్యాధి గురించి చెబితే ఆశ్చర్యపోతారు. తనకు నవ్వే జబ్బు ఉందని ఇటీవల అనుష్క వెల్లడించింది. ఏదైనా సన్నివేశం వస్తే ఏకధాటిగా 20 నిమిషాలు నవ్వుతూనే ఉంటానని చెప్పింది.

అనుష్క శెట్టి

గుండెజబ్బుతో బాధపడుతున్నట్లు రేణు దేశాయ్ వెల్లడించింది. ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు రేణు దేశాయ్ చెప్పింది.

రేణు దేశాయ్

మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత ఇటీవల వెల్లడించింది. శరీర వ్యాప్తంగా కండరాల్లో తీవ్రమైన నొప్పి కలిగేలా చేస్తుందీ వ్యాధి. ఒక్కోసారి బెడ్‌పై నుంచి లేవాలంటే చాలా అవస్థలు పడేదట.

ఈ కష్ట కాలంలో సమంతకు అభిమానులు అండగా నిలిచారు. త్వరగా కోలుకుంటావని సామ్‌కు భరోసానిచ్చారు. అయితే, సమంత లాగే చాలా మంది సెలబ్రిటీలు అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఓ అరుదైన వ్యాధికి బాధితుడే. మెదడు, ముఖ భాగాన్ని కలిపే కపాల నాడీలో రక్తపీడనం పెరగడం వల్ల తీవ్ర వాపు కలుగుతుంది. ఫలితంగా ఈ వ్యాధి వస్తుంది. దీనివల్ల తన దవడలను కదల్చలేక పోయేవాడినని సల్మాన్ చెబుతుండేవాడు.

సల్మాన్ ఖాన్: ట్రైజెమినల్ న్యూరాల్జియా

వినికిడి సమస్యతో బాధపడుతున్న హీరో.. వరుణ్ ధావన్. చెవిలోని సమన్యాయ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో ఈ సమస్య ఏర్పడుతుంది. దీన్నే వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్‌గా పిలుస్తారు.

వరుణ్ ధావన్: వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్

సింగర్, గేయ రచయిత సెలెనా గోమెజ్ తను ల్యుపస్ అనే చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు 2015లోనే వెల్లడించింది. ఈ అరుదైన వ్యాధి గురించి విస్తృత అవగాహన కల్పిస్తోంది. మానసిక రుగ్మతలపై కూడా ఈ నటి ప్రచారం చేస్తోంది.

సెలెనా గోమెజ్: ల్యుపస్

2016లో గిగి హ్యాడిడ్‌కి ఈ బ్యాక్టీరియా వ్యాధి నిర్ధారణైంది. థైరాయిడ్ కణాలపై బ్యాక్టీరియా దాడి చేస్తూ ఉండటం వల్ల చివరికి థైరాయిడ్ గ్రంథి పనిచేయకుండా పోతుంది.

గిగి హ్యాడిడ్: హషిమోటో వ్యాధి

కెరటోసిస్- పైలారిస్ అనే అరుదైన వ్యాధితో సతమతమవుతున్నట్లు గతేడాది యామి గౌతమ్ వెల్లడించింది. ఈ వ్యాధి బారిన పడితే మొహంపై చిన్న చిన్న దద్దుర్లు ఏర్పడుతుంటాయి.

యామి గౌతమ్: కెరటోసిస్ పైలారిస్

షూటింగు సమయాల్లో తలకు తగిలిన గాయాల వల్ల మెదడులో రక్తం గడ్డకట్టింది. దీనివల్ల హృతిక్ క్రానిక్ సబ్ డ్యూరల్ హెమటోమా వ్యాధి బారిన పడ్డాడు. అయితే, మెదడులోని గడ్డకట్టిన రక్తాన్ని తొలగించి వైద్యులు ఆపరేషన్‌ని విజయవంతం చేశారు.

హృతిక్ రోషన్: క్రానిక్ సబ్ డ్యూరల్ హెమటోమా

2014లో తాను అడిసన్ వ్యాధికి గురైనట్లు సుస్మిత వెల్లడించింది. శరీరానికి అవసరమైన హార్మోన్లను అడ్రినల్ గ్రంథి ఉత్పత్తి చేయదు. అప్పట్లో చాలా కష్టంగా ఉండేదని, అనునిత్యం వ్యాయామం చేస్తూ నెమ్మదిగా ఈ వ్యాధి నుంచి కోలుకున్నానని చెప్పింది.

సుస్మితా సేన్: అడిసన్ వ్యాధి

కాఫీ, జ్యూస్ వంటివాటిని తీసుకుంటే తనకు రెండు రోజుల వరకు నిద్ర పట్టదని జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. హైలీ సెన్సిటివ్ డిసార్డర్(HSP) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు అనుదీప్ వెల్లడించాడు.

అనుదీప్ కేవీ: హైలీ సెన్సిటివ్ డిసార్డర్(HSP)